చివరి వరకు పాటతోనే కళా తపస్వి.. చనిపోయే ముందు కూడా!

తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ సినిమాలు రూపొందించిన కె విశ్వనాథ్ ఇక లేరు. గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. దాదాపు ఐదారు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కళామతల్లి సేవలో గడిపి భావి దర్శకులకు ఆదర్శంగా నిలిచారు. ఆయన సినీ కెరీర్‌లో ఎవర్‌ గ్రీన్‌గా నిలిచిన ‘శంకరాభరణం’ మూవీ విడుదలైన రోజే కైలాసానికి చేరుకున్నారు. సినీ పరిశ్రమలో సౌండ్ ఇంజనీర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన.. ఆ తర్వాత దర్శకుడిగా, రచయితగా, నటుడిగా అనేక పాత్రలు నిర్వర్తించారు. ఆయనే జీవితం మొత్తం కళకే అంకితం కాగా.. మరణానికి కొద్ది క్షణాల ముందు ఆయన పాట రాశారు.

చనిపోయే కొద్ది సమయానికి ముందు వరకు పాట రాస్తూ.. చివరకు రాయలేక కుమారుడికి ఇచ్చి పూర్తి చేయమని చెప్పారు. ఆయన నోటి మాటలతో చెప్తూ కుమారుడితో రాయించారు. తర్వాత అదే పాట వింటుండగానే విశ్వనాథ్ కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడే గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

దర్శకుడిగా అనేక కళాఖండాలు రూపొందించిన విశ్వనాథ్ సినిమాల్లో సంగీత సాహిత్యాలకు పెద్ద పీట ఉంటుందని తెలిసిందే. అయితే ఆయన సినిమాల్లోని చాలా పాటలకు సందర్భోచితంగా ముందుగానే పల్లవి రాసే అలవాటు విశ్వనాథ్ గారికి ఉంది. వాటినే గీత రచయితలకు రిఫరెన్స్‌గా ఇచ్చేవారు. ఒక్కోసారి బాగుంటే అవే వ్యాఖ్యాలను పాటలో పెట్టేవారు. అలా వచ్చిన పాటలు పెద్ద హిట్లుగా నిలిచాయి కూడా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *