Adani FPO: అదానీ ఎంటర్‌ప్రైజెస్ తన అతిపెద్ద ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్‌ను (Adani Enterprises Calls Off FPO) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అందులో డబ్బులు పెట్టిన ఇన్వెస్టర్లు అందరికీ తిరిగి డబ్బులు చెల్లించనున్నట్లు ఫిబ్రవరి 1న ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఎక్స్చేంజి ఫైలింగ్‌లో తెలిపింది అదానీ ఎంటర్‌ప్రైజెస్. అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) ఇటీవల అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. మార్కెట్లో అస్థిరత కొనసాగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది అదానీ గ్రూప్. ఈ క్లిష్ట సమయంలోనూ తమపై నమ్మకం ఉంచిన పెట్టుబడిదారులకు కృతజ్ఞతలు తెలిపింది అదానీ ఎంటర్‌ప్రైజెస్.
2023, ఫిబ్రవరి 1న అందానీ ఎంటర్‌ప్రైజెస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం జరిగిందని చెప్పిన కంపెనీ.. సబ్‌స్క్రైబర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్‌లో ముందుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు ఎక్స్చేంజి ఫైలింగ్‌లో తెలిపింది. రూ.20 వేల కోట్ల మెగా ఎఫ్‌పీఓ పూర్తిగా సబ్‌స్క్రిప్షన్ జరిగిందని.. అయితే కొద్దిరోజులుగా అదానీ గ్రూప్ షేర్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోక తప్పట్లేదని స్పష్టం చేసింది.
బిగ్ రిలీఫ్.. ఇక పాన్ కార్డు ఒక్కటుంటే చాలు.. అన్ని గుర్తింపు కార్డులు అవసరం లేదుగా!
ప్రసుతం మార్కెట్లో ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నప్పటికీ, తమకు కష్టకాలం నడుస్తున్నప్పటికీ తమపై నమ్మకం ఉంచిన ఇన్వెస్టర్లకు కృతజ్ఞతలు చెప్పింది అదానీ గ్రూప్. FPO జనవరి 31కే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయినట్లు వెల్లడించింది. అయితే ఇప్పుడు ఇన్వెస్టర్లకు వారి డబ్బులు తిరిగి చెల్లించేందుకు వీలుగా బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్‌తో (BRLMs) కలిసి పనిచేస్తున్నట్లు వివరించింది. అసలు తొలుత FPO సమీకరణ ద్వారా వచ్చే రూ.20 వేల కోట్ల నిధులను సంస్థ విస్తరణ, రుణాల చెల్లింపు కోసం వినియోగించనున్నట్లు పేర్కొంది. కానీ చివరికి ఇలా సీన్ రివర్స్ అయింది.
బడ్జెట్ ప్రసంగాల్లో నిర్మలమ్మకు ఇదే చిన్నది.. అప్పట్లో ఏకధాటిగా మాట్లాడి..!
హిండెన్‌బర్గ్ కంపెనీ కొద్దిరోజుల కిందట అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. స్టాక్ మార్కెట్లో.. అదానీ గ్రూప్ తీవ్ర అవకతవకలకు పాల్పడిందని, అకౌంటింగ్ మోసాలు చేసిందని రెండేళ్లపాటు పరిశోధన చేసి రిపోర్ట్ వదిలింది షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్. దీంతో అప్పటినుంచి అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ దారుణంగా పతనమవుతున్నాయి. దాదాపు 7 లక్షల కోట్ల అదానీ గ్రూప్ మార్కెట్ల్ విలువ పతనమైంది. ఇదే క్రమంలో అదానీ సంపద పెద్ద మొత్తంలో పతనమైంది. దాదాపు 5 ట్రేడింగ్ సెషన్లలో 50 బిలియన్ డాలర్లకుపైగా సంపద ఆవిరైంది. ఇది భారత కరెన్సీలో రూ.4 లక్షల కోట్లకంటే ఎక్కువగానే ఉంటుంది.
ఇక అదానీ సంపద పతనమైన తరుణంలో ఆసియాలో అత్యంత సంపన్నుడి హోదా కోల్పోయారు. తిరిగి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ 75 బిలియన్ డాలర్లతో ఏకంగా 15వ స్థానానికి పడిపోవడం గమనార్హం. 5 రోజుల కిందట మూడో స్థానంలో ఉండటం విశేషం.
Read Latest
Business News and Telugu News
20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.
Also Read:
పన్ను చెల్లింపుదారులకు వరాలు.. శ్లాబుల్లో మార్పులు.. కొత్త పన్ను విధానం ఏంటి? 5 మార్పులివే..
సొంతిల్లు లేని వారికి కేంద్రం శుభవార్త.. బడ్జెట్‌లో భారీగా నిధులు..