హైదరాబాద్ నగరంలో మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ నెల 7 నుంచి 12 వరకు ఎన్టీఆర్ మార్గ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లుగా ట్రాఫిక్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ నెల 11న ఎలక్ట్రిక్ కార్ రేస్ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 7 నుంచి 12 వరకు ఎన్టీఆర్ మార్గ్ మూసేయనున్నారు. ఈ మార్గంలో వెళ్లాలనుకునే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఈ నెల 5 నుంచి 7 వరకు ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మూసివేయనున్నట్టుగా ట్రాఫిక్ అడిషనల్ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై రాకపోకలకు అనుమతి ఉంటుందని తెలిపారు. బస్ రూట్లలో కూడా డైవర్షన్స్ ఉంటాయన్నారు. ప్రజలు మెట్రో రైలు ప్రయాణం వినియోగించాలని.. లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలను విరివిగా వాడుకోవాలని సూచించారు.
లిబర్టి, అంబేడ్కర్ విగ్రహం, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ జంక్షన్, ఇగ్బాల్ మినార్ గుండా వెళ్లే వాహనదారులు వేరే మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. నూతన సచివాలయ పనులకు ఆటంకం లేదని.. పనులు యథావిధిగా జరుగుతాయన్నారు. అయితే.. ప్రజలు అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్‌కు సహకరించాలని నగర ట్రాఫిక్ అడిషనల్ సీపీ సుధీర్ బాబు కోరారు.
97579027
Read More Telangana News And Telugu News