Vijay Antony Accident : కోలుకున్న విజయ్ ఆంటోని.. తొంభై శాతం రికవరీ అంటూ బిచ్చగాడు 2 సెట్‌లోకి హీరో

Vijay Antony returns to Bichagadu 2 sets బిచ్చగాడు సినిమాతో కోలీవుడ్, టాలీవుడ్‌ సెన్సేషన్‌గా మారిపోయాడు విజయ్ ఆంటోని. అంతకు ముందు డాక్టర్ సలీమ్ సినిమాతోనూ పలకరించాడు. కానీ బిచ్చగాడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అప్పట్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో వంద రోజులు ఆడేసి ఆశ్చర్యపరిచింది. దీంతో విజయ్ ఆంటోని సినిమాలన్నీ కూడా తెలుగులో డబ్ అవుతూనే వచ్చాయి.

కానీ ఏ ఒక్కటి కూడా బిచ్చగాడు రేంజ్లో హిట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. బిచ్చగాడు సీక్వెల్ సినిమా షూటింగ్ సమయంలో విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడ్డాడు. సెట్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఆయన భుజం, మొహం, ముక్కు భాగాలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.

 

దీంతో ఇన్ని రోజులు హాస్పిటల్ బెడ్డు మీదే ఉన్నాడు. ఇప్పుడు ఆయన సెట్స్ మీదకు వచ్చినట్టు తెలుస్తోంది. తొంభై శాతం గాయాలు పూర్తయ్యాయని, సర్జరీలు సక్సెస్ అయ్యాయని, మీ ప్రేమ, అభిమానం, ఆశీర్వాదాల వల్లే ప్రమాదం నుంచి బయటపడ్డాను అంటూ విజయ్ ట్వీట్ వేశాడు.

విజయ్ ఆంటోని సినిమాలకు ఇప్పటికీ తెలుగులో మంచి క్రేజ్, డిమాండ్ ఉంటుంది. ఆయన తీసే సినిమాలు,ఎంచుకునే కథలు కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. ఆయనే కథ, కథనం, మాటలు, సంగీతం కూడా హ్యాండిల్ చేస్తుంటాడు. అలా మల్టీ టాలెంటెడ్ అయిన విజయ్ ఆంటోని తన భార్య పేరు మీదుగా ప్రొడక్షన్ కంపెనీ కూడా ప్రారంభించాడు.

Also Read:  Samantha Russo brothers : నువ్ నాకు దొరకడం నా అదృష్టం.. సమంత పోస్ట్ వైరల్

Also Read: Aha Twitter DP : దెబ్బకు డీపి కూడా మార్చేశారు.. పవన్ కళ్యాణ్‌ కోసం ఆహా అనేలా ప్రమోషన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *