బులెట్ ఆ ఇంట్లోకి దూసుకొచ్చి అయిదేళ్ళ చిన్నారి ప్రాణాలు తీసింది… ఆ పాప అవయవాలు మరెందరికో ప్రాణం పోశాయి

భారత్‌లో గత ఏడాది జరిగిన గన్ షూటింగ్‌లో ఆరేళ్ల బాలిక తీవ్రంగా గాయపడి మృతి చెందింది. బాలిక మృతితో శోకసంద్రంలో మునిగిపోయిన ఆమె తల్లిదండ్రులు దేశం కోసం ఏదైనా చేయాలన్న ఉద్దేశ్యంతో ఆమె అవయవాలను దానం చేశారు.

ప్రపంచంలో అతిపెద్ద జనాభా గల దేశంగా ఈ ఏడాదే చైనాను అధిగమించనున్న భారతదేశం అవయవాల దానంలో ప్రపంచంలో 62వ స్థానంలో ఉంది.

దిల్లీ శివార్లలోని ఇంట్లో ఐదుగురు సోదరులు, సోదరీమణుల మధ్యలో గత ఏడాది ఏప్రిల్ తన ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతుంది రోలీ ప్రజాపతి. పక్కనున్న గదిలోనే తన తల్లి రాత్రి పూటకు భోజనం సిద్ధం చేస్తున్నారు. ఆ సమయంలో పెద్దగా అరుపులు వినిపించాయి.

గదిలోకి వెళ్లి చూడగా రోలీ తన తల్లిదండ్రులను చూసి గట్టిగా ఏడ్చి స్పృహ తప్పి పడిపోయింది.

తన కుడివైపు చెవిలో నుంచి రక్తం కారడం వాళ్లు గమనించారు. ఏదో జరగరానిది జరిగిందని గుర్తించారు. నోయిడాలో ఉంటున్న వారి ఇంట్లోకి ఒక బుల్లెట్ దూసుకొచ్చి, రోలీకి తగిలింది.

వెంటనే రోలీని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు డాక్టర్లు చెప్పారు. నిందితుడెవరన్నది తమకు స్పష్టంగా తెలియదని, తాము విచారణ  చేస్తున్నామని నోయిడా పోలీసులు బీబీసీకి తెలిపారు.

కొన్ని రోజుల పాటు కుమిలి కుమిలి ఏడ్చిన ఆమె తల్లిదండ్రులు చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆమె అవయవాలను దానం చేయాలనుకున్నారు.

న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్(ఎయిమ్స్)లో అతి పిన్న వయసులోనే అవయవ దాతగా రోలీ నిలిచింది.

తన పాప అవయవాలను దానం చేయాలని అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని ఆమె తండ్రి హర్‌నారాయణ్ ప్రజాపతి వివరించారు.

‘‘నాకేం చేయాలో తెలియదు. రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను. మాకు ఆలోచించుకునేందుకు మరింత సమయం కావాలని అడిగాను. మేము ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాం. మా పాప అవయవాలను దానం చేయడం వల్ల ఒకరి జీవితాన్ని రక్షించినట్టైతే, దాన్ని మేము చేయాల్సిందేనని నిర్ణయించాం’’ అని ప్రజాపతి తెలిపారు.

ఇలా మా కూతురు బతికే ఉంటుందని భావించామని చెప్పారు.

రోలీ కిడ్నీలను 14 ఏళ్ల దేవ్ ఉపాధ్యాయకి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. తమ బాబుకి అవయవాలు లభించడం నిజంగా అద్భుతమని బాబు తల్లిదండ్రులు బీబీసీకి తెలిపారు.

బాబుకి కిడ్నీలు ట్రాన్స్‌ప్లాంట్ చేయించేందుకు నాలుగేళ్ల పాటు వేచి చూశామని, తమ జీవితం పూర్తిగా మారిపోయిందన్నారు. రోలీ కిడ్నీలు దేవ్‌కి సరికొత్త జీవితాన్ని ఇచ్చాయని చెప్పారు.

రోలీ కాలేయాన్ని ఆరేళ్ల బాబుకి అమర్చారు. ఆమె గుండెను మరో చిన్నారికి, శుక్లపటలాలను(కార్నియాలను) 35, 71 ఏళ్ల వ్యక్తులకు అమర్చి కనుచూపు తెప్పించారు.

రోలీ మరణం అచ్చం నికోలస్ గ్రీన్ మాదిరిగానే ఉంది.

  • ద‌ళిత గ్రామాల‌కు రూ.21 లక్షలు ఇచ్చే ఈ ప‌థ‌కం గురించి తెలుసా?
  • ఒక ఫంగస్ మహమ్మారి మనందరినీ జాంబీలుగా మార్చేయగలదా?

1994 సెప్టెంబర్‌లో ఈ ఏడేళ్ల బాలుడు ఇటలీలో తన కుటుంబంతో కలిసి కారులో వెళ్తున్న సమయంలో అతనిపై కాల్పులు చేయడంతో మరణించాడు.

అతని తల్లిదండ్రులు మ్యాగీ, రెగ్‌లు నికోలస్ గ్రీన్ అవయవాలను దానం చేయాలని నిర్ణయించారు.    

అప్పటి నుంచి రెగ్ తన జీవితమంతా అవయవాలను దానం చేయాలని ప్రజలకు పిలుపునిస్తూ పలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

నికోలస్ కాల్పులకు గురికాక ముందు 1993లో ఇటలీలో కేవలం 10 లక్షలకు 6.2 మంది మాత్రమే అవయవాలను దానం చేసేవారు. 2006లో అవయవాల దానం సంఖ్య ప్రతి 10 లక్షలకు 20కి పెరిగింది.

1999లో దేశంలో ఆప్ట్‌ అవుట్ సిస్టమ్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం వారు వద్దంటే తప్ప ఇటలీలో పెద్ద వాళ్లందరూ తాము మరణించాక అవయవాలను దానం చేస్తున్నట్టు పరిగణిస్తారు. దీని ఉద్దేశ్యం సామాన్య ప్రజల మనస్సుల్లో ప్రాణాన్ని రక్షించే అవయవాన్ని దానం చేయాలని ఆకాంక్ష కలిగించడమే.

ఇటలీలో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ మార్పు, భారత్‌లో కూడా త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆశ.  

డాక్టర్ దీపక్ గుప్తా అనే వ్యక్తి భారత్‌లో దీన్ని ముందుండి నడిపిస్తున్నారు. రోమ్ వెళ్లిన డాక్టర్ దీపక్ గుప్తా, నికోలస్ తండ్రి రెగ్‌ను, అవయవ దానాల కమ్యూనిటీలోని ఇతర నిపుణులను కలుసుకున్నారు.

రోలీ బ్రెయిన్ డెడ్ అయినప్పుడు కూడా ఆమె తల్లిదండ్రులను అవయవదానం చేసేలా ఒప్పించేందుకు డాక్టర్ గుప్తా వారితో మాట్లాడారు. దేశంలో ఇంతకుముందు దీని గురించి వినని చాలా మందికి అవయవ దాన ప్రాధాన్యత తెలియజేశారు.

పెద్దగా చదువుకోని రోలీ తండ్రి ప్రజాపతికి నికోలస్‌ను ఉదాహరణగా చూపించి, అవయవ దానం ప్రభావాన్ని తెలియజెప్పారు. భారత్‌లో ప్రతి మూడు నిమిషాలకు ఒక వ్యక్తి తలకు దెబ్బ తగలడం వల్ల మరణిస్తున్నాడని లాన్సెంట్ న్యూరోలాజి కమిషన్ తెలిపింది.

140 కోట్ల మందికి పైగా జనాభా ఉన్న భారత్‌లో 2000 నుంచి ప్రతేడాది సగటున 700 నుంచి 800 మంది ప్రజలు తమ అవయవాలను దానం చేస్తున్నారు.  

మతం, పాత తరానికి చెందిన కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల భారత్‌లో అవయవ దానాలు అంతగా జరగడం లేదని డాక్టర్ గుప్తా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

గత ఏప్రిల్‌లో రోలీ మరణం తర్వాత నుంచి గత ఐదేళ్లతో పోలిస్తే దిల్లీలోని ఎయిమ్స్‌లో అవయవ దానాలు పెరిగాయి.

  • సరోగసీ: సెలబ్రిటీలు తమకోసం పిల్లలను కనే సరోగేట్ మహిళలతో ఎలా ప్రవర్తిస్తారు?
  • థైరాయిడ్ సమస్య: మందులు వాడుతున్నా తగ్గకపోతే ఏం చేయాలి?

ముందు కంటే రెండింతలు ఎక్కువగా భారత్‌లో 2022లో 846 అవయవ దానాలు జరిగాయని నేషనల్ ఆర్గాన్ అండ్ టిస్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ గణాంకాలు చెప్పాయి. ఇది కీలక మలుపు అని డాక్టర్ గుప్తా అన్నారు.

‘‘నేను చాలా నమ్మకంతో ఉన్నాను. నేను న్యూరోసర్జన్‌ని. నా నరాల్లో, రక్తంలోనే విశ్వాసమనేది ప్రవహిస్తుంది. మార్పును  చేపట్టేందుకే మనందరం పుట్టామని నేను నమ్ముతాను’’ అని ఆయన చెప్పారు.

ప్రజల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో సముద్రంలో తానొక చిన్న నీటి బిందువు లాంటి వాడినని అన్నారు.

లాస్ ఏంజిల్స్‌లో ఉన్న తన ఇంటి నుంచి ఇటలీకి వెళ్లిన ప్రతిసారి రెగ్, తన కొడుకు నికోలస్ అవయవాలు అమర్చిన వారిని కలుస్తూ ఉంటారు.

తన ఈ జర్నీలో రెగ్ ఇద్దరు మహిళలను కలుసుకున్నారు. అవయవ దానం వల్ల తమ జీవితాల్లో వచ్చిన మార్పులను ఆయన తెలుసుకున్నారు.

షానా పెరిసెల్లా సోదరుడు డేవిడ్ 2013 మార్చిలో కారు ప్రమాదంలో మరణించారు. అతని గుండెను అన్నా లాక్వింటాకు అమర్చారు.

ఈ ఆపరేషన్ తర్వాత, అన్నా తనకు అవయవం దానం చేసిన వ్యక్తి కుటుంబాన్ని కలుసుకోవాలని నిర్ణయించారు. షానాతో తనకు బలమైన సంబంధం ఏర్పడిందని, తనకు తాను సోదరి లాంటి దానినని చెప్పినట్టు తెలిపారు.

‘‘ఒక వ్యక్తికి గుండె లభించడమన్నది అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే, గుండెను దానం చేసిన వారి మనోవేదనను తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది. కానీ, గుండె దొరికిన వారికి సంతోషం ఉంటుంది. ఇది రెండు రకాల భావోద్వేగాలను కలిగిస్తుంది. నేను చాలా అదృష్టవంతురాల్ని. నన్ను కలుసుకున్నందుకు ఆమె కుటుంబం చాలా సంతోషించింది. వారికి ఇది చాలా పెద్ద కానుకగా అనిపించింది’’ అని అన్నా తెలిపారు.

‘‘నన్ను కలవడం వారి జీవితాల్లో అతిపెద్ద కానుకగా భావించారు. నా వైపు ఇది కేవలం ఓకే. వారితో ఉండి, వారికి థ్యాంక్యూ చెప్పాలనుకున్నాను. కానీ కేవలం ధన్యవాదాలతో సరిపోదు. జీవితాన్ని అందుకున్నందుకు దాని ముందు ఏదీ కూడా సరితూగదు’’ అని తెలిపారు.

  • శరీరంలో ఐరన్ తగ్గుతోందని ఎలా గుర్తు పట్టాలి, పెరగడానికి ఏం తినాలి?
  • గాయాలైనవారు పప్పు తింటే చీము పడుతుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారు

దాతల డేటా

అవయవ దానాల్లో చాలా ఏళ్లుగా స్పెయిన్ ముందంజలో ఉంది. ఎందుకంటే దేశంలో అతిపెద్ద ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లను ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్లుగా పనిచేసేలా శిక్షణ ఇచ్చారు.

‘‘ప్రజలు సహకరించనిదే ట్రాన్స్‌ప్లాంట్ చేయడం సాధ్యం కాందని’’ మాడ్రిడ్‌లోని గ్రేగోరియో మారనన్ యూనివర్సిటీ హాస్పిటల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ డైరెక్టర్ లూయిస్ ఎస్కలాంటే అన్నారు.

రెండు దశాబ్దాల్లో తొలిసారి 2021లో విజయవంతంగా అవయవ దానాలు చేపట్టిన గ్లోబల్ లీడర్‌గా అమెరికా స్పెయిన్‌ను అధిగమించింది.

ఆ తర్వాత ఇటలీ, యూకేలున్నాయి. మే 2020లో ఇంగ్లాండ్ ఆప్ట్ అవుట్ సిస్టమ్‌లోకి మారింది. ఈ విధానం ప్రకారం పెద్ద వాళ్లందరూ కూడా ఆటోమేటిక్‌గా అవయవ దాతలుగా మారిపోతారు.

స్కాట్లాండ్ ఆటోమేటిక్ డొనేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టిన రెండు నెలల్లోనే కొత్త విధానం కింద సుమారు 300 మంది ప్రజలు తమ అవయవాలను దానం చేశారు. వేల్స్ కూడా ఈ కొత్త విధానాన్ని 2015లో ప్రవేశపెట్టింది.

రోమ్ వెళ్లిన తర్వాత రెగ్ తన కొడుకు నికోలస్ కాలేయాన్ని 29 ఏళ్ల క్రితం ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న మారియా పియా పెడలా అనే మహిళ కొడుకు నికోలస్‌ను కలిశారు. ఆమె ప్రస్తుతం కోమాలో ఉన్నారు.

తను చనిపోయినప్పుడు మాత్రమే దీని గురించి మాట్లాడటం ఆపివేస్తానని రెగ్ చెప్పారు.

ప్రస్తుతం తనకి 94 ఏళ్లని, తాను ఇది ప్రారంభించినప్పుడు చాలా పెద్దవాడనని బీబీసీతో అన్నారు.  

ఇవి కూడా చదవండి:

  • తాజ్‌మహల్‌కు పొదిగిన 40 రకాల రత్నాలను బ్రిటిష్ వాళ్ళు దోచుకెళ్లారా?
  • ‘భారతదేశం ముస్లిం పాలకుల బానిస…’ ఈ వాదనలో నిజమెంత?
  • దారా షికోహ్: అన్న తల నరికి తండ్రికి బహుమతిగా పంపిన ఔరంగజేబు
  • ద గ్రేట్ ఎస్కేప్: ఔరంగజేబ్‌ ‘ఆగ్రా జైలు’ నుంచి ఛత్రపతి శివాజీ ఎలా తప్పించుకున్నారు
  • పాకిస్తాన్: కిలో ఉల్లిపాయలు రూ.250… ‘కోయకుండానే కళ్లల్లో నీళ్లు’

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *