ChatGPTకి గూగుల్‌లో ఎంట్రీ-లెవల్ కోడింగ్ జాబ్‌ పక్కా.. వారిలో ఆందోళన షురూ..!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్‌ ChatGPT సత్తా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రోజుకో తీరులో చాట్‌జిపిటి సామర్థ్యం బయటకు వస్తోంది. OpenAI కంపెనీ లాంచ్‌ చేసిన ChatGPT కారణంగా గూగుల్‌ (Google) ఆలోచనలో పడాల్సిన పరిస్థితి నెలకొంది. నవంబర్‌లో వచ్చిన AI టూల్‌ ఒక నెలలోనే మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. ఒక కొత్త నివేదిక ప్రకారం.. ChatGPTకి గూగుల్‌లో ఎంట్రీ-లెవల్ కోడింగ్ జాబ్‌ నిర్వర్తించగల నైపుణ్యం పొందగలదని పేర్కొంది. గూగుల్‌ తన సొంత AI చాట్‌బాట్ టూల్‌తో చాట్‌జిపిటిని పోల్చినప్పుడు ఈ విషయం తెలిసిందని చెప్పింది.

* కోడర్స్‌లో ఆందోళన

సమర్థంగా కోడింగ్‌ చేసే ChatGPT సహజమైన సామర్థ్యం ప్రధానంగా కోడర్లు, రైటర్స్‌లో ఆందోళన కలిగిస్తోంది. అయినప్పటికీ OpenAI చాట్‌బాట్‌లో మానవులకు ఉన్న సృజనాత్మకత, సున్నితత్వం, ఇతర నైపుణ్యాలు లేకపోవడంతో ఎప్పటికీ మానవ ఉద్యోగాలను భర్తీ చేయలేదని నమ్ముతున్నారు. కానీ గూగుల్ మరో కోణాన్ని బయటకు తీసుకొచ్చింది. ChatGPT గూగుల్‌లో ఎంట్రీ లెవల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు గ్రేడింగ్ L3 రోల్‌కు సరిపోతుంది.

CNBC నివేదిక ప్రకారం.. గూగుల్‌ కన్వర్జేషన్‌ టెక్నాలజీ LaMDA ఆధారంగా రూపొందించిన బీటా చాట్‌బాట్‌ను పరీక్షిస్తోంది. గూగుల్‌ ChatGPT, LaMDA ప్రతిస్పందనలను పోల్చి చూసింది. ఆశ్చర్యకరంగా కోడింగ్ పొజిషన్ కోసం ఇంటర్వ్యూ చేసినప్పుడు ChatGPTని L3లో నియమించుకోవచ్చని రుజువైనట్లు గూగుల్‌ ఇంటర్నల్‌ డాక్యుమెంట్స్‌ చెబుతున్నాయి. టెస్ట్‌ సమయంలో.. గూగుల్‌ ఇంజనీర్లు LaMDA చాట్, ChatGPT రెండింటినీ భవిష్యత్తులో ప్రోగ్రామర్‌లను భర్తీ చేయబోతున్నారా అని అడిగినప్పుడు, రెండు చాట్‌బాట్‌లు అంగీకరించలేదు.

‘లేదు, చాట్‌జిపిటి, ఆల్ఫాకోడ్ ప్రోగ్రామర్‌లను భర్తీ చేయవ’ని LaMDA సమాధానం ఇచ్చింది. ఈ గూగుల్ చాట్‌బాట్ నాలుగు పేరాగ్రాఫ్‌ల వివరణ కూడా అందించింది. ప్రోగ్రామింగ్ అనేది టీమ్ స్పోర్ట్ అని, చాట్‌బాట్‌లు ప్రోగ్రామర్‌లు మరింత సమర్థవంతంగా పని చేయడంలో సహాయపడగలవని తెలిపింది. ఒక గొప్ప ప్రోగ్రామ్‌కు అవసరమైన సృజనాత్మకత, కళాత్మకతను భర్తీ చేయలేవని వివరించింది.

ఇది కూడా చదవండి :  చాట్‌జీపీటీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లాంచ్‌ చేసిన OpenAI.. ప్లాన్‌ ప్రైస్‌, బెనిఫిట్స్‌పై ఓ లుక్కేయండి

* ChatGPT స్పందన ఇలా

భవిష్యత్తులో ప్రోగ్రామర్‌లను భర్తీ చేయడం గురించి చాట్‌జిపిటి కూడా స్పందించింది. చాట్‌జిపిటి లేదా ఆల్ఫాకోడ్ ప్రోగ్రామర్‌లను భర్తీ చేయడం అసంభవమని చెప్పింది. ఎందుకంటే చాట్‌బాట్‌లు ప్రోగ్రామర్ల నైపుణ్యం, సృజనాత్మకతను పూర్తిగా భర్తీ చేయలేవని తెలిపింది. ప్రోగ్రామింగ్ అనేది కంప్యూటర్ సైన్స్ ప్రిన్సిపుల్స్‌పై లోతైన అవగాహన, న్యూ టెక్నాలజీలను అడాప్ట్‌ చేసుకునే సామర్థ్యం అవసరమని పేర్కొందని CNBC నివేదిక పేర్కొంది.

ఈ చాట్‌బాట్ వార్టన్ స్కూల్స్ MBA ఎగ్జామ్‌, US లా స్కూల్ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. ChatGPT మేధస్సును ప్రశ్నించడం సాధ్యం కాదు. విద్యార్థులు తమ అసైన్‌మెంట్‌లను పొందడానికి AI టూల్‌ వైపు మొగ్గు చూపుతున్నందున AI టూల్‌ అధ్యాపకులకు ఆందోళన కలిగిస్తోందని నివేదిక పేర్కొంది. ChatGPT యువత ఆలోచనా సామర్థ్యాన్ని, సృజనాత్మకతకు ఆటంకం కలిగిస్తుందని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *