Ayodhya Ram Mandir రాముని విగ్రహ తయారీకి తీసుకొచ్చిన శాలిగ్రామ శిల, పవిత్ర రాయి విశేషాలేంటో చూసెయ్యండి…

Ayodhya Ram Mandir దాదాపు వంద సంవత్సరాల తర్వాత రామ జన్మభూమిలో మరోసారి పండుగ వాతావరణం మొదలైంది. ప్రస్తుతం అక్కడి ప్రాంతమంతా రామనామంతో మారుమోగుతోంది. ఎందుకంటే సీతారాముల విగ్రహాల తయారీ కోసం నేపాల్ నుంచి ‘శాలిగ్రామ శిల’ పవిత్ర రాళ్లను తీసుకొచ్చారు. ఇటీవలే ఈ శాలిగ్రామ శిలలు అయోధ్యకు చేరుకోగా.. వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఈ పూజల అనంతరం శిల్పులందరూ కలిసి విగ్రహాలను తయారు చేస్తారు. ఈ శాలిగ్రామ శిలలు దాదాపు 6 కోట్ల సంవత్సరాల నాటివని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఈ శాలిగ్రామ శిలల గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం…

నేపాల్ లోని కాళీ నది నుంచి శాలిగ్రామ రాళ్లను తొలగించేందుకు ముందుగా నియమ నిబంధనల ప్రకారం, పూజలు నిర్వహించారు. కాళేశ్వర్ మహాదేవ్ ఆలయంలో కూడా శిలాభిషేకం చేశారు. ఆ తర్వాతే దేవుళ్లకు క్షమాపణ చెబుతూ ఈ పవిత్ర శాలిగ్రామ శిలలను భారతదేశంలోని అయోధ్యకు తరలించారు.

Mahashivratri 2023 శివయ్య కలలో ఇలా కనిపిస్తే శత్రువుల పీడ తొలగిపోతుందట…!

శ్రీరామ నవమి రోజున సూర్య కిరణాలు నేరుగా స్వామి వారి నుదుటిపై పడేలా విగ్రహం ఎత్తును ఉంచనున్నారు. అధికారిక సమాచారం ప్రకారం, ఈ పవిత్ర రాళ్లలో ఒకదాని బరువు 26 టన్నులు. మరొక రాయి బరువు 14 టన్నులు.

ఈ పవిత్రమైన రాళ్లతో శ్రీరాముని విగ్రహంతో పాటు తన ముగ్గురు సోదరులు లక్ష్మణుడు, భరతుడు, శత్రఘ్నుల విగ్రహాలు కూడా చెక్కబడతాయి.

శాస్త్రాల ప్రకారం, ఈ శాలిగ్రామంలో శ్రీ మహా విష్ణువు కొలువై ఉంటాడని నమ్ముతారు. పురాణాల్లో తులసి దేవి, లార్డ్ శాలిగ్రాముల వివాహం జరిగినట్లు పేర్కొనబడింది.

శాలిగ్రామ రాళ్లు గండకీ నదిలో మాత్రమే లభ్యమవుతాయి. శాలిగ్రామ రాయిని పూజించడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, ఐశ్వర్యం, ప్రేమ చెక్కు చెదరకుండా ఉంటాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చాలా మంది విశ్వాసం.

హిమాలయాల నుంచి ప్రవహించే నది భారీ శిలలను చీల్చుకుంటూ ప్రవహిస్తుంది. 33 రకాల శిలాజాలతో ఈ శాలిగ్రామ శిలలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 2024 సంవత్సరం కంటే ముందే ఈ శాలిగ్రామ శిలలతో అయోధ్య రాముని విగ్రహం తయారు కానుంది. రాముని విగ్రహంతో పాటు సీతాదేవి విగ్రహాన్ని కూడా తయారు చేయనున్నారు. ఈ రెండు విగ్రహాల తయారీ అనంతరం గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు.

Read

Latest Religion News

and

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *