Ind vs Aus: నాగ్పూర్ చేరుకున్న టీమిండియా ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో జరిగబోయే టెస్ట్ సిరీస్ (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) కోసం టీమిండియా నాగ్ పూర్ చేరుకుంది. పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించడానికి ఇప్పటినుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. మిగతా ప్లేయర్లతో పాటు పెళ్లి లీవ్ లో ఉన్న కేఎల్ రాహుల్, గాయం కారణంగా ఆటకు దూరమైన రవీంద్ర జడేజా జట్టులో చేరారు. టీమిండియా నాగ్ పూర్ ఎయిర్ పోర్ట్ చేరుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ టెస్ట్ సిరీస్ టీమిండియాకు కీలకం కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్స్ ఫైనల్స్‌లో భారత్ అవకాశాలు సన్నగిల్లకుండా ఉండాలంటే ఈ సిరీస్ తప్పకుండా గెలవాలి. ఈ సిరీస్ ని భారత్ 3-1తో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ తో తలపడే అవకాశం ఉంటుంది.
టెస్టు సిరీస్ షెడ్యూల్:
* ఫిబ్రవరి 9- 13: నాగ్‌పూర్
* ఫిబ్రవరి 17- 21: ఢిల్లీ
* మార్చి 1-5: ధర్మశాల
* మార్చి 9- 13: అహ్మదాబాద్
©️ VIL Media Pvt Ltd.