వీళ్లు మనుషులు కాదు.. జంతువులు: యాంకర్ రష్మి ఫైర్

విచక్షణతో ఉంటే మనిషి.. విచక్షణ కోల్పోతే పశువు అని అంటుంటారు. కానీ మనుసులే విచక్షణ లేకుండా పైశాచికత్వంతో మానవ మృగాలుగా ప్రవర్తిస్తున్న ఘటనలు మనకి కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా రాజస్థాన్‌లో జరిగిన ఇలాంటి ఘటనను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది యాంకర్ రష్మి. జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ (Rashmi Gautam) జంతు ప్రేమికురాలు. జంతువుల్ని హింసిస్తూ.. వాటిపై క్రూరత్వానికి పాల్పడే మానవమృగాలకు సంబంధించి వీడియోలు ఫొటోలను షేర్ చేసి.. తన నిరసనను తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ‌లో ఈ తరహా పోస్ట్‌లను షేర్ చేసింది. కొంతమంది యువకులు.. గుర్రాన్ని దారుణంగా హింసిస్తూ దాన్ని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. దానిపై ఎక్కి డాన్స్ చేస్తూ.. దాని తోకనిపట్టుకుని వేలాడుతూ.. వీపుపై బలంగా తొక్కుతూ ఆ మృగాన్ని దారుణంగా హింసపెడుతున్నారు. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. దానికి సంబంధించి ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన రష్మి.. తనదైన శైలిలో ఫైర్ అయ్యింది.

అసలు జంతులువు ఏవో ఇక్కడ చూడొచ్చు.. ఈ మానవ మృగాలు ఇలా కావడానికి వారి పెంపకంలోనే తేడా ఉంది. ఇలాంటి వాళ్ల కఠిన మైన శిక్ష పడాలి.. ఈ నేరస్థులను పట్టుకోవడానికి సహకరించండి.. ఈ వీడియోను షేర్ చేయండి. ఆ గుర్రాన్ని వారి బారి నుంచి రక్షించండి’ అంటూ పిలుపునిచ్చింది యాంకర్ రష్మి.

అయితే రష్మికి జంతువులన్నా.. పక్షులన్నా చాలా ఇష్టం. మూగజీవాలపై ప్రేమని చూపిస్తూ.. జంతు సంక్షేమం కోసం గళం వినిపిస్తూనే ఉంటుంది యాంకర్ రష్మి. లాక్ డౌన్ టైంలో వీధి కుక్కల కోసం ఫుడ్‌ని సప్లై చేసి.. స్వయంగా వాటి దగ్గరకు వెళ్లి వీధి కుక్కల ఆకలి తీర్చింది రష్మి. జంతు సంరక్షణలో భాగంగా.. మూగ జీవాలను దత్తత తీసుకుంది రష్మి. జంతు ప్రేమికురాలిగా వాటి పరిరక్షణకు సంబంధించి వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది రష్మి.

ప్రస్తుతం యాంకర్ రష్మి.. ఎక్స్ ట్రా జబర్దస్త్‌తో పాటు.. శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తుంది. వీటితో పాటు స్పెషల్ ఈవెంట్‌లు.. డాన్స్ ప్రోగ్రామ్స్‌తో బిజీగా మారింది రష్మి. ఇటు టీవీ కార్యక్రమాలతో పాటు.. సినిమాల తోనూ బిజీగా మారింది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో యాంకర్ రష్మి మంచి పాత్ర దక్కింది. అంతకు ముందు.. గుంటూరు టాకీస్, నెక్స్ట్ నువ్వే, అంతకు మించి వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించింది.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *