ఎయిర్ ఇండియా విమానంలో మంటలు అబుదాబి నుండి కాలికట్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ B737-800 ఎయిర్ క్రాఫ్ట్ VT-AYC ఆపరేటింగ్ ఫ్లైట్IX 348 టేకాఫ్ అయిన కాసేపటికే మంటలు కనిపించాయని డీజీసీఏ తెలిపింది. సుమారు 1000 అడుగుల ఎత్తులోకి వెళ్లగానే మంటలు రావడం గమనించిన ఐఎక్స్ 348 పైలట్.. తిరిగి అబుదాబి విమానాశ్రయంలోనే ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
ఆ తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. అయితే ఈ విమానంలో మొత్తం 184 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం సాంకేతిక లోపంతోనే ఏర్పడిందని అధికారులు భావిస్తున్నారు.
©️ VIL Media Pvt Ltd.