నందమూరి తారకరత్న బెంగళూరు నారాయణ హృదయాలయలో కోలుకుంటున్నారు. ఆసుపత్రిలో చేరిన రోజు నుంచి ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం రోజురోజుకి మెరుగుపడుతోంది. తారకరత్న గుండె, కాలేయం ఇతర అవయవాలన్నీ బాగున్నాయని.. మెదడుకు సంబంధించి వైద్యం అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం నందమూరి బాలకృష్ణ హైదరాబాద్ నుంచి నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు.. తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని.. అవసరమైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. నారాయణ హృదయాలయ తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు బులిటెన్ విడుదల చేస్తూ.. ఆయన అభిమానులకు ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తున్నారు. తారకరత్న ఆరోగ్యం గురించి నందమూరి బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వైద్యులతో చర్చిస్తున్నారు.