‘జానకి కలగనలేదు’ ఫిబ్రవరి 03 ఎపిసోడ్: జెస్సీని వదిలేస్తా.. అఖిల్ మూర్ఖత్వం.. కొత్తగా మలయాళం ఎంట్రీ

Janaki Kalaganaledu Serial Today: ఉన్నవాళ్లతోనే ‘జానకి కలగనలేదు’ సీరియల్‌ అంతా గందరగోళంగా ఉంటే.. వీళ్లు చాలనట్టు ఇప్పుడు మరో అయోమయం క్యారెక్టర్‌ని తీసుకుని వచ్చారు సీరియల్‌లోకి. నేటి ఎపిసోడ్‌లో ఏమైందంటే.. 

రామా.. స్వీట్ కొట్టుపెట్టుకుని రెండుచేతులా డబ్బులు సంపాదిస్తుంటే.. అతని ప్రేరణతో మల్లిక-విష్ణులు కొత్తగా బట్టల షాపు పెట్టుకున్నారు సీక్రెట్‌గా. ఇక అఖిల్‌కి జెస్సీ తండ్రి కొత్త ఉద్యోగం చూపించడం లాంటివి నిన్నటి ఎపిసోడ్‌లో చూశాం. ఇక ఈరోజు (ఫిబ్రవరి 03) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. జానకి పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉంటుంది. ఇంతలో జెస్సీ.. అక్కా అంటూ స్వీట్స్ పట్టుకుని వస్తుంది. ‘నీకో గుడ్ న్యూస్ అక్కా.. నువ్ ఇచ్చిన సలహాని మా నాన్నకి చెప్పాను.. నాన్న అఖిల్‌కి జాబ్ చూపించారు.. ఈ ఆనందానికి కారణం నువ్వే అక్కా.. నీ మాట ప్రకారం నేను మాట్లాడాను కాబట్టే అఖిల్‌కి ఉద్యోగం వచ్చింది.. జీతం నెలకు రూ.30 వేలు.. ఇక మన సమస్యలు తీరినట్టే’ అని జానకి నోరు తీపి చేస్తుంది జెస్సీ. మొత్తానికి ఈ క్రెడిట్ కూడా జానకి ఖాతాలో వేస్తుంది జెస్సీ. ఇంతలో అఖిల్ వచ్చి.. ‘నేను ఎందుకూ పనికి రాని వాడ్ని అని అంటారు కదా.. అన్నయ్యకే కాదు.. పని చేయడం మాకు వచ్చు.. నేను చదువుకున్నా కాబట్టి.. అన్నయ్యలా.. ఏ పని పడితే ఆ పని చేయను.. ఇప్పుడు నా చదువుకి తగ్గ పనిదొరికింది. ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది.. నేనూ సంపాదిస్తాను’ అని అంటాడు అఖిల్.

జీతం గురించి అబద్ధం చెప్పిన అఖిల్.. జానకి-జెస్సీ షాక్

ఉద్యోగం వచ్చిందనే విషయం చెప్పగానే.. జ్ఞానాంబ సంబరపడిపోతుంది. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదరా.. అని జ్ఞానాంబ అంటే.. మంచి విషయం ముందు చెప్పడం నీ కొడుక్కి చేతకాదులే అని సెటైర్ వేస్తాడు గోవిందరాజులు. ఇంతకీ నీ జీతం ఎంత అని గోవిందరాజులు అడగ్గా.. రూ.15 వేలు అని అబద్ధం చెప్తాడు అఖిల్. అప్పటికే జీతం గురించి తెలిసిన.. జెస్సీ, జానకిలు షాక్ అవుతారు. మాట్లాడితే నా చదువుకి గొప్ప ఉద్యోగం అంటావ్.. నీ గొప్ప ఉద్యోగానికి రూ.15 వేలు జీతమా? అని అడుగుతాడు గోవిందరాజులు.

అఖిల్‌ని నిలదీసిన జెస్సీ..

చేరగానే లక్షలు ఇస్తారా? ఏంటీ అని అఖిల్ అంటే.. ‘ఎంతోకొంతలెండీ.. ఉద్యోగం అయితే వచ్చింది కదా’ అని అంటుంది జ్ఞానాంబ. అయితే జీతం గురించి అఖిల్ అబద్ధం చెప్పడంతో జెస్సీ.. జానకి దగ్గర అవమానంగా భావిస్తుంది. కోపంగా అఖిల్ దగ్గరకు వెళ్తుంది. ‘నీ జీతం గురించి ఎందుకు అబద్ధం చెప్పావ్’ అని నిలదీస్తుంది. అది నా ఇష్టం.. నీకెందుకు అని అంటాడు అఖిల్. ‘ఇందులో నీ ఇష్టం నా ఇష్టం అని ఉండదు అఖిల్.. ఇన్నాళ్లూ నీకు ఉద్యోగం రావాలని కోరుకున్న వాళ్లకి అబద్ధం చెప్పడం తప్పు అఖిల్.. రూ.15 వేలు జీతం అంటే ఎంతో సంతోషపడ్డారు.. అదే రూ.30 వేలు అంటే ఎంత సంతోషపడేవారు’ అని అంటుంది జెస్సీ.

నేను నీ భర్తని నేను చెప్పినట్టు విను.. అఖిల్ ఆగ్రహం

అలా చెప్తే.. వచ్చిన మొత్తం తెచ్చి వాళ్ల చేతిలో పెట్టాలి. వాళ్లు నాకోసం ఏం చేయలేదు.. ఏం చేయలేదు అని ఎగతాళి చేయడం తప్ప.. వాళ్ల కోసం నేను ఎందుకు చేయాలి.. చదివించడం వాళ్ళ బాధ్యత.. నువ్ నా భార్యవి.. నేను చెప్పినట్టు విను’ అని అంటాడు అఖిల్. వాళ్లు ఏమీ చేయకుండానే ఇంత వాడివి అయ్యావా? రూ.30 వేల జీతానికి ఇంత స్వార్ధం వచ్చేసిందా? మీ అన్నయ్య జీవితాంతం మీకోసం కష్టపడుతున్నారు.. నువ్వు నీ స్వార్ధం చూసుకుంటున్నావ్’ అని జెస్సీ అనడంతో అఖిల్‌కి కోపం తన్నుకొస్తుంది.

జీతం రాగానే వేరే ఇంటికి జంప్.. నా వాళ్లనే కాదు నిన్న కూడా వదిలేస్తా

‘పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగోదు.. వాళ్ల గురించి నాకంటే ఎక్కువ తెలుసా? నువ్ ఎంత వరకూ ఉండాలో అంత వరకే ఉండు.. అయినా నువ్ ఈ ఇంట్లో ఉండటం వల్ల.. వాళ్లలా మాట్లాడుతున్నావ్.. రేపు జీతం రాగానే మనం సెపరేట్‌గా ఇల్లు తీసుకుందాం.. అప్పుడుగానీ నువ్ దారిలో పడవు’ అని అంటాడు అఖిల్. ఆ మాటతో జెస్సీ.. అంటే వాళ్లని వదిలేసి వెళ్లిపోదాం అంటున్నావా అఖిల్ అని అడుగుతుంది. ‘నాకు నచ్చలేదంటే నా వాళ్లనే వదిలేస్తాను.. నిన్ను కూడా వదిలేసే పరిస్థితి తెచ్చుకోకు.. చెప్పింది చెయ్’ అని వార్నింగ్ ఇస్తాడు అఖిల్. తన భర్త మాటలకు నివ్వెరపోతుంది జెస్సీ. నా భర్త మరీ ఇంత స్వార్ధపరుడా? అని ఎమోషనల్ అవుతుంది.

ఇక మన కష్టాలు తీరినట్టే జ్ఞానం..

మరోవైపు మల్లిక.. విష్ణుని ఇంట్లో నుంచి ఎలా బయటకు తీసుకుని వెళ్లి వేరే కాపురం పెట్టాలా? అని ఆలోచిస్తుంది. నా మాట విన్నారు కాబట్టి.. సొంతంగా షాప్ పెట్టుకున్నాం.. ఇంకా ఇంకా వింటే మరో పది షాప్‌లు పెట్టుకుంటాం అని విష్ణుకి ఎక్కిస్తుంది మల్లిక. అందరం వెళ్లిపోతే.. అమ్మనాన్నల్ని ఎవరు చూస్తారని విష్ణు అనడంతో.. ఇలాంటి సెంటిమెంట్‌ డైలాగ్‌లు నా దగ్గర కొట్టకుండా.. మనం ఈ ఇంట్లో నుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి అని అంటుంది మల్లిక. ఇక జ్ఞానాంబ, గోవిందరాజులు.. మన కష్టాలు తీరినట్టే.. ఒక చేతికి మూడు చేతులు కలిశాయి. మన కొడుకులందకీ ఉద్యోగాలు వచ్చేశాయి కాబట్టి.. రూ.20 లక్షల అప్పు తీర్చడం ఎంతలే అని అనుకుంటారు.

రామాకి సాయంగా కొత్త వ్యక్తి.. జానకికి రామా కొత్త పుస్తకాలు

ఇక స్వీట్స్ చేయడానికి రామా ఒక్కడే కష్టపడటం చూసిన గోవిందరాజులు.. తన స్నేహితుడి కొడుకు ఒకడు ఉన్నాడు.. వాడికి ఈ పనులు బాగా తెలుసు.. వాడ్ని రప్పించనా? మనకి రామాకి తోడుగా ఉంటాడు అని జ్ఞానాంబని అడుగుతాడు. దీంతో జ్ఞానాంబ.. వంట తెలుసని అంటున్నారు కాబట్టి.. రమ్మని చెప్పండి’ అని అంటుంది. వెంటనే గోవిందరాజులు.. ప్రసాద్ అనే వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఇక రామా జానకి కోసం పుస్తకాలు కొని తీసుకుని వస్తాడు. వాటిని చూసి జానకి ఎమోషనల్ అవుతుంది. మీరు ఐపీఎస్ సాధించాలని రామా అంటే.. సాధిస్తాను రామా గారూ అంటూ ఇద్దరూ పాడిన పాటే మళ్లీ పాడతారు.

మలయాళం వచ్చేశాడు.. వీడో పెద్ద మాలోకం

ఇక గోవిందరాజులు.. రామాకి సాయంగా ఫోన్ చేసిన వ్యక్తి వెరైటీ గెటప్‌లో ఎంట్రీ ఇస్తాడు. ఎవడ్రా నువ్.. చేటలు అమ్మేవాడిలా ఉన్నావ్ అని మల్లిక సెటైర్లు వేస్తే.. తన పేరు మలయాళం అని అంటాడు ఈ మాలోకం వ్యక్తి. చివరికి పనోడు అని తెలుసుకున్న మల్లిక.. ‘ఉన్నోడికే చోటు లేదంటే. మళ్లీ ఓవరాక్టింగ్ గాడా? అని కుళ్లుకుంటుంది మల్లిక. ఇక వీడు వంటలో తోపు తురుము అని గోవిందరాజులు తెగ పొగిడేస్తాడు. వీడు కాఫీ పెడితే వాసనకే ఆత్రేయపురం మొత్తం అదిరిపోద్ది అని చాలా గొప్పగా చెప్తాడు. అయితే ఆ మలయాళం గాడికి వంటే రాదు.. పని నేర్చుకోమని చెప్పి.. నన్ను మా మామ ఇరికించేశాడని అనుకుంటుంటాడు మలయాళం.

మలయాళం బిల్డప్ మామూలుగా లేదు..

నా గురించి వీళ్లు ఎక్కువ ఊహించుకుంటున్నారు.. నాకసలు వంటే రాదు.. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో.. నిజం చెప్తే వీళ్లు బయటకు తోసేస్తారు.. వంట వచ్చినట్టే బిల్డప్ ఇద్దాం అని అనుకుంటాడు మలయాళం. అయితే మల్లిక మాత్రం ఈ మలయాళం గాడ్ని గుర్తిపట్టేస్తుంది. వీడిలో మీరు చెప్పినంత విషయం కనిపించడం లేదే అని అనుమానం వ్యక్తం చేస్తుంది. దీంతో గోవిందరాజులు.. ‘ఒరేయ్.. మలయాళం నీకు ఇది కాఫీ పరీక్ష.. వెళ్లి అదిరిపోయే కాఫీ పెట్టుకుని రారా.. ఆ వాసనకి మల్లిక మాటలు పడిపోవాలి’ అని అంటాడు. దీంతో మలయాళం సయ్యో అంటూ లోపలికి పరుగుపెడతాడు. ఇక రేపటి ఎపిసోడ్‌లో అఖిల్ ఉద్యోగానికి వెళ్తూ.. రామాకి చెప్పకుండా వెళ్తుంటాడు. దీంతో రామా కళ్లు చెమ్మగిల్లగా జానకి ఓదార్చుతుంది. ఆ వివరాలు రేపటి ఎపిసోడ్‌లో..

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *