తెలుగు సినీ జగత్తులో తనకంటూ ఓ అధ్యాయనం సృష్టించుకున్న దర్శకులు కే.విశ్వనాథ్(K.Viswanath)ఇకలేరన్న వార్త సినీ అభిమానులు, తెలుగు చిత్ర పరిశ్రమ నమ్మలేకపోతోంది.గురువారం అర్ధరాత్రి కన్నుమూసిన కళాతపస్వీ అంత్యక్రియలు (Funeral)శుక్రవారం ఉదయం 11.30నిమిషాలకు జరగనున్నాయి. పంజాగుట్ట(Panjagutta) స్మశాన వాటికలో కే.విశ్వనాథ్ అంత్యక్రియలు జరగనున్నాయి.
Tribute to K.Viswanath:కే.విశ్వనాథ్ మృతిపై KCR సంతాపం..కళాతపస్వీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్న బండి సంజయ్
కళాతపస్వీ లోటు భర్తీ చేయలేనిది..
సుమారు 50కిపైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన లెజెండ్రీ డైరెక్టర్ కే.విశ్వనాథ్ మృతిపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈరోజు అనగా శుక్రవారం స్వచ్చందంగా షూటింగ్‌లు బంద్ చేస్తూ ప్రకటించారు. సంప్రదాయాలు, సాహిత్యం, మానవ సంబంధాలను చిత్ర కథలుగా మలిచి తెలుగు వాళ్లకు అద్భుతమైన వినోదంతో పాటు సందేశాన్ని ఇచ్చారు.
సంప్రదాయ సినిమాలకు కేరాఫ్..
తెలుగు సినిమాకు ఎల్లలు లేవని నిరూపించారు కే. విశ్వనాథ్. సుమారు నాలుగు దశాబ్ధాల క్రితమే తన ప్రతిభా నైపుణ్యాన్ని ప్రాంతీయ భాష సినిమాకు దేశ, విదేశాలు, ఇతర భాషల్లో గుర్తింపు దక్కే విధంగా తెరకెక్కించారు. ఒకరకంగా తెలుగు సినిమా ఖ్యాతిని, కీర్తిని ఎల్లకాలం గుర్తుండిపోయేలా చేశారు. కళాతపస్వి, పద్మశ్రీ కే.విశ్వనాథ్ మరణంపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నివాళులర్పించారు. ఆయన్ని కారణ జన్ములుగా కొలుస్తూ ఆయన్ని కలిసిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసారు.
కళకే కే.విశ్వనాథ్ అలంకారం..
కే.విశ్వనాథ్ సినిమాలన్నీ ఆచంద్రతారార్కం నిలిచి ఉండేవని… ఎంతో మంది నూతన నటులకు విశ్వనాథ్ గారు తోడ్పాడు అందించిన TSRTC యాజమాన్యం తరపున కళాతపస్వికి వినమ్రపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లుగా ప్రకటించారు.