చుట్టూ అమ్మాయిలను చూసి షాక్ అయ్యాడు. వాళ్ల మధ్యలో కూర్చోవాల్సి రావడంతో ఇంకా ఇబ్బందిగా ఫీలయ్యాడు. వందలాది మంది అమ్మాయిలను చూసి ఉక్కిరిబిక్కిరై కళ్లు తిరిగి కిందపడిపోయాడు. ఈ వెరైటీ సంఘటన బీహార్(Bihar)లోని నలంద (Nalanda)జిల్లాలో చోటుచేసుకుంది. బీహార్ షరీఫ్‌లోని అల్లమా ఇక్బాల్ కాలేజీ(Allama Iqbal College)లో ఇంటర్ చదువుతున్న మనీష్‌శంకర్(Manish Shankar)అనే స్టూడెంట్‌కు ఎగ్జామ్స్ రాస్తున్నాడు. బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్(Brilliant Convent School)లో సెంటర్ పడింది. అయితే విచిత్రం ఏమిటంటే అక్కడ 322మంది అమ్మాయిలు ఉన్న రూమ్‌లో మనీష్‌శంకర్ ఒక్కడే అబ్బాయి కావడంతో భయపడిపోయాడు.చుట్టూ అమ్మాయిలను చూసి కళ్లు తిరిగి ఎగ్జామ్ హాల్‌లోనే పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
Kushboo: సినీ నటి కుష్బూకు ఎయిర్‌పోర్ట్‌లో చేదుఅనుభవం .. ఒక్క ట్వీట్‌తో దిగొచ్చిన ఎయిర్ ఇండియా
అమ్మాయిల్ని కళ్లు తిరిగి పడిపోయాడు..
బీహార్ నలంద జిల్లాలో మనీష్ శంకర్‌కుమార్ అనే ఇంటర్ స్టూడెంట్ ఎగ్జామ్ సెంటర్‌లో కళ్లు తిరిగిపడిపోయిన వార్త వైరల్ అయింది. అయితే మనీష్ శంకర్ కుమార్ మ్యాథ్స్ ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడికి వెళ్లగానే గదిలో అందరూ అమ్మాయిలే ఉండటం చూసి జలుబు, తలనొప్పి రావడంతో కంగారుపడి స్పృహ తప్పిపడిపోయాడు. వాస్తవానికి, మనీష్ కుమార్ తన పరీక్షా అప్లికేషన్‌లో పురుషులకు బదులుగా స్త్రీ లింగం టిక్ చేయడం వల్లే అతడ్ని బాలికల ఎగ్జమ్ సెంటర్‌లో వేశారు.
Video viral: 15దోసె ప్లేట్లను ఒకేసారి సర్వ్ చేసిన హోటల్ వెయిటర్‌పై నెగిటివ్ కామెంట్స్ .. వైరల్ వీడియో ఇదే
వైరల్ అవుతున్న వీడియో ..
అయితే అమ్మాయిలను చూసి కళ్లు తిరిగిపడిపోయిన మనీష్‌శంకర్ కుమార్ అపస్మారకస్థితికి వెళ్లడం వల్ల ఆరోజు ఎగ్జామ్ రాయలేకపోయాడు. అయితే మిగిలిన ఐదు పరీక్షలు కూడా అదే సెంటర్‌లో రాయాలని ఇన్విజిలేటర్లు చెబుతున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కేశవప్రసాద్ మాట్లాడుతూ అడ్మిట్ కార్డులో మహిళలతో నింపారని తెలిపారు. దీంతో మనీష్ కేంద్రాన్ని బాలికల పరీక్షా కేంద్రానికి మార్చారు. ఫారమ్‌ను పూరించే సమయంలో పొరపాటు జరిగినందున ఈ సమస్య ఏర్పడింది. ఇప్పుడు వెంటనే విద్యార్థి అదే కేంద్రంలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. తర్వాత లింగ వర్గం సరిదిద్దబడుతుంది.