Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆంధ్రప్రభ ముత్తా గౌతమ్, ఛార్జిషీటులో ఏముందంటే

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే విజయ్ నాయర్ వ్యవహారం నడిపినట్టుగా ఈడీ ఛార్జిషీటు చెబుతోంది. అదే సమయంలో ఈ స్కాంకు కాకినాడలో కూడా తీగలున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ డైరెక్టర్ ముత్తా గౌతమ్ పేరుండటమే ఇందుకు కారణం.

ఢిల్లీ రాస్ ఎవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి కీలక పరిణామాలు వెలుగుచూశాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన 428 పేజీల ఛార్జిషీటులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరుండటం సంచలనం కల్గిస్తోంది. అదే ఛార్జిషీటులో ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ అధినేత ముత్తా గౌతమ్ పేరు కూడా ఉండటం, అతనితో కేసులోని నిందితులు ఏ విధమైన సంబంధాలు సాగాయనేది ఈడీ ఛార్జిషీటులో సవివరంగా ఉంది. 

ఈడీ ఛార్జిషీటు ప్రకారం…

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న విజయ్ నాయర్ 2022 జనవరి-ఫిబ్రవరిలో ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ ఇండియా హెడ్ ముత్తా గౌతమ్, విజయ్ నాయర్ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇండో స్పిరిట్ ఈవెంట్ నిర్వహించేందుకు విజయ్ నాయర్ ముత్తా గౌతమ్‌కు 1 కోటి 70 లక్షల రూపాయలు బదిలీ చేశాడు. కానీ ముత్తా గౌతమ్ చెప్పిన ఈవెంట్ జరగలేదు. అలా అని విజయ్ నాయర్ ఇచ్చిన 1 కోటి 70 లక్షలు తిరిగి వాపసు చేయలేదు. 

ముత్తా గౌతమ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ 

తన ఛానెల్‌లో పెట్టుబడి పెట్టాల్సిందిగా ముత్తా గౌతమ్..అభిషేక్ బోయినపల్లిని సంప్రదించాడు. ఛానెల్‌లో కొనసాగుతున్న సంప్రదింపుల కారణంగా కంపెనీ నుంచి డబ్బులు తీసుకోలేనందున తన వ్యక్తిగత ఎక్కౌంట్‌లో జమ చేయాల్సిందిగా ముత్తా గౌతమ్ కోరారు. దాంతో 2020 అక్టోబర్ 19వ తేదీన అభిషేక్ బోయినపల్లి 50 లక్షల చెక్ ఇచ్చాడు. అయితే ఛానెల్‌లో వివాదం కారణంగా..ఆ డబ్బుల్ని నవంబర్ 9వ తేదీన తిరిగిచ్చేశాడు. ఆ తరువాత ఛానెల్ ఆపరేట్ చేసేందుకు తగిన కంపెనీ టేకోవర్ కోసం తన వ్యక్తిగత ఖాతాకు డబ్బులు బదిలీ చేయాలని మరోసారి కోరాడు. దాంతో అభిషేక్ బోయినపల్లి ముత్తా గౌతమ్ వ్యక్తిగత ఎక్కౌంట్‌కు 1.08 కోట్లు బదిలీ చేశాడు.

Also read: Dow jones: అదానీ గ్రూప్‌కు మరో షాక్, అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ డోవ్ జోన్స్ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్ తొలగింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link – https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link – https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *