Adani News Live: గౌతమ్ అదానీ (Gautam Adani).. దిగ్గజ పారిశ్రామిక వేత్త. 120 బిలియన్ డాలర్లకుపైగా సంపద ఉన్న భారతీయుడు. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానం. ఆసియాలో అత్యంత కుబేరుడు. ఎనర్జీ, పోర్ట్స్, పవర్, గ్యాస్, ఆయిల్.. ఇలా ఎన్నో రంగాల్లో తన వ్యాపారాలను విస్తరించి మకుటం లేని మహారాజు. అయితే ఇదంతా 10 రోజుల కిందటి పరిస్థితి. మరి ఇప్పుడు.. సగానికిపైగా సంపద పతనం.. ఇప్పుడు సంపద 58 బిలియన్ డాలర్లు. అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీ మార్కెట్ విలువ 110 బిలియన్ డాలర్లు పతనం.. ప్రపంచ కుబేరుల జాబితాలో 22వ స్థానం. ఆసియా కుబేరుడి హోదా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి కోల్పోవడం.. ఇదీ జరిగింది. రూ. 20 వేల నిధుల సమీకరణ కోసం వచ్చిన ఎఫ్‌పీఓ ఉపసంహరణ.. ఇప్పుడు పరిస్థితి ఇది. ఇంకా కష్టాల్లోనే. వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్.. సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్.. కృత్రిమంగా షేర్ల విలువను పెంచుతోందని, స్టాక్ మార్కెట్లో తీవ్ర అవకతవకలకు పాల్పడుతోందని, అకౌంటింగ్ మోసాలు చేస్తోందని నివేదిక విడుదల చేసింది. రెండేళ్లకుపైగా పరిశోధన చేసినట్లు వివరించింది. అయితే దీనికి 413 పేజీల్లో అదానీ గ్రూప్ రెస్పాన్స్ ఇచ్చినా.. ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపలేకపోయారు. అదానీ గ్రూప్ స్టాక్స్ పతనం అవుతూనే ఉన్నాయి.
హిండెన్‌బర్గ్ రిపోర్ట్.. FPO రద్దు.. తొలిసారి నోరు విప్పిన గౌతమ్ అదానీ.. అసలేమైందో చెప్పేశారుగా!
ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కూడా అదానీ వ్యవహారం తెరమీదకు వచ్చింది. అదానీ గ్రూప్‌పై దర్యాప్తు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ కోరుతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది.
అయితే ఇదే నేపథ్యంలో.. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ (Pralhad Joshi) కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని మీడియాతో మాట్లాడారు. విపక్షాలకు చర్చించేందుకు, అడిగేందుకు ఏ సమస్యా లేదని, అందుకే ఈ విషయంతో.. పార్లమెంట్ సమావేశాలకు అడ్డు పడుతోందని అన్నారు.
హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. అదానీ వ్యవహారంలో రంగంలోకి ఆర్‌బీఐ.. ఏ బ్యాంక్ ఎంతెంత అప్పులిచ్చాయ్? ఏం జరగబోతోంది?
గతంలో గౌతమ్ అదానీకి ఒక ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీతో సాన్నిహిత్యం గురించి ప్రశ్న ఎదురైంది. అదానీ సంపద పెరిగేందుకు మోదీ తోడ్పడ్డారా అన్న ప్రశ్న ఎదురైంది. దీనిపై మాట్లాడిన గౌతమ్ అదానీ.. అలాంటిదేం లేదని, చాలా మంది ప్రధానుల హయాంలో.. వాళ్లు చేసిన సంస్కరణల వల్ల, తీసుకొచ్చిన కొత్త విధానాల వల్ల.. తమ వ్యాపార అవకాశాలు పెరిగాయని, అందులో అప్పటి ప్రధానులు రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారని అన్నారు. మోదీ, తాను ఒక రాష్ట్రానికి చెందినవాళ్లం అయినందువల్లే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బదులిచ్చారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ
క్లిక్ చేయండి.
Read Latest
Business News and Telugu News
20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.
Also Read:
అదానీకి మరో 4 ఎదురుదెబ్బలు.. అమెరికా ఝలక్.. అదానీ స్టాక్స్ 70 శాతం పతనం.. లక్షల కోట్లు ఆవిరి!
అదానీ స్టాక్స్‌పై SEBI నిఘా.. ఇక అలా జరిగే ఆస్కారమే లేదు! ఇలా చేస్తే ఏమవుతుంది?