కళాతపస్వి కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన టాప్ సినిమాలు..

టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ (K Viswanath passes away) ఇకలేరు. అనారోగ్య సమస్యలతో నిన్న ఆయన కన్నుమూశారు. విశ్వనాథ్ వయసు 92 ఏళ్లు. ఆయన  గత కొంత కాలంగా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలో బాధపడుతున్నారు. గురువారం కూడా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ  తుదిశ్వాస విడిచారు విశ్వనాథ్. ఆయన దర్శకత్వంలో వచ్చిన టాప్ సినిమాలు ఏంటో చూద్దాం.. Photo : Twitter

శంకరాభరణం.. జేవీ సోమయాజులు ప్రధాన పాత్రలో వచ్చింది. సంగీత ప్రధానంగా సాగే చిత్రం అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది.  1980 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన సంగీత ప్రాధాన్యత గల చిత్రం. ఈ చిత్రాన్ని పూర్ణోదయా క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించాడు. జె. వి. సోమయాజులు, మంజుభార్గవి, రాజ్యలక్ష్మి, అల్లు రామలింగయ్య, చంద్రమోహన్ ముఖ్యపాత్రలు పోషించారు. కె. వి. మహదేవన్ సంగీతం అందించారు. ఎక్కడా కమర్షియల్ హంగులు లేకున్నా మంచి విజయాన్ని సాధించింది. Photo : Twitter

స్వాతి ముత్యం 1985లో విడుదలైన మరో మంచి చిత్రం. కథ విషయానికి వస్తే.. పెద్దలని ఎదిరించి పెళ్ళి చేసుకున్న ఒక సాంప్రదాయ సామాన్య కుటుంబానికి చెందిన మహిళ, చిన్నపుడే భర్త పోతే ఆమె ఎలాంటీ సమస్యలను ఎదుర్కోంది. కష్టాల్లో ఉన్న ఆమె జీవితంలోకి అనుకోకుండా ఒక అమాయకపు యువకుడు వస్తే ఏం జరిగింది.. ఈ సినిమాలో పాటలు ఒక్కోక్కటి ఒక్కో ఆణిముత్యం.  Photo : Twitter

చిరంజీవి, విజయశాంతి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. చిన్న పని అంటూ ఏమి ఉండదని తెలిపినచిత్రం. స్వయంకృషి 1987లో విడుదలైంది. శ్రమలోని ఔన్నత్యం ఈ సినిమాలో ప్రధానాంశంగా చూపించారు దర్శకుడు. ఈ సినిమా మంచి విజయం సాధించి ప్రేక్షకుల, విమర్శకుల మెప్పును పొందింది. Photo : Twitter

సాగరసంగమం కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన మరో క్లాసిక్ హిట్. ఈ సినిమా 3 జూన్ 1983న విడుదలైంది. కమల్ హాసన్, జయప్రద ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించాడు. ఇళయరాజా సంగీతం Photo : Twitter

మమ్ముట్టి, రాధిక, మాస్టర్ మంజునాథ్ ముఖ్య పాత్రలు పోషించారు. స్వాతి కిరణం 1992 లో విడుదలైన సంగీత ప్రధానమైన చిత్రం. గురువు తన శిష్యుడి ఉన్నతిని తట్టుకోలేక ఈర్ష్యకు లోనై తన తప్పును తెలుసుకునే కథ. Photo : Twitter

వెంకటేష్, భానుప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. స్వర్ణకమలం 1988లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను కె. ఎస్. రామారావు సమర్పణలో భాను ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సి. హెచ్. వి. అప్పారావు నిర్మించాడు. ఇళయరాజా సంగీతం. Photo : Twitter

సప్తపది.. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1981లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సప్తపది నృత్యం ప్రధానాంశంగా వచ్చిన సినిమా. జేవీ సోమయాజుటు, సబితా బమిడిపాటి, గిరిష్ ప్రధాన్ ప్రాధాన పాత్రలు పోషించారు. కేవీ మహాదేవన్ సంగీతం అందించారు. Photo : Twitter

శుభలేఖ 1982 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి, సుమలత ముఖ్యపాత్రలు పోషించారు. అల్లు అరవింద్ నిర్మాత, సంగీతం కేవీ మహాదేవన్ అందించారు. Photo : Twitter

సిరివెన్నెల : విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన మరో క్లాసిక్ సినిమా. ఈ సినిమా 1986లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న చిత్రం. ఈ చిత్రాన్ని ఏడిద నాగేశ్వరరావు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించాడు. సుహాసిని, సర్వదామన్ బెనర్జీ ప్రధాన పాత్రలు. Photo : Twitter

ఆపద్బాంధవుడు 1992లో విడుదలైంది. చిరంజీవి, మీనాక్షి శేషాద్రి, జంధ్యాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈసినిమా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. Photo : Twitter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *