Coconut water: కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా… అయితే ఈ జబ్బులు కొనితెచ్చుకున్నట్లే..!

Disadvantages of coconut water: కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. ఇది చర్మానికి నిగారింపును ఇస్తుంది. వయసును తగ్గించే లక్షణం కూడా కొబ్బరి నీళ్లలో ఉందని అంటారు. కొబ్బరి నీళ్లతో ముఖం కడుక్కుంటే మీ ముఖం ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. కొబ్బరి నీళ్లను అతిగా తాగితే శరీరానికి హాని కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల మీరు అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. 

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే నష్టాలు

పక్షవాతం వచ్చే అవకాశం

కొబ్బరి నీళ్లలో సోడియం, పొటాషియం మరియు మాంగనీస్ వంటి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అందుకే కొబ్బరినీళ్లను పరిమితంగా తీసుకంటే బాడీకి చాలా మంచిది. కానీ దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో పొటాషియం పరిమాణం పెరిగి.. పక్షవాతానికి గురయ్యే అవకాశం ఉంది. 

అతిసారం రావచ్చు

కొబ్బరి నీళ్లలో మోనోశాకరైడ్లు, పులియబెట్టే ఒలిగోశాకరైడ్లు మరియు పాలియోల్స్ ఉంటాయి. ఇవి షార్ట్ చైన్ కార్బోహైడ్రేట్లు. శరీరంలో ఈ మూలకాల పరిమాణం పెరిగితే… అవి బాడీ నుండి నీటిని పీల్చుకోవడం ప్రారంభిస్తాయి, దీని కారణంగా విరేచనాలు, వాంతులు, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి కొబ్బరి నీళ్లను రోజూ తాగడం మానేసి అప్పుడప్పుడు మాత్రమే తీసుకోండి. 

రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది

మధుమేహం ఉన్నవారు కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగకూడదు. ఇది చక్కెర మరియు అధిక కేలరీలను కలిగి ఉంటుంది, దీని కారణంగా శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.  ఈ వ్యాధి ఉన్నారు కొబ్బరి నీళ్లు తాగాలనుకుంటే వైద్యుడిని సంప్రదించి మాత్రమే తీసుకోండి. 

లో బీపీ రావచ్చు

కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని ఎక్కువగా తాగడం వల్ల బీపీ పడిపోయే అవకాశం ఉంది. దీని వల్ల బాధితుడి ప్రాణం ప్రమాదంలో పడుతుంది.

Also Read: Dates Side Effects: ఈ జబ్బులు ఉన్నవారు ఖర్జూరం ఎక్కువగా తినకూడదట..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link – https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link – https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *