Coca-Cola Smartphone: రియల్‌మీ నుంచి కోకా-కోలా ఎడిషన్ మొబైల్… ప్రత్యేకతలివే

రియల్‌మీ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్. రియల్‌మీ నుంచి కోకా-కోలా ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ కాబోతోంది. కొన్ని రోజులుగా కోకా-కోలా బ్రాండింగ్‌తో ఓ మొబైల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కోకా-కోలా స్మార్ట్‌ఫోన్ (Coca-Cola Smartphone) మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందా అన్న చర్చ జరిగింది. అయితే కోకా-కోలా బ్రాండింగ్‌తో రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేస్తున్నట్టు తర్వాత తెలిసింది. రియల్‌మీ ప్రో 10 5జీ కోకా-కోలా ఎడిషన్ (Realme 10 Pro Coca-Cola edition) లాంఛ్ చేస్తోంది రియల్‌మీ. ఫిబ్రవరి 10న మధ్యాహ్నం 12 గంటలకు ఈ మొబైల్‌ను రిలీజ్ చేయనుంది రియల్‌మీ. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకభాగంలో కోకా-కోలా బ్రాండింగ్, రియల్‌మీ అఫీషియల్ లోగో ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ కోకా-కోలా థీమ్ బాక్సులో వచ్చే అవకాశం ఉంది.

రియల్‌మీ గతంలో కూడా ఇలాంటి స్పెషల్ ఎడిషన్ మొబైల్స్ లాంఛ్ చేసింది. గతేడాది జూలైలో మార్వెల్ థార్: లవ్ అండ్ థండర్ మూవీ రిలీజ్ సందర్భంగా అదే థీమ్‌తో రియల్‌మీ జీటీ నియో 3 థార్ ఎడిషన్ మొబైల్ లాంఛ్ చేసింది. ఇప్పుడు కోకా-కోలాతో కలిసి స్పెషల్ మొబైల్ లాంఛ్ చేస్తోంది. ఈ స్పెషల్ ఎడిషన్ కొన్ని స్మార్ట్‌ఫోన్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. బాక్సులో కోకా-కోలా కలెక్టబుల్స్ ఉండొచ్చని అంచనా. రియల్‌మీ ప్రో 10 5జీ కోకా-కోలా ఎడిషన్ మొబైల్‌ను రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్నవారికి బహుమతుల్ని కూడా ప్రకటించిన రియల్‌మీ.

స్మార్ట్‌ఫోన్ లుక్, ప్రత్యేక ప్యాకేజింగ్ తప్ప స్పెసిఫికేషన్స్ మొత్తం రెగ్యులర్ మోడల్ లాగానే ఉంటాయి. రియల్‌మీ ప్రో 10 5జీ మొబైల్ ఇప్పటికే రెండు వేరియంట్లలో లభిస్తోంది. రియల్‌మీ ప్రో 10 5జీ కోకా-కోలా ఎడిషన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. ధర ఎంత ఉంటుందో తెలియదు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న రియల్‌మీ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‍ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999.

రియల్‌మీ ప్రో 10 5జీ స్పెసిఫికేషన్స్

రియల్‌మీ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పంచ్ హోల్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఏడాది పాపులర్ అయిన ప్రాసెసర్ ఇది. నోకియా జీ60, మోటో జీ62, వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 లైట్, పోకో ఎక్స్4 ప్రో, రెడ్‌మీ నోట్ 11 ప్రో+, ఐకూ జెడ్6, రియల్‌మీ 9 ప్రో లాంటి మొబైల్స్‌లో ఇదే ప్రాసెసర్ ఉంది.

రియల్‌మీ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 108మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో నైట్ సీన్ మోడ్, స్ట్రీట్ మోడ్, ఫోటో మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, 108M మోడ్, ప్రొఫెషనల్ మోడ్, పనోరమా మోడ్, సూపర్ టెక్స్ట్, టిల్ట్-షిఫ్ట్, గ్రూప్ పోర్ట్రెయిట్, వన్ టేక్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

రియల్‌మీ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో నైట్ సీన్ మోడ్, ఫోటో మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, పనోరమా మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 29 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. రియల్‌మీ యూఐ 4.0 + ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *