High Court: ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఐఏఎస్ ఆఫీసర్లపై మరోసారి సీరియస్ అయ్యింది. ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపు కేసులో విచారణ సందర్భంగా.. ఐఏఎస్ అధికారులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. 70 కోర్టు ధిక్కరణ కేసుల్లో ఐఏఎస్‌లు జీకే ద్వివేది, ఎస్.ఎస్ రావత్ (S.S. Rawat) హాజరుకావటంపై న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రోజూ మిమ్మల్ని చూసేందుకు చికాకు వేస్తోందని ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.
ఏపీ హైకోర్టులోనే కోర్టుధిక్కరణ కేసులు ఎక్కువ ఉన్నాయన్న ఉన్నత న్యాయస్థానం.. అధికారులు తీరు వల్లే ఈ పరిస్థితి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఐఏఎస్ అధికారులు (IAS Officers) భ్రమల్లో ఉండొద్దని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా? అని ప్రశ్నించింది. ఏమవుతుందిలే అని బరితెగింపా? అని సీరియస్ అయ్యింది. ఈ పద్ధతి సరైంది కాదని హితవు పలికింది. కోర్టు ఈ వ్యాఖ్యలు చేయడంతో.. అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలోనూ ఏపీ హైకోర్టు ఐఏఎస్ ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Latest
Andhra Pradesh News
and