Adani group : అదానీ గ్రూప్కు షాకిచ్చిన సిటీ బ్యాంక్

Adani group : అదానీ గ్రూప్కు షాకిచ్చిన సిటీ బ్యాంక్ అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక ఎఫెక్ట్ నుంచి అదానీ గ్రూప్ కోలుకోలేకపోతోంది. స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతోంది. అదానీ ఎంటర్ ప్రైజెస్ సహా ఆ గ్రూపునకు చెందిన స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఎఫీఓను నిలిపివేయడం కూడా షేర్లు పతనానికి కారణమైంది.

ఇదిలా ఉంటే సిటీ బ్యాంక్ కూడా అదానీ గ్రూప్ కి షాకిచ్చింది. అదానీ గ్రూప్ సెక్యూరిటీస్ పై క్లయింట్స్ కు రుణాలు ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. అంబుజా, ఏసీసీ షేర్లు తప్ప మిగిలిన అదానీ సంబంధిత కంపెనీల స్టాక్స్ అన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అదానీ గ్రూపు కంపెనీలకు సంబంధించి  100 బిలియన్ డాలర్ల సంవద ఆవిరైంది. 

©️ VIL Media Pvt Ltd.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *