అన్ని దారులూ భారత ఉజ్వల ఆర్ధిక భవిష్యత్తు వైపు దారి తీస్తున్నాయి

75 సంవత్సరాల స్వాతంత్ర మైలురాయి పురస్కరించుకొని ఎర్ర కోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ 2047 నాటికల్లా పంచప్రాన్ (PanchPran ) అవలంబన గురించి ప్రస్తావించారు. అభివృద్ధి చెందిన భారతదేశం ఈ పంచప్రాన్ (PanchPran ) యొక్క మొట్టమొదటి లక్ష్యం. ఈ లక్ష్యం సాధించే రహదారి అవస్థాపన అభివృద్ధి ద్వారా సాగుతుంది.

2014 నుంచి భారతదేశం లో వ్యాపార ప్రారంభం, సజావు కొనసాగింపు మరియు సఫలీకృత సాధన కొరకు GOI వ్యూహాత్మక పెట్టుబడులు చేసింది. చెప్పుకోదగ్గ అభివృద్ధి పనుల్లో ఒకటి అవస్థాపన రంగంలో జరిగింది. 63.73 లక్షల కిలోమీటర్ల నిడివి రహదార్ల తో భారతదేశం ప్రపంచం లోనే అతి పెద్ద రెండవ నెట్వర్క్ గా నిలవడమే కాకుండా కళ్ళు చెదిరే వృద్ధి వేగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పింది: రోజుకు 38 కిలోమీటర్ల చొప్పున భారతదేశం రహదార్లు పెరుగుతున్నాయి మరియు I వేగం మరింత పెరగనుంది. మన రహదారులు మొత్తం దేశం లో 64.5 % సరుకు రవాణా మరియు 90 % ప్రయాణికుల రాకపోకలు నిర్వహిస్తాయి.

ఈ అభివృద్ధి గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అనే లఘు అవస్థాపన ప్లాన్ లోని ఒక భాగం. ఏ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధికైనా అవస్థాపన కీలకం. రహదారులు, రైళ్లు, గగన మార్గాలు మరియు జల మార్గాలు బాహ్య ప్రపంచానికి వారధులుగా నిలిచి వ్యాపారం సరళీకృతం చెయ్యడం ద్వారా అనుసంధానించే ప్రదేశాలకు సంపద చేకూరుస్తాయి. అవస్థాపన కు అధిక గుణక ప్రభావం వున్నది. భారతీయ రిజర్వ్ బాంకు మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ మరియు పాలిసీ (National Institute of Public Finance and Policy) అంచనా ప్రకారం ఈ గుణకం 2.50 నుండి 3.50 మధ్య ఉంటుంది- అంటే వెచ్చించిన ప్రతి రూపాయి కి GDP లో Rs 2.50 నుండి 3.50 వరకు పెరుగుదల మనం ఆశించవచ్చు.

ఈ మొత్తం ఎక్కడ ఖర్చుచేశారు అన్నది అత్యంత ముఖ్యం. భారతదేశపు గతి శక్తి పథకం 81 అధిక ప్రభావ పథకాలను ఏకీకృతం చేసింది, వాటిలో రహదారి అవస్థాపన పథకాలకు పెద్ద పీట వేయబడింది . పెద్ద హైవే పథకాలలో ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వే (1,350 కిలోమీటర్లు), అమ్రిత్సర్ – జామ్ నగర్ ఎక్స్ప్రెస్ వే (1,257 కిలోమీటర్లు) మరియు సహరాన్పూర్-దేహరాడూన్ ఎక్స్ప్రెస్ వే (210 కిలోమీటర్లు) భాగం.

ఇది ఇక లక్ష్య ఉద్దేశ్యం: వివిధ భాగస్వాములను ఒక వేదికపైకి తీసుకురావడం మరియు బహుళార్థ మోడల్ సంధాయకత నిర్మాణానికి కావలసిన బ్లూప్రింట్ తయారుచెయ్యడం. బహుళార్థ మోడల్ సంధాయకత అంటే సరుకులు మరియు ప్రజలు ఒక రవాణా వ్యవస్థ నుండి మరొక రవాణా వ్యవస్థకు తేలికగా మారే సులువు కలిగించి ఆఖరి అడుగు వరకు సంధాయకత మరియు ప్రయాణ కాల కుదింపు కలిగించడం. సంకీర్ణ పంపిణీ సరళులు ఏర్పాటు , భారత వ్యాపారాలకు పలు ప్రయోజనాలు కలిగించడం కూడా బహుళార్థ మోడల్ సంధాయకత ద్వారా సిద్ధిస్తుంది.

అన్ని విషయాలలో లాగే ఆచరణ కీలకం. ఇంత పెద్ద పథకం లో వ్యర్థాలు మరియు పునఃకార్యాలు స్వల్పానికి నిరోధించాలి. వాసి ప్రమాణాలు ఇక్కడే ఉపయోగిస్తాయి. ఉన్నత శ్రేణి వాసి ఉత్పత్తి మరియు పథకాల సమయపాలన కొరకు పఠిష్టమైన ప్రతిజ్ఞానియమపాలన ఫ్రీమ్వర్క్ అవసరం. ఇందుకే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI ) మొత్తం వ్యవస్థ తో కలిగలిసి పనిచేస్తోంది: వాసి ప్రమాణాల నిర్ధారణ, ఆడిటర్లు మరియు సలహాదారుల శిక్షణ మరియు వస్తుగత మదింపు కొరకు ఫ్రీమ్వర్క్ ల తయారీ.

ఆచరణ కొలమానం ఏర్పాటు

భారతదేశం లో రహదారుల నిర్మాణం అధిక శ్రమ తో కూడిన పని కావచ్చు. తరచూ పథకాలు ఎదో రకమైన కాల మరియు ఖర్చు సంబంధిత అధికాలకు లోనవుతాయి. సాధారణంగా నాసిరకం ప్రణాళికారణ మరియు యోచన వల్ల సమస్యలు ఎదురౌతాయి, భూ సేకరణ మరియు అనుమతుల లో ఊహించినదాని కంటే జాప్యం, నిధుల అభిలషణీయ వ్యయం, కట్టుబడి ఉత్తమ విధానాల లో లోపం మరియు కొన్నిసార్లు వివిధ భాగస్వాముల మధ్య పాత తరహా వివాదం వంటివి పథక సమయసీమ మరియు బడ్జెట్ లను తారుమారు చేయగలవు. చాలా సందర్భాలలో నిర్మాణ పనులలో వాసి లోపం మరియు పథక నిర్వహణలో అవగుణాలు సామాన్యం.

విజయ పథం లో నడవడానికి, హైవే నిర్మాణదారులకు పెర్ఫార్మన్స్ రేటింగ్ నమూనా తయారీ మరియు భవిష్యత్ బిడ్డింగ్ ప్రక్రియలో ఫర్మామెన్స్ రేటింగ్ అనుసరణ నిమిత్తం ఒక రూప కల్పన కొరకు ఉపరితల రవాణా & హైవేస్ మంత్రిత్వ శాఖ (MoRTH) QCI సేవలు తీసుకున్నది. రూప కల్పన మరియు విధివిధానాలు ఏర్పరచడానికి QCI విస్తృత పరిశోధన చేపట్టింది: ఇది నియమావళి మరియు ప్రమాణాలను బేరీజు వేసింది, అంతర్జాతీయ పెర్ఫార్మన్స్ రేటింగ్ నమూనాలను సమీక్షించింది మరియు రంగం లోని వివిధ నిపుణుల తో సంప్రదింపులు జరిపింది.

తత్ఫలితంగా ఏర్పడిన రూపకల్పన ఈ దీర్ఘకాల పథకాల యొక్క వివిధ అనుసరణ విధానాలు మరియు ప్రగతి గతులను లెక్కలోకి తీసుకుంటుంది. మదింపులు పూర్ణరూపాత్మకములు: నిర్మాణ వాసి, ప్రగతి నివేదికలు మరియు ఆడిట్ రిపోర్టుల సమయోచిత సమర్పణ, మార్గదర్శకాలు మరియు IRC (Indian Roads Congress) నియమావళుల అనువర్తన, పరిశ్రమ ప్రమాణాలు మరియు ప్రత్యేక లక్షణాల అనువర్తన మరియు పరిపూర్ణ ప్రక్రియ నిర్వహణ. భవిష్యత్ సంప్రదింపులకు దోహదపడే స్పష్టమైన దారి ఏర్పడే విధంగా పత్రాల సాక్ష్యం ఆధారంగా ప్రతి వినిమయదారుడూ వారి అర్హతలు నిరూపించుకునే ఆవశ్యకత వున్నది.

QCI పద్దతి ప్రకారం, రూపకల్పన ఏకంగా అన్ని పథకాలకూ వినియోగించకుండా 20 జాతీయ హైవే పథకాల పైన ముందుగా పరీక్షించబడింది. దత్తాంశాల నిర్వహణా విధానాల శుద్ధి మరియు మెరుగుదల, దత్తాంశాలను ప్రమాణీకరించి విధానాలలో లోపాలు నిర్మూలించడానికి ఈ ముందస్తు పథకాల ఫలితాలు వినియోగించబడినాయి. భారతదేశం లోని అన్ని జాతీయ రహదారుల పథకాల పెర్ఫార్మన్స్ రేటింగ్ రూపకల్పనను సమంగా వృద్ధి చెయ్యడానికి కూడా QCI ఒక నమూనా విధానం ఆవిష్కరించింది . అంతేకాకుండా, భవిష్యత్ బిడ్స్ లో ఈ పెర్ఫార్మన్స్ ప్రమాణాలను పొందుపరచడానికి మరియు భవిష్యత్ బిడ్స్ లో భూతకాలపు పెర్ఫార్మన్స్ వివరాలను పరిగణలోకి తీసుకునే విధంగా కూడా QCI ఒక రూపకల్పన అందించింది.

ఖచ్చితమైన మదింపు రూపకల్పన మరియు రహదారుల అభివృద్ధి రంగం లో అత్యున్నత పనితనం ప్రదర్శిస్తున్న సంస్థల గుర్తింపు మరియు బహుమతుల కొరకు విధాన మార్గదర్శకాలను కూడా QCI అభివృద్ధి చేసింది.నిర్మాణ నిర్వహణ లో ఉత్కృష్టత గుర్తింపు, నిర్వహణ మరియు సంరక్షణ, టోల్ ప్లాజా నిర్వహణ, రహదారుల భద్రత మరియు నవీకరణ అనే ఐదు శ్రేణుల లో ఈ బహుమతులు రూపొందించబడినాయి. పెర్ఫార్మన్స్ రేటింగ్ ఫ్రేంవర్క్ లో లాగానే అనుసరణ విధానం, భూ మరియు నిర్మాణ పధ్ధతి లను బహుమతుల ప్రదానం దృష్టి లోకి తీసుకున్నది. మరియు ప్రతి శ్రేణి లోనూ వస్తుగత మరియు పరిమాణీకరించ తగ్గ పరామితుల ఆధారంగా పథకాల మదింపు జరిగింది.

వాసి సంబంధిత పర్యావరణ ఏర్పాటు

నిర్దిష్ట పెర్ఫార్మన్స్ ప్రమాణాలకు అతీతంగా, ప్రమాణాల వ్యవస్థీకరణ, ఈ ప్రమాణాల అమలు, మరియు వాసి మరియు పర్యావరణ ఆడిట్లు రెండూ కూడా నిర్వహించగలిగే అధికృత సలహాదారులు మరియు సంస్థల స్థిరమైన లబ్దత ఏర్పాటు ద్వారా QCI వాసి పర్యావరణం ఏర్పాటుచేస్తుంది. అన్ని రంగాలలో ఉన్నత స్థితి ఏర్పాటుకు దోహదపడే కీలక లక్ష్యం తో QCI లోని ప్రతి ఒక్క బోర్డు పనిచేస్తుంది.

రహదారుల నిర్మాణానికి నిర్దిష్ట మైనNational Accreditation Board for Education and Training (NABET) నిపుణతలు, విద్య మరియు శిక్షణ రంగాలలో అధికృత వ్యవస్థ ఏర్పాటుకు పునాది వేస్తుంది. వారి శిక్షణ ఫలితాలు విశ్వసించతగ్గవి గా వుండే విద్య మరియు శిక్షణ దారుల స్థిరమైన లభ్యత ఇది చేకూరుస్తుంది. భారతదేశం లో పనితనం లో వాసికి ఆలవాలం ఏర్పాటు చేసే దిశగా అన్ని ప్రమాణీకరణ సంస్థలకు The National Accreditation Board for Certification Bodies ప్రమాణాలు కల్పిస్తుంది. Business Continuity Management Systems (BCMS), Energy Management Systems (EnMS), Environment Management Systems (EMS), Occupational Health and Safety Management Systems (OHSMS), Quality Management Systems (QMS), Inspection Bodies (IB), Personnel Certification Bodies (PrCB), Product Certification Bodies (PCB) మరియు ఇతర సంబంధిత ప్రమాణీకరణల వంటి గుర్తింపు పథకాలు పథక బాధ్యులు మరియు నిర్వాణదారులు పథక మొదటి రోజు నుంచి ప్రతిష్ట విధానం లో నడిపే సులువు కల్పిస్తాయి.

అదనంగా, భారతదేశం లో అన్ని అభివృద్ధి మరియు పారిశ్రామిక కార్యకలాపాలకు చట్టపరంగా అవసరమైన Environmental Impact Assessment (EIA) పేర్కొన్న నియంత్రణ నియమాలు అమలులో అందరు భాగస్వాములకు QCI తోడ్పడింది. పథకానికి సంబంధించిన పెట్టుబడుల దారుఢ్య మదింపుకు ఆర్ధిక సంస్థలు దీనిని క్రమేపి వినియోగిస్తున్నారు. EIA నియమావళుల అనువర్తన విషయం లో సహకరించగలిగే మరియు పర్యావరణ అనుమతులు పొందే విధంగా EIa నివేదికలు తయారుచెయ్యగలిగే సలహాదారులు మరియు ఆడిటర్ల లభ్యత కల్పిస్తూ QCI యొక్క NABET ఒక స్వచ్చంద గుర్తిపు పథకం రూపొందించింది. శిక్షిత ఆడిటర్లు మరియు సలహాదారుల లభ్యత ఒక ముఖ్యమైన అడ్డంకి సడలించడమే కాకుండా భారతదేశం లో అవస్థాపన పథకాల వాసి మరియు నిర్వహణీయ లక్షణాలను మెరుగుపరిచింది.

అంతేకాకుండా, కొన్ని సందర్భాలలో, కొన్ని పథకాలు, లేదా చొరవల అమలుకు మరియు వాటి సంపూర్ణ సాధనకు QCI యొక్క Project Planning & Implementation Division (PPID) నేరుగా పనిచేస్తుంది. దీని అర్థం QCI పూర్తి పథక నిర్వహణ జీవన చక్రము చేపడుతుంది: కేంద్ర రంగాలు, సర్వేక్షణలు మరియు భాగస్వాముల తో బాటుగా పథక విధాన రూపకల్పన; పథక ప్రణాళిక మరియు సమయసీమల తయారీ, మరియు వనరుల ప్రణాళికారణ; వివిధ భాగస్వాములు (జాతీయ మరియు రాష్ట్ర స్థాయి లో ప్రభుత్వ సంస్థలు, నగర స్థానిక సంస్థలు, సాంకేతిక మరియు PR సంస్థలు మరియు ఇతర భాగస్వాములు) తో అనుసంధానం, మరియు చివరగా పనితనం మదుపు చేస్తూ పథకం పూర్తిచేయడం.

ఒక విధంగా చెప్పాలంటే, భావన స్థితి నుంచి ఆఖరుగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేవరకూ అన్ని పరిమాణాలు మరియు సమయసీమల అవస్థాపన పథకాలలో వాసి అంతర్గతం చేసేందుకు QCI దోహదపడుతుంది. ఈ పథకాల భద్రత మరియు దీర్ఘత్వం పైన విశ్వసనీయత కలిగించడమే కాకుండా ఖర్చు కుదించి సమయసీమలు అధిగమించకుండా ఇది చూస్తుంది. భారతదేశాన్నిభవిష్యత్తు లోకి సుస్థిరంగా నడింపించ దలచే ప్రభుత్వానికి సమయం మరియు విలువ రెంటి లోనూ దక్కే లభ్ది కొలువరానిది.

ముగింపు

ఒకప్పుడు బ్రిటిష్ రాజ్యపు మకుటం లో భారతదేశం ఒక కలికితురాయి గా పరిగణించబడేది. మనం ఆంగ్లేయుల శృంఖలాలు వదిలించుకున్న 75 సంవత్సరాల అనంతరం భారతదేశం నాయకత్వ పటిమ కలిగిన ఒక ఆర్ధిక శక్తిశాలి దేశంగానూ, నిర్వహణియత లో మేథా నాయక పాత్ర మరియు ఉన్నత అర్హతలు, గౌరవప్రదమైన భారత సంతతి ద్వారా ప్రాప్టించే మృదువైన శక్తి ప్రదర్శిస్తున్నది. విస్తరిస్తున్న ప్రపంచ విపణి లో భారతీయ వ్యాపారాలు మరింత పోటీపటిమ సంతరించుకుంటున్న నేపథ్యం లో భారతదేశపు సంపద పెరుగుతున్నది. మన దేశం ఒక బలవత్తర దేశంగా ఎదుగుతున్న ఈ కీలక తరుణం లో రహదారులు మరియు అవస్థాపన రంగాలలో ప్రభుత్వ పెట్టుబడులు మరిన్ని గుణకాలు ఆవిష్కరించనుంది. సంబంధిత పరిశ్రమలైన ఉక్కు , సిమెంట్ , వాహన , గృహ నిర్మాణం వంటి వాటిపైన రహదారులు పఠిష్టమైన ప్రభావం చూపనున్నాయి. ఈ రంగాలలో సగటు ఆదాయాలను పెంచుతూ అన్ని ఊర్థ్వ గతి లో ఉంటాయి.

జన మరియు సరుకు సులువు రవాణా వలన వ్యాపారాలకు కొత్త విపణులు మరియు పంపిణీదారులు అందుబాటులోకి వస్తాయి మరియు వినియోగదారులకు మరిన్ని వికల్పాలు చేకూరుతాయి. భారతీయ వ్యాపారాల సమ వేదికపైన పోటీ ఫలితంగా ఆరోగ్యకరమైన పోటీ కి దోహదపడి ఉన్నత శ్రేణి విధానాలు, ఉత్పత్తులు మరియు సేవలకు రహదారులు తెరుచుకుంటాయి.

మన కార్య రంగం లో మనము మెరుగు పడతాము. వ్యాపారానికి అది ఎప్పుడూ మంచిది.

ఇది భాగస్వామ్య పోస్ట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *