K Viswanath: కే. విశ్వనాథ్ డైరెక్షన్‭లోనే పవన్ మొదటి సినిమా

K Viswanath: కే. విశ్వనాథ్ డైరెక్షన్‭లోనే పవన్ మొదటి సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రంగం ప్రవేశం చేసింది లెజెండరీ డైరెక్టర్ కే.విశ్వనాథ్ డైరెక్షన్ లోనే అన్న విషయం చాలా మందికి తెలియదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన శుభలేఖ సినిమాలో విశ్వనాథ్ డైరెక్షన్‭లో పవన్ మొట్టమొదటిగా తన గొంతు వినిపించారు. కాని పవన్ మొదటి సినిమా అనగానే అందరికి ఇవివి సత్యనారాయణ డైరెక్షన్లో తెరకెక్కిన ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి, గుర్తుకు వస్తుంది. నిజానికి పవన్ అనుకోకుండానే.. శుభలేఖ సినిమాలో డబ్బింగ్ చెప్పారు. అప్పట్లో అంటే చిరంజీవి హైదరాబాద్ కు షిప్ట్ కాకముందు  మద్రాసులో నివాసం ఉండేవారు. అ సమయంలో చిరంజీవి కె. విశ్వనాథ్ కాంబోలో తొలి సినిమా శుభలేఖ డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.అప్పుడు పవన్ వయసు పదహారేళ్లు ఉంటాయి. స్కూల్ అయిపోగానే డబ్బింగ్ థియేటర్‭కు వెళ్లిన పవన్‭ను విశ్వనాథ్ చూశారట.  “మంచినీళ్లు ఎక్కడ సార్” అనే ఓ చిన్న డైలాగ్ ను పవన్ తో చెప్పించారు. ఇప్పటికీ ఆసీన్లో పవన్ గొంతు సినిమాలో వినిపిస్తుంది. అదే సినీ రంగంలోకి ఆయన ఫస్ట్ ఎంట్రీ. ఒక రకంగా చెప్పాలంటే కళ్యాణ్ సినీ రంగ ప్రవేశం.. కళాతపస్వి కె. విశ్వనాథ్ సినిమాతో జరిగిపోయిందని చెప్పవచ్చు. కె. విశ్వనాథ్ మరణించడంతో పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. ఆయనతో అనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 

  ©️ VIL Media Pvt Ltd.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *