టుడే సీరియల్స్ ప్రివ్యూ.. ఒక్క క్లిక్‌తో ఆరు సీరియల్స్ టీవీలో కంటే ముందుగానే

ఈరోజు (ఫిబ్రవరి 03) రాత్రి ప్రసారం కాబోయే సీరియల్స్ ఎపిసోడ్‌లను రాత్రి అయ్యే వరకూ వేచి చూడాల్సిన పనిలేకుండా.. జరిగిన కథను ‘సమయం తెలుగు’లో ముందే అందిస్తున్నాం. ఇంటింటి గృహలక్ష్మి, గుప్పెడంత మనసు, ఎన్నెన్నో జన్మలబంధం, బ్రహ్మముడి, జానకి కలగనలేదు, కృష్ణ ముకుందా మురారి సీరియల్స్ ఈరోజు ఎపిసోడ్స్‌లో ఏమైందో చూసేద్దాం.

1. గుప్పెడంత మనసు

✦ వసు తనకి తాను మెడలో తాళి కట్టుకుంది. అయితే వసుకి నిజంగానే పెళ్లైపోయిందని అంతా నమ్ముతున్నారు. అయితే అనంతగిరి ఎస్ ఐ రంగంలోకి దిగి రాజీవ్ ఆట కట్టించడంతో అసలు నిజం తెలిసింది. అసలు రాజీవ్.. వసు మెడలో తాళి కట్టలేదని నిజం అందరి ముందు బయటపడింది. ఇలాంటి కథనంతో ఆసక్తికరంగా సాగిన నేటి ఎపిసోడ్‌లో ఏమైందో ఈ కింది లింక్‌లో చూసేయండి.

Read Also: గుప్పెడంత మనసు ఫిబ్రవరి 03 ఎపిసోడ్: రాజీవ్ అరెస్ట్.. అనంతగిరి ఎస్‌ఐ ఎంట్రీతో నిజం బట్టబయలు!‘వసు వీడి భార్య కాదు’

2. ఇంటింటి గృహలక్ష్మి

✦ నందుతో కేఫ్ పెట్టించడానికి అంతా కలిసి ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే అమ్మ కొడుకు ప్రేమ్ మాత్రం.. కేఫ్ పెట్టడానికి తన స్థలం ఇవ్వడానికి ససేమిరా అంటున్నాడు. మరి అతన్ని తులసి ఎలా ఒప్పించింది? మరోవైపు చాలా రోజుల తరువాత సీరియల్‌‌లోకి ఎంట్రీ ఇచ్చిన అభి అత్త గాయిత్రి ఎలాంటి ఫిటింగ్ పెట్టిందో.. నేటి ఎపిసోడ్‌లో ఏమైంది ఈ కింది లింక్‌లో చూడొచ్చు.

Read Also:

ఇంటింటి గృహలక్ష్మి ఫిబ్రవరి 03 ఎపిసోడ్: గాయిత్రి కుట్రలో భాగమైన అభి.. నందు కేఫ్‌‌ని క్లోజ్ చేసే ప్లాన్

3. బ్రహ్మముడి

కార్తీకదీపం సీరియల్ ముగింపు తరువాత మొదలైన ‘బ్రహ్మముడి’ ఆసక్తికరంగా సాగుతుంది. ద్వేషంతో మొదలలైన రాజ్ కావ్యల ప్రేమకథకు ఫన్ జోడించి రంజుగా నడిపిస్తున్నారు. రాజ్‌ను పెళ్లి చేసుకుని దుగ్గిరాల ఇంటికి వెళ్లబోయే ‘కావ్య’కి.. రాజ్ అంటే అస్సలు పడట్లేదు. కావ్య కనిపిస్తే చాలు ఒంటికాలిపై లేస్తున్నాడు రాజ్. ఇలాంటి కథాంశంతో సాగుతున్న బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో ఏమైందో ఈ కింది లింక్‌లో చూసేయండి.

Read Also:

బ్రహ్మముడి ఫిబ్రవరి 03 ఎపిసోడ్: రాజ్‌తో కాళ్లు నొక్కించుకున్న స్వప్న.. ఆస్కార్ లెవల్లో కనకం కవరింగ్.. పాపం కావ్య!

4. కృష్ణ ముకుందా మురారి

✦ మురారీని గదిలోకి లాక్కునిపోయిన ముకుంద.. అందరికీ షాక్ ఇచ్చే పని చేసింది. పాపం మురారీ వెళ్లిపోవాలని ట్రై చేసినా చేతులు అడ్డం పెట్టి ఆపేస్తుంది. కృష్ణని టెన్షన్ పెట్టేసింది ముకుందా. మరోవైపు పంతులు ఇచ్చిన చీరను మాయం చేసి.. క‌ృష్ణకు ఊహించని జలక్ ఇస్తుంది. ఆ తరువాత ఏమైంది? నేటి కథనంలో ఏమైందో ఈ కింది లింక్‌లో చూసేయండి.

97568407

5. ఎన్నెన్నో జన్మల బంధం

✦ బ్రమరాంభిక ఊహించని నిర్ణయంతో నేటి కథనం ఉత్కంఠగా మారింది. అభి ముందు నోరు విప్పింది బ్రమరాంభిక. మరోవైపు వేద-యష్‌ల ఆసక్తికరమైన సీన్ జరిగింది. అదేంటి? నేటి ఎపిసోడ్‌లో ఏమైందో ఈ కింది కథనంలో చూడొచ్చు.

97569375

6. జానకి కలగనలేదు

✦ తినేసి ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉంటున్న అఖిల్‌కి ఉద్యోగం చూస్తాడు జెస్సీ తండ్రి. తన అల్లుడు ఏదొక పని చేసుకుంటే.. కూతురు సుఖపడుతుందని అనుకుంటాడు పీటర్. అయితే అఖిల్ మాత్రం జెస్సీకి ఊహించని షాక్ ఇచ్చాడు. మరోవైపు మలయాళం అనే కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చాడు. అతనెవరు ఎందుకు వచ్చాడు.. నేటి ఎపిసోడ్‌లో ఏమైందో ఈ కింది లింక్‌లో చూసేద్దాం.

Read Also:

జానకి కలగనలేదు ఫిబ్రవరి 03 ఎపిసోడ్: జెస్సీని వదిలేస్తా.. అఖిల్ మూర్ఖత్వం.. కొత్తగా మలయాళం ఎంట్రీ

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *