గిల్ను చెంపపై కొట్టిన ఇషాన్ కిషన్ టీమిండియా ఆటగాళ్లు మైదానంలో ఎంత సీరియస్ గా ఆడతారో డ్రెస్సింగ్ రూంలో అంత సరదాగా ఉంటారు. మ్యాచ్ గెలిస్తే డ్రెస్సింగ్ రూంలో ఎగిరిగంతులేయడమే కాదు డ్యాన్స్ లు కూడా చేస్తారు. టీమిండియా యంగ్ క్రికెటర్స్ శుబ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ మంచి ఫ్రెండ్స్ . వీరిద్దరు కలిసి డ్రెస్సింగ్ ఓ హోటల్ లో చేసిన ఓ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ఇషాన్ కిషన్ శుభ్ మన్ గిల్ పై సీరియస్ అయితాడు. నువ్వు సరిగ్గా నటించడం లేదంటూ గిల్ ను తిడుతూ అతడిని కొట్టినట్లు నటిస్తాడు. గిల్ ను చెంపలు వేసుకొమ్మంటడు. గిల్ కూడా చెంపలు వేసుకుంటాడు. తర్వాత ఇషాన్ గోరిల్లాలా నడుస్తూ గిల్ పై నుంచి దూకుతాడు. అయితే ఇదంతా పాపులర్ యూత్ షో ఎంటీవి రోడీస్ ఆడిషన్ ఎపిసోడ్ ను రీ క్రియేట్ చేశారు. దీనికి చాహల్ డైరెక్షన్ చేయగా ఇషాన్, గిల్ నటించారు. ఈ వీడియోను గిల్ తన ఇన్ స్ట్రాగ్రమ్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ తో వన్డే, టీ20 సిరీస్ లను భారత్ గెలిచింది. ఇందులో శుభ్ మన్ గిల్ రెండు సెంచరీలు, డబుల్ సెంచరీతో సత్తా చాటాడు.
©️ VIL Media Pvt Ltd.