పాల ధరలు పెంచిన ‘అమూల్’.. లీటరుపై ఎంతంటే?

Milk Price: సామాన్యులు, మధ్య తరగతి ప్రజలపై ధరల భారం ఇప్పట్లో తగ్గేలా కనిపించటం లేదు. ఇప్పటికే అనేక నిత్యావరసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు పాల ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలోనే అతిపెద్ద పాల విక్రయ సంస్థ అమూల్ పాల ధరలు మరోసారి పెరిగాయి. గతేడాది అమూల్ పాల ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ధరల పెంపు ప్రకటన చేసింది. లీటర్ పాలపై రూ.3 ధర పెంచుతున్నట్లు గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. తాజా నిర్ణయంతో అమూల్ కంపెనీకి చెందిన వివిధ రకాల ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం (ఫిబ్రవరి 3) నుంచే అమలులోకి వచ్చాయి.

పెరిగిన ధరల ప్రకారం..

అమూల్ గోల్డ్ లీటర్ ధర రూ.66

అమూల్ తాజా లీటర్ ధర రూ.54

అమూల్ ఆవు పాలు లీటర్ ధర రూ.56

అమూల్ ఏ2 గేదె పాలు లీటర్ ధర రూ.70

పాల ఉత్పత్తి వ్యయం, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల పాల ధరల్ని పెంచక తప్పటం లేదని కంపెనీ ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే కేవలం పశువుల దాణా ఖర్చు దాదాపు 20 శాతానికిపైగా పెరిగిందని అమూల్ సంస్థ చెబుతోంది. ముడి సరుకుల ఖర్చు, ఇతర వ్యయాలను పరిగణనలోకి తీసుకుని, తమ భాగస్వామ్య సంఘాలు కూడా రైతుల ధరలను గతేడాది కంటే 8-9 శాతం వరకు పెంచినట్లు కంపెనీ వెల్లడించింది. గత సంవత్సరం చివరిసారిగా 2023, అక్టోబర్‌లో లీటర్ పాలపై రూ.2 ధర పెంచింది అమూల్. అప్పుడు కూడా ఇవే కారణాలు చెప్పటం గమనార్హం. మిగతా కంపెనీలు కూడా గత సంవత్సరం పాల ధరల్ని భారీగా పెంచేశాయి. దీంతో ప్రజలపు అదనపు భారం తప్పట్లేదు.

అమూల్‌తో పాటు దేశంలోని ప్రైవేటు డెయిరీల్లో ఒకటైన గోవర్ధన్ బ్రాండ్ కూడా పాల ధరల్ని పెంచింది. లీటర్ పాలపై రూ.2 ధర పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. దీంతో గోవర్ధన్ పాల ధర లీటర్‌కు రూ.54 నుంచి రూ.56కి పెరిగింది. ఈ బ్రాండ్ గత నెల రోజుల్లోనే రెండుసార్లు పాల ధరల్ని పెంచడం గమనార్హం. ఈ బ్రాండ్ ఒక్క ముంబై లోనే 2.5 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తుంటుంది. గోవర్ధన్ బ్రాండ్ మాహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి పాలను సేకరిస్తుంది.

మరోవైపు దేశంలోని మరో పెద్ద పాల విక్రయ సంస్థ మదర్ డెయిరీ గత ఏడాది డిసెంబర్‌లో లీటర్ పాలపై రూ.2 పెంచింది. ఒక్క ఏడాదిలోనే 5 సార్లు ధరలను సవరించింది మదర్ డెయిరీ. ఫుల్ క్రీమ్ మిల్క్ పై రూ.2, టోకెన్ మిస్క్ పై రూ.2 ధరల్ని పెంచిన విషయం తెలిసిందే. డెయిరీ రైతులను నుంచి ముడి పాలను సేకరించే ధరలు పెరిగినందునే తామూ పెంచాల్సి వచ్చినట్లు పేర్కొంది.

  • Read Latest Business News and Telugu News

Also Read:

అదానీకి మరో 4 ఎదురుదెబ్బలు.. అమెరికా ఝలక్.. అదానీ స్టాక్స్ 70 శాతం పతనం.. లక్షల కోట్లు ఆవిరి!

అదానీ స్టాక్స్‌పై SEBI నిఘా.. ఇక అలా జరిగే ఆస్కారమే లేదు! ఇలా చేస్తే ఏమవుతుంది?

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *