horoscope today 31 January 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాశి ఫలాల గురించి తెలుసుకోవడం వల్ల భవిష్యత్తు గురించి ఒక అంచనాకు రావొచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే…
horoscope today 31 January 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు వృషభరాశిలోనే సంచారం చేయనున్నాడు. ఈరోజు రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో శని దేవుడు అస్తమించనున్నాడు. ఈ పరిస్థితుల్లో కన్య రాశి, తులా రాశులకు వారికి ఆర్థిక పరంగా మంచి లాభాలొస్తాయి. మరికొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఈరోజున ఏ రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…
మేష రాశి జాతకం 2023
|
వృషభ రాశి జాతకం 2023
|
మిధున రాశి జాతకం 2023
|
కర్కాటక రాశి జాతకం 2023
|
సింహ రాశి జాతకం 2023
|
కన్య రాశి జాతకం 2023
|
తులా రాశి జాతకం 2023
|
వృశ్చిక రాశి జాతకం 2023
|
ధనస్సు రాశి జాతకం 2023
|
మకర రాశి జాతకం 2023
|
కుంభ రాశి జాతకం 2023
|
మీన రాశి జాతకం 2023
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారులు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. మీకు పని పట్ల ఆసక్తి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడతారు. పని విషయంలో ఈరోజు కఠోర శ్రమ కారణంగా మంచి ఫలితాలను పొందుతారు. అయితే ప్రేమ జీవితంలో ఉండే వారు కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆరోగ్య పరంగా కొంత బలహీనంగా ఉండొచ్చు.
ఈరోజు మీకు 71 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు పేదలకు మీ సామర్థ్యం మేరకు సహాయం చేయాలి.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు గ్రహాల కదలిక వల్ల కుటుంబ జీవితంలో, ఉద్యోగం చేసే ప్రాంతంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీకు మానసికంగా కొన్ని ఆందోళనలు చుట్టుమడతాయి. మీ ఖర్చులు కూడా పెరగొచ్చు. మీ ఆదాయం బాగానే ఉంటుంది. ఈరోజు మీరు శారీరకంగా చాలా బలంగా ఉంటారు. మీరు పనికి సంబంధించి మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీరు చేసే పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
ఈరోజు మీకు 95 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు రావి చెట్టు కింద 5 దీపాలను వెలిగించాలి.
మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు పనితో పాటు కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు. ప్రేమ జీవితంలో ఉండే ఈరోజు మంచిగా ఉంటుంది. అయితే మీ వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పనికి సంబంధించి ఈరోజు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పనితీరు బాగుండటంతో ప్రశంసలు పొందుతారు.
ఈరోజు మీకు 82 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పఠించాలి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు గ్రహాల కదలిక వల్ల కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కొంత సమయాన్ని కేటాయిస్తారు. ఈరోజు మీరు పరిస్థితులకు అనుగుణంగా జీవించే అలవాటును పెంపొందించుకుంటారు. దీని వల్ల మీరు ఆనందంగా గడుపుతారు. మీ తోబుట్టువులో సంబంధం బలంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. ఉద్యోగులకు ఈరోజు మంచిగా ఉంటుంది.
ఈరోజు మీకు 76 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు శ్రీ విష్ణుమూర్తిని ఆరాధించాలి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీకు శారీరక సమస్యలు రావొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత బలహీనంగా ఉంటుంది. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి, ప్రేమ ఉంటుంది. ప్రేమ జీవితంలో ఉన్న వారికి ప్రతికూలంగా ఉంటుంది.
ఈరోజు మీకు 89 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రేమ జీవితంలో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. వివాహితులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి కొంత లాభాలొచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు ఏదైనా కొత్త బిజినెస్ ఆర్డర్లను పొందొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో మంచిగా ఉంటుంది.
ఈరోజు మీకు 97 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు గాయత్రీ చాలీసా పఠించాలి.
Astrology Tips ఈ 6 రోజుల్లో కపుల్స్ పొరపాటున కూడా కలయికలో పాల్గొనకూడదు… ఎందుకో తెలుసా…
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు పనుల్లో బిజీగా గడుపుతారు. మీ ఆరోగ్యం బలంగా ఉంటుంది. మీకు ఆకస్మికంగా డబ్బు రావడం వల్ల పరిస్థితులు మెరుగుపడతాయి. కొన్ని కారణాల వల్ల మీ కుటుంబంలో ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. మీరు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. ప్రేమ జీవితంలో ఉండే వారికి కొంత ఆందోళన ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది.
ఈరోజు మీకు 92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి.
వృశ్చిక రాశి వారి ఫలితాలు (Scorpio Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత ప్రతికూలంగా ఉంటుంది. మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఈ కారణంగా మీకు పని చేయాలని అనిపించదు. వివాహితులకు జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ప్రేమ జీవితంలో ఉండే వారికి సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీటిని అందించాలి.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు ఎక్కడి నుంచైనా డబ్బు వస్తుంది. ఈ కారణంగా మీ పెండింగ్ పనులన్నీ తిరిగి ప్రారంభమవుతాయి. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆహారం, పానీయాల పట్ల శ్రద్ధ వహించాలి. మీ కుటుంబ వాతావరణం పూర్తి అవగాహనతో ఉంటుంది. ప్రేమ జీవితంలో ఉండే వారికి ఈరోజు బాగానే ఉంటుంది. వివాహితులకు ఈరోజు కొంత ఆందోళనకరంగా ఉంటుంది.
ఈరోజు మీకు 89 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి బయటి ఆహారం తినడం మానుకోవాలి. మీరు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు నిర్ణయాలను వేగవంతంగా తీసుకోవాలి. అప్పుడే మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో పనిపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. వివాహితులకు ఈరోజు సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో కలిసి బయటికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.
ఈరోజు మీకు 79 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు గోమాతకు పచ్చి గడ్డిని తినిపించాలి.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు గ్రహాల కదలిక కారణంగా ఆరోగ్యం క్షీణించొచ్చు. ఈ కారణంగా మీరు ఇబ్బంది పడతారు. మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. మీరు కటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది. వివాహితులకు ఈరోజు మంచిగా ఉంటుంది. పిల్లల విషయంలో ఈరోజు కొన్ని ప్రణాళికలు వేస్తారు. ప్రేమ జీవితంలో ఉండే వారికి ఆనందంగా ఉంటుంది.
ఈరోజు మీకు 66 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు అనేక రకాల ఆలోచనలు వస్తాయి. వ్యాపారులకు ఈరోజు ఆందోళనలు పెరుగుతాయి. పనికి సంబంధించి మంచి ఫలితాలొస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది. వివాహితులు తమ జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ జీవితంలో ఉండే వారు ఈరోజు భాగస్వమితో సంతోషంగా గడుపుతారు.
ఈరోజు మీకు 88 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి.
గమనిక :
ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.
Read
Latest Astrology News
and