Adani Enterprises: అదానీ గ్రూప్ స్టాక్స్ ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున పతనం అవుతున్న సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ కంపెనీలు అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ పవర్, అదానీ విల్మర్ సహా అంబుజా సిమెంట్స్ ఇలా ఈ షేర్లన్నీ కుదేలయ్యాయి. వీటి మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకుపైగా పతనమైంది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీలు కొన్ని భారీగా పడిపోతున్న క్రమంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ రంగంలోకి దిగింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్ స్టాక్స్‌ను ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి తీసుకొచ్చినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE).
అసలు ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్ అంటే.. అదనపు నిఘా పర్యవేక్షణ అన్న మాట. ఈ లెక్కన ఇన్వెస్టర్లను సంరక్షించేందుకు తీసుకున్న ఒక చర్య మాత్రమే. కానీ ఇది అదానీ స్టాక్స్‌పై ప్రతికూల చర్య ఏమాత్రం కాదని గుర్తుంచుకోవాలి. ఇలా చేస్తే ఇన్వెస్టర్లకు కొంత మేర సంరక్షణగా ఉంటుంది. షార్ట్ సెల్లింగ్‌కు పెద్ద ఎత్తున అడ్డుకట్ట పడుతుంది.
హిండెన్‌బర్గ్ రిపోర్ట్.. FPO రద్దు.. తొలిసారి నోరు విప్పిన గౌతమ్ అదానీ.. అసలేమైందో చెప్పేశారుగా!
ఫిబ్రవరి 3న తీసుకున్న పొజిషన్లకు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే.. 50 శాతం మార్జిన్ లేదా ఇప్పటికే ఉన్న మార్జిన్ ఏది ఎక్కువగా ఉంటే అది వర్తిస్తుంది. ఇక ఫిబ్రవరి 6న తీసుకొనే పొజిషన్లలో 100 శాతం మార్జిన్ ఉంటేనే ట్రేడింగ్ చేసేందుకు వీలుంటుందని ఫిబ్రవరి 2న NSE ఒక సర్క్యులర్ విడుదల చేసింది.
సాధారణంగా ధరల్లో అస్థిరత, పెద్ద ఎత్తున ఫ్లక్చువేషన్స్, అనిశ్చితి, వాల్యూమ్స్‌లో వ్యత్యాసం ఉన్న సమయాల్లో అలాంటి స్టాక్స్‌ను ASM ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి తీసుకొస్తుంటుంది NSE. ప్రైస్ మూవ్‌మెంట్ సరిగా లేదని ఇన్వెస్టర్లకు ఇది ఒక హెచ్చరికగా పనిచేస్తుంది. ఇదే సమయంలో ఆయా స్టాక్స్‌పై ఊహాగానాలకు ముగింపు పలికేందుకు.. కొన్ని ట్రేడింగ్ పరిమితులను కూడా విధిస్తాయి.
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు..! కానీ నిర్మలమ్మ అదెలా తెలుసుకోలేకపోయారు?
అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లో అవకతవకలకు పాల్పడుతోందని, అకౌంటింగ్ ఫ్రాడ్స్ చేస్తుందని ఇటీవల అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేస్తూ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఇదే క్రమంలో అదానీ గ్రూప్‌ను సవాల్ చేస్తూ అవే షేర్లలో షార్ట్ సెల్లింగ్ చేస్తుంది. దీని ప్రకారం.. ఆ స్టాక్స్ పడతాయనో, లేదా పడిపోయేలా చేయడమో చేసి.. లాభాలను సొమ్ముచేసుకుంటుంది. అదానీ స్టాక్స్ పతనంతో.. అదానీ లక్షల కోట్ల నష్టం వాటిల్లగా.. ఆ హిండెన్‌బర్గ్ షార్ట్ సెల్లింగ్ చేసి బిలియన్ డాలర్ల మేర సొమ్ముచేసుకొనే ఉంటుందని తెలుస్తోంది.
సాధారణంగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పద్ధతులు చాలానే ఉంటాయి. షేరు ధర తక్కువగా ఉన్నప్పుడు కొని.. ఎక్కువ ధరకు అమ్మడం ఒకటైతే.. షేరు ధర ఎక్కువ ఉన్నప్పుడు విక్రయించి.. తక్కువ ధరకు వచ్చాక కొనడం ఒకటి ఉంటుంది. దీనినే షార్ట్ సెల్లింగ్ అంటారు. మనకు ఆ స్టాక్ పడిపోతుందని అనిపించినప్పుడు ఈ షార్ట్ సెల్లింగ్ చేయొచ్చు. ఇప్పుడు అదానీ స్టాక్స్ పతనం అవుతున్న నేపథ్యంలో ఈ వారం రోజుల్లో షార్ట్ సెల్లింగ్ చేసిన ఇన్వెస్టర్లకు పెద్ద ఎత్తున లాభం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దానిని అడ్డుకునేందుకు.. షార్ట్ సెల్లింగ్‌లో ట్రేడింగ్ పరిమితులు విధించింది NSE.
అదానీ గ్రూప్ సంచలనం.. ఇన్వెస్టర్లందరికీ తిరిగి డబ్బులు.. అసలేమైంది?
Read Latest
Business News and Telugu News
20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.
Also Read:
హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. అదానీ వ్యవహారంలో రంగంలోకి ఆర్‌బీఐ.. ఏ బ్యాంక్ ఎంతెంత అప్పులిచ్చాయ్? ఏం జరగబోతోంది?
రూ.60 వేల మార్క్‌కు తులం బంగారం ధర.. ఎక్కడెక్కడ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?