Santosh, News18, Warangal
ఈ చెట్టు పేరు కోనో కార్పస్ (conocarpus)..! ఇదీ దేశ విదేశాలను సైతం భయపెట్టేస్తుంది ఇది నిజం! వరంగల్ తో పాటు తెలంగాణ (Telangana) లో పలుచోట్ల ఈ చెట్లు కనిపిస్తున్నాయి. నిషేధించిన ఈ మొక్కలను హరితహారం కార్యక్రమంలో నాటుతున్నారు. అసలు ఈ చెట్టుని ఎందుకు నిషేధించారు. దీనివల్ల కలిగే పరిణామాలు ఏంటి జనాల్లో భయాన్ని సృష్టిస్తున్న ఈ కోనో కార్పస్ చెట్టుపై న్యూస్ 18 ప్రత్యేక కథనం..! కోనో కార్పస్ ఈ మొక్క పేరువింటేనే ప్రకృతి ప్రేమికులు, శాస్త్రవేత్తలు హడలెత్తిపోతున్నారు. తెలంగాణలో సుందరీకరణ కోసం ఈ చెట్లను పెంచుతున్నారు. అయితే ఈ మొక్కతో పర్యావరణానికి విఘాతం కలుగుతుందని ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజల్లో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఆ చెట్ల వల్ల కేబుల్, డ్రైనేజ్, నీటి పైప్లైన్ వ్యవస్థకు నష్టం కలగజేస్తుందని అంటున్నారు. నిటారుగా పెరిగి పచ్చదనంతో కలకలలాడే ఈ మెుక్క దుష్ప్రభావాలతో ప్రజలను భయపెడుతుంది. హరితహారంలో పలు పట్టణాలలో ఈ మొక్కలను నాటారు. వరంగల్ (Warangal) హనుమకొండ, కాజీపేట రోడ్డు డివైడర్ల మధ్యలో ఈ చెట్లను నాటారు. ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఈ మొక్కతో కీటకాలకు పక్షులకు ఎలాంటి ఉపయోగం లేదు.ఏ జంతువు ఈ ఆకులనుతినవు.
ఇది చదవండి: న్యూస్18 కథనానికి స్పందన.. జంపన్న వాగు వద్ద ఇకపై నో డేంజర్
ఈ చెట్టుతో పర్యావరణానికి ఎలాంటి ఉపయోగం లేకపోగా అనేక దుష్ప్రభావాలు మాత్రం కలగజేస్తుంది. కోనో కార్పస్ పుష్పాల నుండి వెలువడే తన వల్ల శ్వాసకోశ ఎలర్జీ ఆస్తమా సమస్యలు తలెత్తుతున్నాయని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలాయి. తక్కువ సమయంలో ఎక్కువ పెరగడం వేర్లు లోతుకు పెరగడం ఈ చెట్టు ఎల్లప్పుడూ కళకళలాడుతుంది. ఈ గుణాన్ని అనేక దేశాలకు విస్తరింప చేసింది. అనేక దేశాల్లో ఈ మొక్కలను సుందరీకరణకు వినియోగిస్తున్నారు.
ప్రతికూల వాతావరణంలో కూడా పెరిగే అంత సామర్థ్యత ఉన్న ఈ కార్పస్ మొక్క .. ఏడాది ప్రాంతమైన సౌదీ కత్తర్ లాంటి దేశాల్లో ఈ మొక్కను వినియోగిస్తున్నారు. ఈ మొక్కనుమైదానాల్లో. ఊరికి దూరంగాపెంచుతున్నారు. కానీజన సంచారంలో ఉన్నటువంటి మొక్కలను మాత్రం తొలగిస్తున్నారు. వీటి స్థానంలో ప్రత్యామ్నాయ మొక్కలను నాటుతున్నారు.జనసంచారం ఉండే ప్రాంతాల్లో ఏవైనా మొక్కలు నాటాలంటే వృక్షశాస్త్ర నిపుణులచే సలహాలు తీసుకొని నాటాలంటున్నారు కాకతీయ యూనివర్సిటీ వృక్షశాస్త్ర నిపుణులు.