ప్రస్తుతం మనదేశంలో పెట్రోల్ (Petrol Price), డీజిల్ (Diesel Price) ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వాహనాలతో వాతావారణ కాలుష్యం కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజల నుంచి ఆదరణ బాగా ఉండడంతో.. కొత్త కొత్త కంపెనీలు కూడా మార్కెట్‌లోకి వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకొని.. ఎలక్ట్రిక్ వాహనాలకు ధర ఎక్కువైనా.. జనాలు వాటిని కొంటున్నారు. కొందరైతే.. తామే వాహనాలను తామే ఎలక్ట్రిక్‌గా మార్చుతున్నారు.
మొన్నటి బడ్జెట్ తర్వాత స్మార్ట్ ఫోన్ల ధరలు నిజంగానే తగ్గుతున్నాయా? పూర్తి వివరాలివే
తాజాగా పశ్చిమబెంగాల్ (West Bengal)కు చెందిన ఓ యువకుడు కూడా ఎలక్ట్రిక్ సైకిల్ (Electric Cycle)ను తయారు చేశాడు. ఆ యువకుడి పేరు హసన్ షేక్. ముర్షిదాబాద్‌లోని సాగర్‌దిఘి మండలం గోపాల్‌పూర్ అతడి స్వగ్రామం. ఈ యువకుడు ఎవరి సాయం లేకుండా.. సొంతంగా ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేశాడు.
- Coca-Cola Smartphone: రియల్మీ నుంచి కోకా-కోలా ఎడిషన్ రియల్మీ నుంచి కోకా-కోలా ఎడిషన్ మొబైల్ … ప్రత్యేకతలివే
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ , ఎల్పీజీ ధరలతో పాటు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని .. బ్యాటరీతో నడిచే సైకిల్‌ను తయారు చేశాడు హసన్. పెట్రోలు-డీజిల్ ఇంధనం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని.. అందుకే పెట్రోల్-డీజిల్‌కు బదులు ఎలక్ట్రిక్ బైక్‌లు, సైకిళ్ల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పాడు. ఈ క్రమంలోనే తాను సొంతంగా ఎలక్ట్రిక్ సైకిల్‌ను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నాడు. హసన్ తయారు చేసిన సైకిల్‌కు ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే… దాదాపు 80 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఫుల్ చార్జ్‌కు కేవలం 12 రూపాయలే ఖర్చవుతుంది. రోజూవారీ పనుల కోసం ఇది బాగా ఉపయోగపడుతుందని తెలిపాడు హసన్. చార్జింగ్ అయిపోతే.. సాధారణ సైకిళ్ల మాదిరే.. పెడల్ తొక్కుకుంటూ.. ప్రయాణాన్ని కొనసాగించవచ్చని తెలిపారు.
హసన్ షేక్ తన ఎలక్ట్రిక్ సైకిల్‌తో రోడ్డుపై వెళ్తుంటే.. స్థానిక ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంత తక్కువ ఖర్చులో ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేశాడా? అని అవాక్కవుతున్నారు. హసన్ షేక్..తమ మండలానికే గర్వకారణమని సాగర్‌దిఘి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతడి ఆలోచనా విధానాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. హసన్‌లా అందరూ పర్యావరణం గురించి ఆలోచిస్తే.. కాలుష్య సమస్య నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. భవిష్యత్‌లో బ్యాటరీతో నడిచే వాహనాలే రోడ్లపై తిరుగుతాయని.. తాము కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొంటామని కొందరు స్థానికులు తెలిపారు.