విధుల్లో ఉండగానే మద్యం సేవిస్తూ కెమెరాకు చిక్కిన పోలీసులు

గస్తీ విధులు గాలికి వదిలేశారు. నియమ నిబంధనలను పక్కన పడేశారు. ఒంటి మీద ఖాకీ డ్రెస్ ఉండగానే.. పెట్రోలింగ్ పోలీసు వాహనాన్ని అడ్డుగాపెట్టి మరీ మందేస్తూ విందు చేసుకున్నారు ఇద్దరు పోలీసులు. వీళ్ల బాగోతం కాస్తా ఓ కెమెరా కంటికి చిక్కటంతో అడ్డంగా బుక్కయ్యారు పోలీసులు. కాగా… దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో రాత్రి పూట పెట్రోలింగ్ చేయాల్సిన పోలీసులు.. విధులను గాలికి వదిలేసి ఒక దగ్గర తీరిగ్గా కూర్చొని ముచ్చట పెడుతూ మద్యం సేవిస్తూ కనిపించారు. అయితే.. వాళ్లు చేస్తున్న పనికి అడ్డుగా పోలీసు వాహనాన్నే పెట్టుకోవటం గమనార్హం. అంతేందుకు.. వాకీటాకీని కూడా ఇందులో భాగం చేశారు. మంచింగ్ ప్లేట్‌ గాలికి ఎగరకుండా పెట్టారు. వాళ్లు సేవిస్తున్న మందు ఎవ్వరికీ కనిపించకుండా.. అవతలివైపున దాచారు. కాగా.. ఈ సన్నివేశం మొత్తం ఒక కెమెరా కంటికి చిక్కింది.

ఈ ఘటన మూడు రోజుల క్రితం ఎర్రమంజిల్ గలేరియా మాల్ సమీపంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో.. అది కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. విధుల్లో ఉండి కూడా మద్యం సేవిస్తూ అడ్డంగా బుక్కయిన ఖాకీలపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. రాత్రి పూట పెట్రోలింగ్ చేయాల్సిన పోలీసులు ఈ విధంగా మద్యం సేవిస్తూ ఉండడంతో నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

97579027

Read More Telangana News And Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *