క‌ళాత‌ప‌స్వి ఇలా కూడా ఆలోచిస్తారా.. సెట్స్‌లో వేసుకునే ఖాకీ డ్రెస్ వెనుక అస‌లు క‌థ‌

తెలుగు దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ షూటింగ్ సమయంలో ఓ శైలిని పాటిస్తుంటారు. సాధార‌ణంగా సినిమా వాళ్ల‌కు సెంటిమెంట్స్ ఎక్కువ‌.. అందుక‌నే వారు సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఒక్కో స్టైల్లో కనిపిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు కోడి రామ‌కృష్ణ త‌ల‌కు ఓ గుడ్డ‌ను చుట్ట‌కుంటారు. రాఘవేంద్రరావు, రాజమౌళి గడ్డంతో కనిపిస్తారు. అలాగే విశ్వ‌నాథ్ ఫాలో అయ్యే స్టైల్ ఏంటో తెలుసా!.. సెట్స్‌లో ఆయ‌న ఖాకీ రంగు దుస్తులు వేసుకుంటారు. అలాగ‌ని ఆయ‌న సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నార‌ని అనుకుంటే మాత్రం పొర‌బ‌డ్డ‌ట్టే. కె.విశ్వ‌నాథ్ ఖాకీ డ్రెస్ వేసుకోవ‌టం వెనుక అస‌లు క‌థ‌.. ఏంట‌నేది ఓ సంద‌ర్భంలో ఆయ‌న చెప్పారు.

కె.విశ్వనాథ్ ముందు సౌండ్ రికార్డ్ అసిస్టెంట్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు. త‌ర్వాత క్ర‌మంగా ద‌ర్శ‌కుడిగా మారారు. ఈ క్ర‌మంలో త‌న‌కు తెలియ‌కుండా త‌న‌లో గ‌ర్వం వ‌చ్చేస్తే ఎలా అని క‌ళాత‌ప‌స్వి ఆలోచించారు. సినిమాల రంగానికి కెప్టెన్ ద‌ర్శ‌కుడు. అలాంటి ద‌ర్శ‌కుడు ఓ స్టైల్‌గా ఉంటూ హంగామా చేయ‌టం విశ్వ‌నాథ్‌కి న‌చ్చ‌లేదు. ఒక‌వేళ అలా బిహేవ్ చేస్తే కళ్లు నెత్తికెక్కాయ‌ని అంద‌రూ భావిస్తార‌ని ఆయ‌న ఆలోచించారు. సాధార‌ణంగా సెట్స్‌లో ప‌ని చేసే లైట బాయ్స్‌, పెయింట‌ర్స్ ఖాకీ రంగు దుస్తుల‌నే వేసుకుంటారు. అయితే వారు ఖాకీ ష‌ర్టుతో పాటు నిక్క‌రు వేసుకుంటే కె.విశ్వ‌నాథ్ మాత్రం ఖాకీ ష‌ర్ట్‌, ప్యాంటు వేసుకునేవారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే కొన్ని సంద‌ర్భాల్లో చెప్పారు. ఇది విన్న‌వారు నిజంగా ఆశ్చ‌ర్య‌పోయారు. విశ్వ‌నాథ్ ఇలా కూడా ఆలోచిస్తారా! అని అనుకునేవారట‌.

చేసే ప‌ని ప‌ట్ల నిబద్ద‌త ఉండాలే త‌ప్ప‌.. క‌ళ్లు నెత్తికెక్క‌కూడ‌ద‌నే ఆయ‌న ఆలోచ‌న నిజంగా చాలా మంది ఆద‌ర్శ‌నీయం. అలాంటి దిగ్గ‌జ ద‌ర్శ‌కుడికి నివాళులు అర్పిస్తూ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ శుక్ర‌వారం రోజున షూటింగ్స్‌ను బంద్ చేసిందంటే ఆయ‌న ఇండ‌స్ట్రీపై ఎంత‌టి ప్ర‌భావాన్ని చూపారో అర్థం చేసుకోవ‌చ్చు.

శంక‌రాభ‌ర‌ణం, స్వాతి ముత్యం, స్వ‌ర్ణ క‌మ‌లం, సాగ‌ర సంగ‌మం, స్వ‌యం కృషి … ఇలా ఎన్నో అపురూప‌మైన చిత్రాలను తెర‌కెక్కించిన సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కె.విశ్వ‌నాథ్ గురువారం రాత్రి క‌న్నుమూశారు. వ‌య‌సు రీత్యా వ‌చ్చిన అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆయ‌న్ని హైద‌రాబాద్‌లోని అపోలో హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు. గురువారం అర్థ‌రాత్రి స‌మ‌యంలో ఆయ‌న తుది శ్వాస విడిచారు.

Read

Tollywood Updates

and

Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *