TSPSC Group 4 Exam Date 2023 :
తెలంగాణ గ్రూప్-4 పరీక్ష తేదీని TSPSC తాజాగా ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. ఈ ఏడాది జులై 1న గ్రూప్ 4 పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిముషాల వరకు పేపర్ 1.. మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. కాగా.. 8180 గ్రూప్ 4 ఉద్యోగాలకు గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 9 లక్షలకు చేరువలో దరఖాస్తులు వచ్చాయి. నోటిఫికేషన్ ప్రకారం జనవరి 30తో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగియగా.. అభ్యర్ధుల విన్నపం మేరకు తుది గడువును ఫిబ్రవరి 3వ తేదీ వరకు పొడిగించారు.
TSPSC Group 4 : తెలంగాణ గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల.. విభాగాల వారీగా పోస్టులు.. దరఖాస్తు తేదీల వివరాలివే
TSPSC Group 4 Exam Pattern : తెలంగాణ గ్రూప్ 4 పరీక్ష విధానం, సిలబస్, సెక్షన్‌ల వారీగా చదవాల్సిన టాపిక్స్ ఇవే
Singareni : సింగరేణిలో 558 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే
Singareni SCCL Recruitment 2023 : సింగరేణిలో 558 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని సంస్థ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. మొత్తం పోస్టుల్లో 277 పోస్టులను నిరుద్యోగ అభ్యర్థులతో.. మిగిలిన 281 పోస్టులను ఇంటర్నల్ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 558
30 అసిస్టెంట్ ఇంజినీర్ (ఈ 2 గ్రేడ్-ఈ అండ్ ఎం), 20 జూనియర్ ఇంజినీర్ (ఈ 1 గ్రేడ్-ఈ అండ్ ఎం), 4 అసిస్టెంట్ ఇంజినీర్ (ఈ 2 గ్రేడ్-సివిల్), 4 జూనియర్ ఇంజినీర్ (ఈ 1 గ్రేడ్-సివిల్), 11 వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైనీ (ఈ 1 గ్రేడ్), 4 ప్రోగ్రామర్ ట్రైనీ (ఈ 1 గ్రేడ్), 20 జూనియర్ కెమిస్ట్ లేదా జూనియర్ టెక్నికల్ ఇన్‌స్పెక్టర్, 114 ఫిట్టర్ ట్రైనీ (కేటగిరీ-1), 22 ఎలక్ట్రీషియన్ ట్రైనీ (కేటగిరీ-1), 43 వెల్డర్ ట్రైనీ (కేటగిరీ-1), 5 శానిటరీ ఇన్‌స్పెక్టర్ (కేటగిరీ-డి) పోస్టులకు అంతర్గత నియామకాలు చేపడతారు.
మిగతా.. 30 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు; మేనేజ్‌మెంట్ ట్రైనీలు.. మైనింగ్ (79); ఎలక్ట్రికల్, మెకానికల్ (66), సివిల్ (18), ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ (10), ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ (18), ఐటీ (7), హైడ్రోజియాలజిస్ట్ (2), పర్సనల్ (22)తో పాటు 3 జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, 10 జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్, 16 సబ్ ఓవర్‌సీర్ ట్రైనీ (సివిల్) పోస్టుల భర్తీకి నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి రాతపరీక్ష నిర్వహిస్తారు.
BPNL : 2826 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన వాళ్లు అప్లయ్ చేసుకోవచ్చు
BPNL Recruitment 2023 : భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 2826 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టులను బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 5 దరఖాస్తులకు చివరితేది.
పూర్తి వివరాలకు క్లిక్ చేయండి