Jeans : ప్రజెంట్ సెలబ్రిటీలు కూడా ఇష్టపడే జీన్స్ ఇవే..

Jeans : స్కిన్నీ జీన్స్.. శరీరానికి అతుక్కుపోయినట్లుండే ఈ జీన్స్ ఒకప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ సృష్టించింది. కానీ, ఇప్పుడు వీటి ప్లేస్‌‌లో వేరే జీన్స్ వచ్చాయా.. స్కిన్నీ జీన్స్‌‌కి ఆదరణ తగ్గిందా పూర్తి వివరాలు చూద్దాం.

జీన్స్.. ఎప్పటికీ ట్రెండ్.. కానీ, ఇందులోనూ కొన్ని ట్రెండ్స్ ఉన్నాయి. అవి స్కిన్నీ జీన్స్, బ్యాగీ జీన్స్, ఫ్లేర్డ్, బూట్ కట్స్, బెల్ బాటమ్స్.. ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. అయితే, ఒకప్పుడు స్కీన్నీస్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు. కానీ, నేడు తగ్గుతుందని చెబుతున్నారు ఫ్యాషన్ ఎక్స్‌పర్ట్స్. దీనికి కారణాలు లేకపోలేదు. సౌకర్యంగా ఉండడం, రెగ్యులర్‌ స్కిన్నీస్ వేసి బోర్ కొట్టడం, సెలబ్రిటీలను ఫాలో అవ్వడం ఇవన్నీ కారణాలే పూర్తి వివరాలు చూద్దాం.

జీన్స్‌కి అడిక్ట్..

నీ జీన్ ప్యాంట్ చూసి బుల్లమ్మో.. నైంటీస్‌లో వచ్చిన ఈ సాంగ్ ఓ ఊపు ఊపింది. ఎంత పాపులర్ కాకపోతే జీన్ ప్యాంట్ మీదనే ఓ పాట రాసేసి ఉంటారు. ఎప్పట్నుంచో జీన్స్‌కి అలవాటు పడ్డ కుర్రకారు వాటిలోకి ఎన్ని రకాలు తీసుకొస్తే అన్ని రకాలని తమ వార్డ్‌రోబ్‌లోకి తీసుకొచ్చారు. మొదట్లో జీన్స్ కొద్దిగా వదులుగా ఉండేవి. కానీ, రానురాను అవి కాస్తా టైట్‌గా అయిపోయాయి. వీటికి అప్‌గ్రేడ్ మోడలే స్కిన్నీ జీన్స్.

Also Read : Paralysis Treatment : పక్షవాతం వచ్చిన 3 గంటల్లో ఇలా చేస్తే సమస్య దూరం..

స్కిన్నీ జీన్స్‌తో పర్ఫెక్ట్ షేప్..

ఈ జీన్స్ వేసుకోవడం వల్ల పర్ఫెక్ట్ షేప్ ఎలివేట్ అవ్వడంతో చాలా మంది వీటిని వేసుకునేందుకు ఆసక్తి చూపేవారు. ముఖ్యంగా సెలబ్రిటీలను చూసి వారిని ఫాలో అయ్యేవారు. వీరికనుగుణంగా ఫ్యాషన్ డిజైనర్స్ కూడా రకరకాల మోడల్స్‌లో స్కిన్నీని తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేశారు. అవన్నీ చాలా ఫేమస్. ప్రతి ఒక్క అమ్మాయి స్కిన్నీ జీన్స్ వేసుకుని మురిసిపోయేవారు.

మహమ్మారితో..

మహమ్మారి వచ్చాక చాలా వరకూ జనాలు ఇంటికి పరిమితం అయ్యారు. ఆ సమయంలో సౌకర్యవంతమైన బట్టలు వేసుకోవడం మొదలుపెట్టారు. అదే సమయంలో జీన్స్‌ల్లోనూ బ్యాగీ, రిలాక్డ్స్ జీన్స్‌ల్లోకి వచ్చారు. ఇక పిల్లలు ఉన్నవారికి ఈ బ్యాగీ ప్యాంట్స్ సౌకర్యవంతంగా ఉండడంతో వీటికి షిఫ్ట్ అయ్యారు.

Also Read : Cupboard : కప్‌బోర్డ్స్ చేయించుకోవాలనుకుంటున్నారా.. ఈ డిజైన్స్ బావుంటాయి..

సెలబ్రిటీలు..

రోజుకో ఫ్యాషన్‌తో కనిపించే సెలబ్రిటీలు సైతం టైట్ ప్యాంట్స్ బదులు లూజ్, ఫ్లేర్డ్ జీన్స్‌కి రావడం కూడా స్కిన్నీ జీన్స్‌ అమ్మకాలపై ఎఫెక్ట్ చూపించాయి. చాలా మంది సెలబ్రిటీలు ఫ్రీగా తమకు నచ్చిన లూజ్ ప్యాంట్స్‌లలో దర్శనమివ్వడంతో చాలా మంది వాటిని ఫాలో అవుతూ అటు షిఫ్ట్ అవుతున్నట్లు ఫ్యాషన్ డిజైనర్స్ చెబుతున్నారు.

Also Read : Healthy Foods : ఉదయాన్నే వీటిని తింటే రోజంతా యాక్టివ్‌గా ఉంటారట..

ప్రజెంట్ ట్రెండ్‌లో ఉన్న జీన్స్..

జనవరి 2020-21 వరకు ఫుల్ ఫామ్‌లో ఉన్న స్కిన్నీ జీన్స్. ఇప్పుడు స్కిన్నీ జీన్స్ వర్సెస్ రిలాక్డ్స్ ఫిట్ జీన్స్ అనే చర్చకు దారి తీసుంది. స్కిన్నీ జీన్స్‌ని కొనేవారి సంఖ్య తగ్గి స్ట్రెయిట్ లెగ్ జీన్స్, లూజ్ జీన్స్, బ్యాగీ జీన్స్, మామ్ జీన్స్‌ కొనుగోళ్ళు చేసేవారి సంఖ్య పెరిగిందని చెబుతున్నారు ఫ్యాషన్ ఎక్స్‌పర్ట్స్. మొత్తానికీ స్కిన్నీ జీన్స్ వాడుతున్నప్పటికీ, వాటితో పాటు బ్యాగీ ట్రెండ్, రిలాక్డ్స్ ఫిట్ జీన్స్ తరం నడుస్తోందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *