దేవుడైనా.. మనిషైనా.. ఇతని చేతిలో పడితే సజీవ శిల్పమే

E.Santosh, News18, Peddapalli

మనం దేవుడిని ఎప్పుడూ చూడలేము కానీ గుడిలో ఉండే దేవుడిని మాత్రం చూస్తాం. దేవుడు మనుషులను తయారు చేశాడు అంటారు అది ఎవరికీ తెలియదు. కానీ మనిషి దేవుళ్ళను తయారు చేసేది మాత్రం చూడగలం. ఒక శిల్పి తన కళతో బండరాయిని గుడిలో దేవుణ్ణి చేస్తాడు. మట్టి, సిమెంట్ తో కూడా దేవుణ్ణి మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తారు. మరి ఇంతటి ప్రత్యేకతలు ఉన్న ఓ శిల్పిపై ప్రత్యేక కథనం. మనం కొలిచే దేవుడు ఇలాగే ఉంటాడు అని నిర్ధిష్టమైన ప్రమాణాలు ఏవీ లేనప్పటికీ.. పేరు తలవగానే ఆ రూపం కళ్లముందు కదలాడే విధంగా శిలా ప్రతిమలను తీర్చిదిద్దుతున్నాడు శిల్పి నవీన్. ఎలాంటి గురువు లేకుండానే ఇంతటి అద్భుతమైన విగ్రహాలను చేస్తూప్రత్యేకతను చాటుకుంటున్న నవీన్ గురించి తెలుసుకోవాలంటే బాపూజీ నగర్ కు వెళ్ళవలసిందే.

పెద్దపల్లి జిల్లా (Peddapalli District) గోదావరిఖనిలో బాపూజీ నగర్ కు చెందిన నవీన్ శిల్పాల తయారీలో ప్రత్యేకథను చాటుకుంటున్నారు. ఎలాంటి విగ్రహం అయిన అలవోకగా తయారు చేయడం నవీన్ ప్రత్యేకత. నవీన దేవుళ్ళ విగ్రహాలు, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు, సినిమా ఆర్టిస్టులు, స్వర్గీయుల విగ్రహాలు తయారు చేస్తారు. నవీన్ లో ప్రత్యేకత ఎంటి అంటే గురువు లేకుండానే ఈ విగ్రహ తయారీ నేర్చుకున్నాడు.

మొదట్లో కొంచెం ఇబ్బంది అయినా ఎన్నో ప్రయత్నాల తరువాత విగ్రహాల పర్ఫెక్షన్ వచ్చింది అని తెలిపాడు. నవీన్ చిన్నప్పటి నుంచి చిరంజీవి వీరాభిమాని. చిరంజీవి ఏ సినిమా వచ్చినా మొదటి రోజు వెళ్లి చూసేవారు. చిరంజీవి ఇండస్ట్రీలో ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాడో తాను చెప్పిన మాటలు నాకు స్ఫూర్తి ఇచ్చాయని నవీన్ అంటారు.

ఇది చదవండి: కొత్త సాగువైపు రైతుల చూపు.. లాభాల ఎలా ఉన్నాయంటే..!

మొదట గోదావరిఖని వెళ్లి విగ్రహల తయారీ చేయడం ప్రారంభించానని.. నా ప్రతిభ గుర్తించిన సింగరేణి యాజమాన్యం తొలుత అమ్మవారి విగ్రహం ఆర్డర్ ఇచ్చారని తెలిపారు. సింగరేణి యాజమాన్యం ఇచ్చిన ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయిలో ఉన్నానని నవీన్ తెలిపాడు. చిన్నగా ప్రారంభించిన శిల్పి నవీన్ తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా విగ్రహాలు తయారీ చేస్తున్నాడు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుండి ఆర్డర్లు వస్తున్నాయని.. ఇంకా తనకి కొన్ని డ్రీమ్ ప్రాజెక్టులు ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే చేరుకుంటానని నవీన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *