ఇది కంప్యూటర్ యుగం. ఉరుకులు పరుగుల జీవితం..! ఈ ఆధునిక కాలంలో ఎన్నో కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. మారిన ఆహార అలవాట్లు, వాతావరణ కాలుష్యం వల్ల.. మనుసుల ఆయుర్దాయం తగ్గుతుంది. ఈ కాలంలో 70 ఏళ్లు బతికితేనే మహా గొప్ప. కానీ తెలంగాణలోని ఓ పల్లెటూరిలో మాత్రం ప్రజల సగటు వయసు 90 ఏళ్ల కంటే ఎక్కువే ఉంది. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తున్నారు. దీనికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. వాళ్లంతా ప్రకృతికి దగ్గరగా బతుకుతున్నారు. పచ్చని చెట్లు, పంట పొలాలు, కొండలు, పశుపక్షాదుల మధ్య జీవనం సాగిస్తున్నారు. పాత కాలం ఆహారపు అలవాట్లు.. కాలుష్యం లేని వాతావరణం కారణంగానే.. ఈ ఊరి ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు.
Bhadradri Kothagudem: వీరి రాక కోసం ఎదురుచూసే రైతులు.. ఎందుకో తెలుసా?
అది కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రాజమ్మ తండా. చాలా చిన్న గ్రామ పంచాయతీ. ఏరి జనాభా 300 వరకు ఉంటుంది. ఇక్కడి ప్రజల్లో చాలా మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి సగటున నాలుగెకరాల పొలం ఉంటుంది. వీరి సగటు ఆయుర్దాయం 90 ఏళ్లుగా ఉంది. గత 30 ఏళ్లలో కేవలం ఏడుగురే మరణించారు. మృతుల్లో మధ్య వయస్కుల వారు ఇద్దరు మాత్రమే ఉన్నారు. అనారోగ్య సమస్యలతో వారు మరణించారు. మిగిలిన ఐదుగురిలో.. ఇద్దరు వందేళ్లు పూర్తి చేసుకున్నారు. మరో ముగ్గురు 90 ఏళ్లు పూర్తయ్యాక చనిపోయారు. ఇక్కడి ప్రజలు ప్రకృతిలో జీవిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి పీల్చుతూ.. ఆరోగ్యకరమైన ఆహారం తింటూ.. చాలా ప్రశాంతంగా బతుకుతున్నారు. అందుకే అంత ఆరోగ్యంగా ఉన్నారు.
అట్టహాసంగా మన ఊరు- మన బడి..తొలి విడతలో ఎంపికైన పాఠశాలల ప్రారంభోత్సవం
ఈ గ్రామ ప్రజల ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. మక్క రొట్టెలు.. వీరి ప్రధానమైన ఆహారం. వాటిని అల్లంవెల్లుల్లితో నూరిన కారంతో తింటారు. దాదాపు ప్రతి ఇంట్లోనూ మక్క రొట్టెలు ఉంటాయి. తమ పొలాల్లో పండించిన తాజా కూరగాయలతో కూరలు చేసుకుంటారు. ఊరిలో సిలిండర్లు వాడరు. ఏ వంట చేసినా.. కట్టెల పొయ్యి మీదే వండుకుంటారు. తండాలోని ఇళ్లల్లో టీవీ, ఫోన్ తప్ప .. ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కనిపించవు. ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, రైస్ కుక్కర్, కూలర్ వంటి గృహోపకరణాలకు దూరంగా ఉంటారు. ఈ రోజుల్లో గ్రామీణ ప్రజలు కూడా మినరల్ వాటర్, ఫిల్టర్ వాటర్ తాగుతున్నారు. కానీ రాజమ్మ తండా ప్రజలు మాత్రం.. బోరు నీళ్లే వాడుతున్నారు.
రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి.. యావత్ ప్రపంచాన్ని వణికించింది. కానీ రాజమ్మ తండాను మాత్రం ఏమీ చేయలేకపోయింది. ఇక్కడి ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం.. రోగనిరోధక శక్తి ఎక్కవగా ఉండడంతో.. ఎవరూ కూడా ఇన్‌ఫెక్షన్ బారినపడలేదు. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాల్లో స్థిరపడిన తండా వాసులు కూడా.. కరోనా సమయంలో సొంతూరికి వచ్చి.. సురక్షితంగా బయటపడ్డారు. ఇక్కడి వాతావరణం, ఆహార అలవాట్లు.. ప్రకృతి దగ్గరగా జీవించడం వంటి కారణాల వల్లే.. రాజమ్మ తండా ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారని నిపుణులు చెబుతున్నారు.