పోలీస్ ఆఫీసర్గా ఎంఎస్ ధోని

పోలీస్ ఆఫీసర్గా ఎంఎస్ ధోని క్రికెటర్గా, టీమిండియా కెప్టెన్గా ఆర్మీ మ్యాన్గా కనిపించిన ఎంఎస్ ధోని..పోలీస్ ఆఫీసర్గా మారాడు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి నేరగాళ్లను వేటాడుతున్నాడు. ఓ చేతిలో లాఠీ.. మరో చేతిలో గన్ పట్టుకుని అదుర్స్ అనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఖాకీ చొక్కాలో ఉన్న ధోని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

పోలీస్ ఆఫీసర్గా ధోని..

పోలీస్ డ్రెస్ వేసుకున్న ధోని సహచర పోలీసులతో కలిసి తుపాకులు నేరగాళ్లపై ఎక్కుపెట్టిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మూవీ సన్నివేశాన్ని తలపిస్తున్న ఈ ఫోటో..అడ్వర్టైజ్ మెంట్లో భాగంగా తీసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2023 కోసం ధోని రిలయన్స్ వయాకామ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఐపీఎల్ ఓటీటీ రైట్స్ను దక్కించుకున్న వయాకామ్ సంస్థ.. జియో సినిమా యాప్ ద్వారా ఐపీఎల్ మ్యాచులు ప్రసారం చేయనుంది. ఇందులో భాగంగా ధోనిని వయాకామ్ అంబాసిడర్ గా నియమించుకున్నట్లు తెలుస్తోంది. 

ఐపీఎల్ కోసం ప్రాక్టీస్..

అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగిన ధోని..ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు.  ఇందులో భాగంగా ఐపీఎల్ 2023 కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.  సొంత మైదానం జార్ఖండ్‌లో  యువ బౌలర్లతో బౌలింగ్ చేయించుకొని భారీ షాట్లు ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరోవైపు ధోనికిదే చివరి ఐపీఎల్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ ఐపీఎల్ తర్వాత ..చెన్నై వేదికగా సొంత ప్రేక్షకుల మధ్య ఐపీఎల్కు ధోని ఘనంగా వీడ్కోలు పలికే ఛాన్సుంది. 

©️ VIL Media Pvt Ltd.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *