కొత్త, పాత పన్ను విధానంలో ఏది బెటర్? చిదంబరం సూచన ఇదే..!

Income Tax: కేంద్ర ప్రభుత్వ వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించిన 2023-24 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా వేతన జీవులకు ఊరట కల్పిస్తు కొత్త పన్ను విధానాన్ని ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పన్ను స్లాబుల్లో మార్పు చేయడంతో పాటు, ఆదాయపు పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. దీంతో మధ్య తరగతికి ఊరట లభించినట్లయింది. అయితే, ఇది కొత్త పన్ను విధానం పరిధిలోకి వచ్చే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ క్రమంలో దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానంలో ఏది ఎంచుకోవాలి, దేని ద్వారా లబ్ధి పొందవచ్చనే అంశాలు తెరపైకి వచ్చాయి.

బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని ప్రకటించిన క్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త, పాత పన్ను విధానాల పేరిట ప్రభుత్వం హడావిడి చేసిందన్నారు. మెజారిటీ భారతీయుల నమ్మకాలను వమ్ము చేశారని దుయ్యబట్టారు. ప్రజలకు అవసరమైన పన్ను రాయితీలను కల్పించడంలో బడ్జెట్ వెనకబడిపోయిందన్నారు. ప్రజల వ్యక్తిగత పొదుపు ప్రాధాన్యాన్ని విస్మరించిందని, మెజారిటీ ప్రజలకు రక్షణ కల్పించలేకపోతున్న తరుణంలో వ్యక్తిగత పొదుపే వారికి సామాజిక భద్రత అని వ్యాఖ్యానించారు పి. చిదంబరం.

అదరగొడుతున్న మహీంద్రా గ్రూప్ స్టాక్.. 160 శాతం రిటర్న్స్.. మీ వద్ద ఉందా?

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కేంద్రపై విమర్శలు గుప్పించారు పి.చిదంబరం. కొత్త విధానంలో ఉన్న రహస్య బయటపడుతోందని పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులు తొందరపడి సొంతంగా ఎలాంటి నిర్ణయానికి రావొద్దని సూచించారు. సరైన లెక్కలు వేసుకోవాలని, అవసరమైతే ఛార్టెడ్ అకౌంటెంట్లను సంప్రదించాలని కోరారు. కొత్త పన్ను విధానం సంక్లిష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కఠోరమైన బడ్జెట్‌గా వ్యవహరించారు. సామాన్యుల అవసరాలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.

కొత్త పన్ను విధానం ప్రకారం పన్ను శ్లాబ్స్ ఇలా ఉన్నాయి..

కొత్త పన్ను విధానం ప్రకారం రూ.3-6 లక్షల వార్షికాదాయం ఉన్నవారు 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.6-9 లక్షల మధ్య ఉంటే 10 శాతం పన్ను చెల్లించాలి. అయితే.. పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం రిబేట్ ఇస్తుంటుంది. ఇదివరకు రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రిబేట్ ఉండగా.. ఇప్పుడు అదే ఆదాయపు పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచింది. ఈ లెక్కన రూ.7 లక్షల ఆదాయం ఉన్నవారు రిబేట్‌ ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. అంటే అప్పుడు వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. పైన చెప్పిన లెక్కల ప్రకారం.. రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు ఎలాంటి పన్ను కట్టక్కర్లేదు. ఇక రూ.9 లక్షల వేతనం పొందేవారు.. మాత్రం గతంలో రూ.60 వేలు పన్ను రూపంలో కట్టేవారు. కానీ ఇప్పుడు పన్ను శ్లాబుల్లో మార్పులతో వారికి ఉపశమనం కలగనుంది. ఇప్పుడు రూ.45 వేలు చెల్లిస్తే సరిపోతుంది.

Read Latest

Business News and Telugu News

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Also Read:

రూ. 4.50 లక్షల కోట్లు కోల్పోయిన అదానీ.. ఆరే రోజుల్లో సంపద పతనం.. FPO రద్దు

అదానీ గ్రూప్ సంచలనం.. ఇన్వెస్టర్లందరికీ తిరిగి డబ్బులు.. అసలేమైంది?

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *