Mayagadu Movie Review : నవీన్ చంద్ర మాయగాడు ఎలా ఉందంటే?

Mayagadu Movie Review రొటీన్ లవ్ స్టోరీలు, యాక్షన్ చిత్రాలు అని కాకుండా అన్ని రకాల జానర్లతో ప్రయోగాలు చేస్తున్నాడు నవీన్ చంద్ర. సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంటూ నవీన్ చంద్ర అందరినీ మెప్పిస్తున్నాడు. ఇప్పుడు పూజా ఝావేరి, గాయత్రీ సురేష్‌లతో కలిసి వస్తున్నాడు. అడ్డా  సినిమాను తెరకెక్కించిన జీ.ఎస్. కార్తీక్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా ‘మాయగాడు’. స్వాతి పిక్చర్స్ బ్యానర్‌ లో, భార్గవ్ మన్నె ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ రోజు చిత్రం నేడు విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం. 

కథ

మాయగాడు కథ అంతా కూడా కాకినాడ బ్యాక్ డ్రాప్‌లో జరుగుతుంది. పైరసీ సీడీల షాప్ ఓనర్‌ అయిన రవి(నవీన్ చంద్ర) ఆకతాయిగా తిరుగుతుంటాడు. పైరసీ చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న సిరి(గాయత్రి సురేష్) రవిని పోలీసులకి పట్టిస్తుంది. రవి అప్పటి నుంచి సిరి వెనక పడుతుంటాడు.  రవి ప్రేమలో సిరి ఎలా పడింది?, పూజా ఝావేరితో రవికి ఉన్న రిలేషన్ ఏంటి? ఆమె అన్నయ్య ఆంటోని(అభిమన్యు సింగ్)నవీన్ చంద్రని ఎందుకు చంపాలనుకుంటాడు? చివరకు రవి కథ ఎలా యూటర్న్ తిరుగుతుంది? అనేది థియేటర్లో చూడాల్సిందే.

నటీనటులు

నవీన్ చంద్రకు ఇలాంటి పాత్రలు వెన్నతో పెట్టిన విద్య. ఇందులోనూ నవీన్ చంద్ర ఆకట్టుకున్నాడు. అల్లరి కుర్రాడిగా కనిపించి మెప్పించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ అదరగొట్టేశాడు. పూజా ఝావేరి తన నటనతో పాటు అందంతో మెప్పించింది. గాయత్రి సురేష్ సంప్రదాయ బద్దమైన లుక్కులో కనిపించి ఆకట్టుకుంది. అభిమన్యు సింగ్ పాత్ర కొత్తగా అనిపిస్తుంది. మెంటల్ ఇన్నోసెంట్ కిల్లర్‌లా బాగా చేశాడు. కబీర్ దుల్హన్ సింగ్ పాత్ర కూడా మెప్పిస్తుంది. మిగిలిన పాత్రలన్నీ తమ పరిధి మేరకు మెప్పిస్తాయి.

విశ్లేషణ 

మాయగాడు ప్రథమార్థం అంతా కూడా నవీన్ చంద్ర, హీరోయిన్ల మధ్య వచ్చే సీన్లతో నడుస్తుంటుంది. ప్రథమార్థం ప్రారంభంలో వచ్చే కొన్ని సీన్లు మాత్రం నీరసంగా సాగుతుంటాయి. అవి సాగదీతగా అనిపిస్తాయి. ఫ్రెండ్ గీత పెళ్లి మ్యాచెస్ కోసం కాకినాడకి వస్తుంది సిరి. పైరసీ చేస్తున్న నవీన్ చంద్ర కి బుద్ధి చెప్పే ప్రయత్నంలో చివరకు అతని వలలో చిక్కుకుంటుంది. 

అదే  సమయంలో పూజా ఝావేరితో ట్రాక్ ఏర్పడుతుంది. పూజా ఝావేరి తన అన్నయ్య ఒక కిల్లర్ అని చెప్పినా కూడా రవి పట్టించుకోకుండా  చుట్టూ తిరుగుతాడు. ఒక రోజు ఆంటోని(అభిమన్యు సింగ్)కి ఈ ఇద్దరూ అడ్డంగా దొరుకుతారు. అలా సీన్లన్నీ ముందుకు వెళ్తుంటాయి. పాటలు అయితే స్పీడు బ్రేకుల్లా అనిపిస్తాయి. నవీన్ చంద్ర అండ్ గాయత్రి సురేష్ ఇద్దరు బాగా దగ్గరవ్వతున్న సమయంలో బ్రేకప్ అవ్వుతుంది. అలా ప్రథమార్థం కూడా ముగుస్తుంది.

ద్వితీయార్థంలో.. ప్లే బాయ్ నుంచి లవర్ బాయ్‌గా రూపాంతరం చెందుతాడు. అయితే ఎమోషనల్ సీన్స్ మాత్రం అంతగా నప్పవు. సినిమాలో అభిమన్యు సింగ్ చేసే కామిడి నిడివి తక్కువే అయినా ఆద్యంతం నవ్విస్తూనే ఉంటుంది. క్లైమాక్స్‌లో పైరసీ కోసం ఫ్యాన్స్‌తో పోరాటం చేయించిన తీరు బాగున్నప్పటికీ అంత ప్రభావం చూపించినట్టు అనిపించదు. క్లైమాక్స్ కాస్త నీరసంగా అనిపించినా మెప్పించే అవకాశం ఉంది.

దర్శకుడు జి కార్తిక్ రెడ్డి మేకింగ్ ఓకే అనిపిస్తుంది. క్యాస్టింగ్ మీద బాగానే ఫోకస్ పెట్టాడనిపిస్తుంది. కథ, కథనంలో కొత్తదనం ఏమీ లేకపోయినా కొన్ని సీన్స్ మెప్పిస్తాయి. జునైద్ సిద్దిఖ్ ఎడిటింగ్, సినిమాటోగ్రాఫర్ వెంకట్ గంగాధరి విజ్యువల్స్, అనూప్ రూబెన్స్ మ్యూజిక్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్ని కూడా మెప్పిస్తాయి.

రేటింగ్: 2.75

Also Read:  K Viswanath: కళాతపస్వి కే విశ్వనాధ్ కెరీర్‌లో శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం అన్నీ విజయాలే

Also Read: K Vishwanath’s Death News: కె.విశ్వనాథ్ మృతి.. స్పందించిన చిరంజీవి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *