నూతన సెక్రటేరియట్ లో అగ్నిప్రమాదం హైదరాబాద్ : నూతన సెక్రటేరియట్ లో అగ్నిప్రమాదం జరిగింది. సెక్రటేరియట్ ప్రధాన గోపురం నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. భారీ పొగలతో అక్కడ పని చేస్తున్న కార్మికులు ఉక్కిరి బిక్కరయ్యారు. విషయం తెలియగానే ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. అగ్ని ప్రమాదం జరగడంతో కొత్త సెక్రటేరియట్ చుట్టూ పోలీసులు ఆంక్షలు విధించారు. మీడియాను కూడా అటు వైపునకు అనుమతించడం లేదు. కొత్త సెక్రటేరియట్ లో ఎలక్ట్రికల్ పనులు నడుస్తున్నాయని తెలుస్తోంది.
©️ VIL Media Pvt Ltd.