తెలంగాణకు కొత్త ప్రాజెక్టు.. ఆసక్తికరంగా ప్రధాని మోదీ ట్వీట్

PM Modi: తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రైల్వే లైన్ల విద్యుదీకరణలో భాగంగా పర్లి వైజనాథ్-వికారాబాద్ మార్గంలో విద్యుదీకరణ చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రైల్వేశాఖ చేసిన ట్వీట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ షేర్ చేశారు. ఈ సందర్భంగా దీని వల్ల ప్రయోజనం పొందే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రజలకు అభినందనలు అంటూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మిషన్ విద్యుద్దీకణలో భాగంగా ఈ ప్రత్యేక విస్తరణ ద్వారా మూడు రాష్ట్రాలకు ప్రయోజనం జరుగుతుందని మోదీ తెలిపారు. పర్లి వైజనాథ్-వికారాబాద్ మార్గంలో విద్యుదీకరణ ప్రాజెక్ట్‌ను రైల్వేశాఖ ప్రకటించింది. లాతూర్ రోడ్-పర్లీ వైజ్‌నాథ్ మార్గంలో 268 కి.మీ మార్గం మొత్తం ఇప్పుడు విద్యుదీకరించబడుతుందని రైల్వేశాఖ ట్విట్టర్‌లో పేర్కొంది. తెలుగు రాష్ట్రాలకు కొత్తగా కొన్ని రైల్వే ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది. ఇవాళ సాయంత్రం జరగనున్న మీడియా సమావేశంలో వీటి వివరాలను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించనున్నారు. దీంతో తెలంగాణకు ఎలాంటి కొత్త రైల్వే ప్రాజెక్టులు వస్తాయనే దాని కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.

తెలంగాణ బడ్జెట్‌లో తెలంగాణకు నిరాశే ఎదురైంది. బీబీ నగర్ ఎయిమ్స్, సింగరేణి, మ్యూజియంలకు నిధులు కేటాయించారు. ఇక రాష్ట్రంలో గిరిజన వర్సిటీ ఏర్పాటుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ఇవి మినహా తెలంగాణకు బడ్జెట్‌లో పెద్దగా నిధులు లేవు. దీంతో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. బడ్జెట్ అంతా అంకెల గారెడీ అని, బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నా ప్రయోజనం లేదని విమర్శించారు. బీజేపీ ఎంపీలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *