స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో బరిలోకి దిగనున్నాడు. ఇటీవలే సౌరాష్ట్ర తరఫున తమిళనాడుతో రంజీలో ఆడిన జడ్డూ ఫిట్‌నెస్ నిరూపించుకున్నాడు. ఈ వారంతంలో అతడు భారత జట్టుతో కలవనున్నాడు. కాగా ఈ మధ్య దొరికిన బ్రేక్ సమయంలో హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మను జడేజా బెంగళూరులో కలిశాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఆల్‌రౌండర్‌పై జడేజా ప్రశంసలు గుప్పించాడు. భారత క్రికెట్ భవిష్యత్‌తో సరదాగా గడుపుతున్నానంటూ తిలక్ వర్మతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
గత ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున తిలక్ వర్మ సత్తా చాటిన సంగతి తెలిసిందే. 2020-21 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఏడు మ్యాచ్‌లు ఆడిన వర్మ.. 147.26 స్ట్రయిక్ రేట్‌తో 215 పరుగులు చేశాడు. 2021-22 విజయ్ హజారే ట్రోఫీలో ఐదు మ్యాచ్‌ల్లో 180 రన్స్ చేసిన తిలక్ 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అతణ్ని రూ.1.7 కోట్లకు కొనుగోలు చేసింది.
గత సీజన్లో ముంబై ఇండియన్స్ నిరాశపర్చినప్పటికీ.. తిలక్ మాత్రం ఆకట్టుకున్నాడు. 131.02 స్ట్రయిక్ రేట్‌తో 397 రన్స్ చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. గత సీజన్లో ముంబై తరఫున సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా తిలక్ నిలిచాడు.
ఇక జడేజా విషయానికి వస్తే.. గత సెప్టెంబర్లో మోకాలి గాయం కారణంగా క్రికెట్‌కు దూరమైన జడేజా ఇటీవలే కోలుకున్నాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు బీసీసీఐ అతణ్ని ఎంపిక చేసింది. కానీ ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని సూచించింది. దీంతో తమిళనాడుతో రంజీ మ్యాచ్ ఆడిన జడ్డూ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీశాడు.
ఆసీస్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్.