INDW vs SAW: ట్రైసిరీస్ ఫైనల్లో టీమిండియా ఓటమి ఈస్ట్ లండన్: లండన్ లో ఇవాళ సౌతాఫ్రికాతో జరిగిన టీ20 ట్రై సిరీస్ ఫైనల్ లో ఇండియా విమెన్స్ టీమ్ ఓటమి పాలైంది. 110 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది. క్లో ట్రయాన్ 57 పరుగులతో రాణించడంతో సౌతాఫ్రికా గెలుపు ఈజీ అయ్యింది. భారత బౌలర్లలో స్నేహా రానా2, దీప్తి శర్వ, రేణుకా సింగ్, రాజేశ్వరి చెరో tఒక వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సృతి మంధాన డకౌట్ అయ్యింది. హర్లీన్ డియోల్ 46 పరుగులు మినహా మిగతా వారెవరూ పెద్దగా రాణించలేదు. దీంతో 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా 109 పరుగులు మాత్రమే చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో సునే లూస్, ఆయబొంగా ఖాకా ఒక్కో వికెట్ తీశారు. ఈ నెల 10 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
©️ VIL Media Pvt Ltd.