Reserve Bank of India | దేశంలో కేంద్ర బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రెండు బ్యాంకులకు (Banks), ఒక ఫైనాన్స్ కంపెనీకి షాకిచ్చింది. రూల్స్ అతిక్రమణ నేపథ్యంలో ఆర్‌బీఐ (RBI) వీటిపై కొరడా ఝుళిపించింది. పెనాల్టీ విధించింది. ఈ జరిమానా ఎదుర్కొన్న సంస్థల్లో దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఉండటం గమనార్హం.
ఆర్‌బీఐ ఫిబ్రవరి 3న బ్యాంక్ ఆఫ్ బరోడా, నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్రేజీ బీ సర్వీసెస్ సంస్థలపై జరిమానా వేసింది. నిబంధల అతిక్రమణ నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాపై ఆర్‌బీఐ రూ. 30 లక్షల జరిమానా వేసింది. ఇక క్రేజీ బీ సంస్థపై అయితే రూ. 42.48 లక్షలు పెనాల్టీ విధించింది. ఇక నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ రూ. 39.5 లక్షలు జరిమానా వేసింది. అంటే ఆర్‌బీఐ ఈ మూడింటిపై మొత్తంగా రూ. కోటికి పైగా పెనాల్టీ విధించింది.
కేంద్రం గుడ్ న్యూస్.. ఇక ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ.20,000
బ్యాంక్ ఆఫ్ బరోడాపై ఆర్‌బీఐ తనిఖీ నివేదిక ప్రకారం చూస్తే.. స్మాల్ అకౌంట్లకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ లిమిట్స్‌ను బ్యాంక్ అతిక్రమించిందని, అలాగే పలు టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల అంశంలో కూడా బ్యాంక్ రూల్స్‌ను బ్రేక్ చేసింది. అందుకే ఆర్‌బీఐ ఇప్పుడు కొరడా ఝులిపించింది. ఇక క్రేజీ బీ విషయానికి వస్తే.. ఈ నాన్ డిపాజిట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీపై ఆర్‌బీఐ కన్నెర్ర చేసింది. రుణ రికవరీలో భాగంగా ఈ సంస్థ ఏజెంట్లు వేధింపులకు పాల్పడుతున్నారని, దీన్ని క్రేజీ బీ నియంత్రించలేకపోయిందని, అందుకే జరిమానా విధిస్తున్నట్లు ఆర్‌బీఐ స్పష్టత ఇచ్చింది.
గూగుల్ పే వాడే వారికి గుడ్ న్యూస్.. 2 నిమిషాల్లో రూ.3 లక్షల లోన్!
ఇక నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విషయానికి వస్తే.. బారోవల్ అకౌంట్లను నాన్ ఫర్పార్మింగ్ అసెట్స్ (ఎన్‌పీఏ – మొండి బకాయిలు) కింద వర్గీకరించడంలో నిబంధనలు అతిక్రమించిందని ఆర్‌బీఐ పేర్కొంది. అందుకే ఈ బ్యాంక్‌పై పెనాల్టీ వేసినట్లు ఆర్‌బీఐ సమర్థించుకుంది. ఇలా రూల్స్ బ్రేక్ చేసిన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై ఆర్‌బీఐ కొరడా ఝులిపించింది. ఆర్‌బీఐ ప్రతి బ్యాంక్‌లో, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఇతర ఆర్థిక సంస్థల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తూ ఉంటుంది. వీటిల్లో ఏమైనా పొరపాట్లు చోటుచేసుకుంటే మాత్రం ఆర్బీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. కొన్ని కో ఆపరేటివ్ బ్యాంకుల లైసెన్స్ కూడా రద్దు చేసిన పరిస్థితులు ఉన్నాయి.