హ్యుందాయ్ (Hyundai) అద్భుతమైన ఫీచర్స్‌తో సరికొత్త కార్లను లాంచ్ చేస్తోంది. ఈ కార్‌మేకర్‌కు ఇండియన్ మార్కెట్‌లో గణనీయమైన వాటా ఉంది. తాజాగా 2023 మోడల్ ఇయర్ (MY) SUV రేంజ్ లను అప్‌డేట్ చేసింది. ఈ జాబితాలో క్రెటా, అల్కాజర్ ఉన్నాయి. ఎక్స్‌ట్రా సెఫ్టీ ఫీచర్స్‌తో ఈ ఎస్‌యూవీలను అప్‌డేట్ చేసింది. అంతేకాకుండా రియల్ డ్రైవింగ్ ఉద్గారాల (RDE) నిబంధనలకు అనుగుణంగా కంపెనీ E20 ఫ్యూయల్ రెడీతో ఈ మూడు SUVల ఇంజిన్‌లను అప్‌గ్రేడ్ చేసింది. ఈ ఎస్‌యూవీల్లో అదనంగా ఐడిల్ స్టాప్ అండ్ గో (ISG) ఫీచర్‌ను కూడా కంపెనీ తాజాగా అందిస్తోంది.
* 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
హ్యుందాయ్ క్రెటా, అల్కాజర్ 6 ఎయిర్‌బ్యాగ్స్ (డ్రైవర్, ప్యాసింజర్, సైడ్ & కర్టెన్)తో అప్‌గ్రేడ్ అయింది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM), హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC), రియర్ డిస్క్ బ్రేక్స్, సీట్‌బెల్ట్ హైట్ అడ్జస్ట్ మెంట్ అండ్ ISOFIX చైల్డ్ యాంకరేజస్ వంటి స్టాండర్డ్ సెఫ్టీ ఫీచర్స్ ఎంటైర్ లైనఫ్‌లో ఉంటాయి.
* ఐడిల్ స్టాప్ & గో ఫీచర్
హ్యుందాయ్ అల్కాజార్, క్రెటాలో ఐడిల్ స్టాప్ & గో (ISG) ఫీచర్ ఉండడంతో స్టాప్ & గో డ్రైవింగ్ పరిస్థితుల్లో ఇంధన సామర్థ్యాన్ని పెంచడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. క్రెటా స్టాండర్డ్ ఫీచర్‌గా 60:40 స్ప్లిట్ రియర్ సీటు ఉంటుంది.
* క్రెటా మూడు ఇంజన్ ఆప్షన్స్
క్రెటా-2023 మోడల్ రూ.10.84 లక్షల ప్రారంభ ధర నుంచి రూ. 19.13 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ SUVలో మూడు ఇంజన్ ఆప్షన్స్ ఉంటాయి. 1.5-లీటర్ MPi పెట్రోల్, 1.4-లీటర్ కప్పా T-GDi పెట్రోల్, 1.5-లీటర్ U2 CRDi డీజిల్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.
* అల్కాజర్ రెండు ఇంజన్ ఆప్షన్
అల్కాజర్-2023లో అప్‌గ్రేడ్ తరువాత ఆరు ఎయిర్‌బ్యాగ్స్ (డ్రైవర్, ప్యాసింజర్, సైడ్, కర్టెన్) స్టాండర్డ్‌గా ఉంటాయి .ఈ ఎస్‌యూవీ ధర రూ. 16.10 లక్షలతో మొదలై రూ. 21.10 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. అల్కాజర్‌లో రెండు ఇంజన్ ఆప్షన్స్ ఉంటాయి. 2.0-లీటర్ MPi పెట్రోల్, 1.5-లీటర్ CRDi డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఉంటుంది.
ఇది కూడా చదవండి : మహీంద్రా XUV400 సరికొత్త రికార్డ్.. నాలుగు రోజుల్లోనే 10 వేలకు పైగా బుకింగ్స్
* మరింత సెక్యూరిటీ, ఫ్లెక్సిబులిటీ
హ్యుందాయ్ మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. కస్టమర్ సెంట్రిక్ ఆర్గనైజేషన్‌గా, తమ కస్టమర్‌లకు బెస్ట్ మొబిలిటీ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. హ్యుందాయ్ SUV 2023 మోడల్స్ అప్‌డేట్స్‌తో మరింత సెక్యూరిటీ, ఫ్లెక్సిబులిటీ, పనితీరుతో కూడిన మరింత ఆరోగ్యకరమైన ప్యాకేజీని అందిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఈ ఎస్‌యూవీలను అప్‌గ్రేడ్ చేసినట్లు తెలిపారు. తమ పవర్‌ట్రెయిన్స్ RDE కంప్లైంట్, E20 ఫ్యూయల్ రెడీలకు అనుగుణంగా ఉన్నాయని తరుణ్ గార్గ్ స్పష్టం చేశారు. కాగా RDE నిబంధనలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానున్నాయి. దీంతో ఆటోమేకర్స్ ఈ నిబంధనలకు అనుగుణంగా తమ ఎస్‌యూవీ లైనప్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నాయి.