ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ శుభవార్త.. వడ్డీ లేకుండా ఈఎంఐలో స్మార్ట్ టీవీ కొనేయండి!

Flipkart Offers | తక్కువ ఈఎంఐలో స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే శుభవార్త. మీకోసం అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) బిగ్ బచత్ సేల్ నడుస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలుదారులకు అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. దిగ్గజ బ్యాంకులు (Banks) నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ అందుబాటులో ఉంచాయి. క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ లభిస్తోంది. బ్యాంకులు అన్నీ దాదాపు ఒకే రకమైన నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ అందిస్తున్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫాల్కన్ 32 ఇంచుల స్మార్ట్ టీవీపై సూపర్ డీల్స్ లభిస్తున్నాయి. ఈ స్మార్ట్ టీవీ ఎంఆర్‌పీ రూ. 26,990గా ఉంది. అయితే ఈ టీవీని రూ. 9499కే కొనుగోలు చేయొచ్చు. అంటే 64 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ టీవీని రూ. 9 వేలకే కొనొచ్చు. ఎలా అంటే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ. 475 వరకు తగ్గింపు వస్తుంది. అంటే మరింత తక్కువకే ఈ టీవీ లబిస్తోందని చెప్పుకోవచ్చు.

బ్యాంక్ బంపరాఫర్.. నెలకు రూ.264తో స్మార్ట్‌టీవీ కొనొచ్చు!

ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డుపై కూడా ఆఫర్ ఉంది. ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ పొందొచ్చు. నెలకు రూ. 1584 చెల్లిస్తే సరిపోతుంది. మూడు నెలలకు నో కాస్ట్ ఈఎంఐ ఎంచుకుంటే నెలకు రూ. 3167 చెల్లించాల్సి వస్తుంది. అదే రెగ్యులర్ ఈఎంఐ అయితే ఏడాది వరకు పెట్టుకోవచ్చు. నెలకు రూ. 850 పడుతుంది.

నెలకు రూ.2 వేలతో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేయండి.. ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కి.మి. వెళ్లొచ్చు!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు కూడా దాదాపు ఇదే ఆఫర్ వర్తిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుపై నో కాస్ట్ ఈఎంఐ ఆరు నెలలు పెట్టుకోవచ్చు. నెలకు రూ. 1584 కట్టాలి. అదే రెగ్యులర్ ఈఎంఐ అయితే 24 నెలల వరకు పెట్టుకోవచ్చు. అంటే అప్పుడు నెలకు రూ. 466 చెల్లిస్తే చాలు. అంటే ఎస్‌బీఐ కార్డుపై కన్నా హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై ఎక్కువ టెన్యూర్ అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు.

మీ వద్ద ఒకవేళ క్రెడిట్ కార్డు లేకపోయినా కూడా ఈఎంఐలో స్మార్ట్ టీవీ కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఈఎంఐ సదుపాయం ఉంది. ఏడాది వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 899 వరకు చెల్లించాల్సి వస్తుంది. అదే 9 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 1164 కట్టాలి. ఆరు నెలలకు రూ. 1700 చెల్లించాలి. మూడు నెలలకు రూ. 3300 ఈఎంఐ పడుతుంది. ప్రాసెసింగ్ ఫీజు 1.5 శాతం వరకు పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *