Jasprit Bumrah Comeback: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో జస్ప్రీత్‌ బుమ్రా!

Jasprit Bumrah likely to play India vs Australia 3rd Test after Injury: స్వదేశంలో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త. గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా.. తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా మార్చి 1న ఆరంభం కానున్న మూడో టెస్టుకు పేస్ గుర్రం అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బుమ్రా పునరావాసం పొందుతున్నాడు.

వెన్ను నొప్పి కారణంగా జస్ప్రీత్‌ బుమ్రా సెప్టెంబర్ 2022 నుంచి క్రికెట్ ఆడలేదు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ సిరీస్, ఆసియా కప్ 2022, ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2022 ఆడలేదు. గాయం కారణంగా జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం అనంతరం.. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో జరిగిన ‘మాస్టర్ కార్డ్’ వన్డే సిరీస్‌కు బుమ్రాను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదని మళ్లీ జట్టు నుంచి తప్పించింది. అప్పటినుంచి అతడు ఎన్‌సీఏలోనే ఉన్నాడు. 

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగే మొదటి రెండు టెస్టులకు బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది. ఈలోగా జస్ప్రీత్‌ బుమ్రా పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించాడు. నెట్స్‌లో బౌలింగ్‌ కూడా ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కీలకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని మిగతా రెండు టెస్టులకు అతడిని ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోందట. ‘జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నాడు. నెట్స్‌లో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. త్వరలోనే జట్టుకు అందుబాటులో ఉంటాడు’ అని ఎన్‌సీఏ అధికారి ఒకరు తెలిపారు. 

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ చేరాలంటే టీమిండియాకు బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ చాలా కీలకం. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే ఫైనల్‌కు చేరుకుంటుంది. పాయింట్ల పట్టికలో 75.56 శాతంతో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా.. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరింది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌ వేదికగా జరగనున్న భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.

Also Read: Joginder Sharma Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 2007 టీ20 ప్రపంచకప్‌ హీరో!  

Also Read: Mahindra Electric SUV: మహీంద్రా నుంచి 5 ఎలక్ట్రిక్ కార్లు.. ఇక టాటాకు ‘టాటా బై-బై’ చెప్పాల్సిందే!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *