Bail flying past 30 yard circle after hits Umran Malik 150 km Ball: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా వెలుగులోకి వచ్చిన పేసర్ ‘ఉమ్రాన్ మాలిక్’. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ.. జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2021, 2022లో ఉమ్రాన్ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్‌లను బెంబేలెత్తించాడు. స్థిరంగా 150 కిమీ వేగంతో బంతులు వేస్తూ.. టాప్ బ్యాటర్లకు సైతం సింహ స్వప్నంలా మారాడు. ఓ మ్యాచులో 157 వేగంతో బంతిని సంధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం ఐపీఎల్ టోర్నీలోనే కాదు.. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా సత్తాచాటుతున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా ఉమ్రాన్ మాలిక్ సంధించే పదునైన బంతులకు టాప్ బ్యాటర్లు కూడా చేతులెత్తేస్తున్నారు. బుల్లెట్ మాదిరి దూసుకొచ్చే బంతులకు క్లీన్ బోల్డ్ అవుతున్నారు. తాజాగా న్యూజిలాండ్ విధ్వంసకర ఆటగాడు మైఖేల్ బ్రేస్‌వెల్‌ను ఓ అద్భుతమైన బంతితో ఉమ్రాన్ పెవిలియన్‌కు పంపాడు. ఈ ఘటన గురువారం అహ్మదాబాద్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన కీలకమైన మూడో టీ20లో చోటుచేసుకుంది.
ఉమ్రాన్ మాలిక్ తన ఓవర్‌ను 148.6 కిమీ వేగంతో ఆరంభించాడు. ఉమ్రాన్ బంతులకు మైఖేల్ బ్రేస్‌వెల్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇక బ్యాట్ జులిపించడానికి బ్రేస్‌వెల్ సిద్దవగా.. ఉమ్రాన్ ఈసారి బుల్లెట్ బంతిని సంధించాడు. గంటకు 150 కిమీ వేగంతో దూసుకొచ్చిన బంతి.. బ్రేస్‌వెల్ ఆడే లోపే మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది. స్పీడ్‌కు స్టంప్‌పైన ఉన్న బెయిల్ ఎగిరి.. కీపర్ ఇషాన్ కిషన్, స్లిప్-ఫీల్డర్ సూర్యకుమార్ యాదవ్ తలల మీదుగా వెళ్లి 30 యార్డ్ సర్కిల్ బయటపడింది. ఇది చూసి మైదానంలోని ప్లేయర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఉమ్రాన్ మాలిక్ బుల్లెట్ బంతికి ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్ చేసింది. ‘ఉమ్రాన్ నుంచి అద్భుత డెలివరీ’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడో టీ20 మ్యాచ్‌లో 2.1 ఓవర్లు బౌలింగ్ చేసిన ఉమ్రాన్.. 9 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. మూడో టీ20లో భారత్ ఏకంగా 168 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
Also Read: Boy Exam Hall: పరీక్షా హాలులో అమ్మాయిలు.. చూసి తట్టుకోలేకపోయిన ఇంటర్ విద్యార్థి! చివరికి ఏమైందంటే
Also Read: Dates Side Effects: ఈ జబ్బులు ఉన్నవారు ఖర్జూరం ఎక్కువగా తినకూడదట..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ – https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ – https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.