LIC Policy: ప్రభుత్వ రంగ బీమా సంస్థ భారతీయ జీవిత బీమా కంపెనీ (ఎల్ఐసీ) కస్టమర్లను ఆకర్షించేందుకు ఎప్పుటికప్పుడు కొత్త కొత్త పాలసీలను తీసుకొస్తుంటుంది. భవిష్యత్తును ఆర్థిక కష్టాల నుంచి తప్పించేందుకు చాలా మంది ఎల్‌ఐసీ పాలసీలను తీసుకును పొదుపు చేస్తుంటారు. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది వంటి పద్ధతుల్లో ప్రీమియం చెల్లించే వీలుంటుంది. ఉద్యోగం చేసేవారు నెలవారీ పొదుపు చేసుకుని మెచ్యూరిటీ నాటికి మంచి రిటర్న్స్ వచ్చే పాలసీలను ఎంచుకుంటారు. అలా నెల నెల రూ.60 చెల్లించి మెచ్యూరిటీ సమయానికి చేతికి రూ.8 లక్షలు అందించే ఒక పాలసీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మహిళల కోసం ప్రత్యేకంగా ఎల్ఐసీ సంస్థ ఆధార్ శీలా అనే ప్లాన్ తీసుకొచ్చింది. ఇందులో భవిష్యత్తు రక్షణతో పాటు పొదుపు అందుబాటులో ఉంటుంది. పాలసీదారుడు అనుకోకుండా మరణించిన సందర్భంలో వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తుంది. అయితే, పాలసీదారుడు మెచ్యూరిటీ సమయానికి జీవించి ఉంటే పెద్ద మొత్తంలో సొమ్మును తిరిగి అందిస్తుంది. ఆటో కవర్, లేదా లోన్ సుదపాయంతో ఈ పాలసీ ద్వారా ఎప్పుడైనా డబ్బులు పొందే వెసులుబాటు ఉంటుంది.
ఉద్యోగులకు అలర్ట్.. ఇక అలాంటి పాలసీ తీసుకుంటే ట్యాక్స్ కట్టాల్సిందే..!
మీ వయస్సు 30 ఏళ్లు ఉన్నప్పుడు ఆధార్ శీలా పాలసీ తీసుకున్నారనుకుందాం. రోజుకు రూ.58 చెల్లిస్తే ఏడాదికి రూ.21,918 చెల్లించాల్సి వస్తుంది. మొత్తం 20 ఏళ్ల మెచ్యూరిటీ కాలానికి మీరు చెల్లించేది రూ.4,29,392 అవుతుంది. దీనికి వడ్డీ సహా ఇతర బెనిఫిట్స్ అందిస్తూ మెచ్యూరిటీ తర్వాత మీ చేతికి రూ.7,94,000 ఇస్తుంది ఎల్ఐసీ. అయితే, ఈ పాలసీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వారికి మాత్రమే ఇస్తారు. పాలసీ తీసుకునే ముందే వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పాలసీలో కనీస సమ్ అష్యూర్డ్ రూ.75 వేలుగా ఉండగా.. గరిష్ఠంగా రూ.3,00,000 లుగా ఉంది. ఇందులో చేరేందుకు 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసు వారు అర్హులు. పాలసీ టర్మ్ వచ్చి 10 ఏళ్ల నుంచి 20 సంవత్సరాలు ఉంటుంది. మెచ్యూరిటీ సమయానికి గరిష్ట వయో పరిమితి 70 ఏళ్లుగా నిర్ణయించారు.
చెల్లించిన ప్రీమియం మొత్తంలో 105 శాతం కన్నా తక్కువగా చెల్లించకూడదు. ప్రతికూల పరిస్థితుల్లో అటు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ఇటు పాలసీ టర్మ్‌లో చేతికి డబ్బులు వస్తాయి. ఇంకా మెచ్యూరిటీ సమయంలో బీమా మొత్తం పొందొచ్చు. ఇలా మూడు రకాలుగా ఈ ప్లాన్ ద్వారా బెనిఫిట్ పొందొచ్చు. అందుకే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావించే వారు ఈ పాలసీని ఒకసారి పరిశీలించొచ్చు.
Read Latest
Business News and Telugu News
Also Read:
అదానీ గ్రూప్ సంచలనం.. ఇన్వెస్టర్లందరికీ తిరిగి డబ్బులు.. అసలేమైంది?
లక్షల కోట్లు నష్టం.. ‘అదానీ’కి తగిలిన 10 ఎదురుదెబ్బలు ఇవే..!