Planetary Transits in February 2023 ఫిబ్రవరిలో 4 ప్రధాన గ్రహాల సంచారం… ఈ 5 రాశులను వరించనున్న అదృష్టం…!

Planetary Transits in February 2023 వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారినప్పుడు అనేక సంఘటనలు జరుగుతాయి. అంతేకాదు ప్రజల జీవితాల్లోనూ మార్పులు సంభవిస్తాయి.

Planetary Transits in February 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో ప్రతి ఒక్క గ్రహం నిర్దిష్ట వ్యవధిలో తన స్థానం నుంచి మరో స్థానంలోకి మారుతూ ఉంటుంది. ఇలా మారే క్రమంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మార్పులొస్తాయి. ఈ నేపథ్యంలో 2023లో ఫిబ్రవరి నెలలో గ్రహాల సంచారం చాలా కీలకంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి. ముందుగా బుధుడు, సూర్యుడు, శుక్రుడితో పాటు రాహువు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయనున్నారు. అంతేకాదు బుధుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు బుధాదిత్య యోగాన్ని ఏర్పరచనున్నారు. ఈ సమయంలో ద్వాదశ రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. అయితే మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంగా ఫిబ్రవరి మాసంలో ఏయే గ్రహాలు ఎప్పుడెప్పుడు తమ స్థానాలను మారనున్నాయి. ఈ గ్రహాల సంచారం వేళ ఏ రాశులకు అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

మకరంలోకి బుధుడి ఎంట్రీ..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, బుధుడిని మేధస్సు, అందానికి ప్రతీకగా పరిగణిస్తారు. మిధునం, కన్యరాశులకు బుధుడు అధిపతిగా ఉంటాడు. ఈ నేపథ్యంలో 2023లో ఫిబ్రవరి 7వ తేదీన మంగళవారం ఉదయం 7:11 గంటలకు గురుడి ఆధీనంలో ఉన్న ధనస్సు రాశి నుంచి నిష్క్రమించి, శని దేవుడు పాలించే మకరంలోకి సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో ఫిబ్రవరి 27వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు. అనంతరం కుంభరాశిలోకిస సంచారం చేయనున్నాడు.

Powerful Dhana Yogas 20 ఏళ్ల తర్వాత శక్తివంతమైన ధన రాజయోగాలు.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే…!

కుంభంలోకి సూర్యుడి సంచారం..

గ్రహాలకు రారాజుగా పరిగణించే సూర్యుడు 13 ఫిబ్రవరి 2023 సోమవారం రోజున ఉదయం 9:21 గంటలకు మకరం నుంచి కుంభరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ రాశిలో ఇప్పటికే శని, శుక్రుడు నివాసం ఉంటున్నారు. సూర్యుడు మార్చి 15వ తేదీ వరకు ఇదే రాశిలో ఉండి మీనరాశిలోకి రవాణా చేయనున్నాడు. ఈ మాసంలో అత్యంత గ్రహాల ముఖ్యమైన రవాణాల్లో ఇదొకటి.

మీన రాశిలో శుక్రుడి రవాణా..

నవ గ్రహాలలో శుక్రుడిని ఆనందం, ఆదాయం, ఐశ్వర్యానికి ప్రతీకగా పరిగణిస్తారు. అంతటి గొప్ప ప్రాముఖ్యత ఉన్న శుక్రుడు 15 ఫిబ్రవరి 2023న రాత్రి 7:43 గంటలకు కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో 12 మార్చి 2023 వరకు నివాసం ఉండనున్నాడు. శుక్రుడి రవాణా సమయంలో కొందరికి ప్రయోజనకరమైన ఫలితాలొస్తాయి.

మీనంలోకి నెఫ్ట్యూన్ సంచారం..

2023లో నాలుగో గ్రహ సంచారం ఫిబ్రవరి 18వ తేదీన జరగనుంది. శుక్రుడు, గురుడు ఉన్న మీనరాశిలోకే నెఫ్ట్యూన్ రవాణా జరగనుంది. ఈ గ్రహాన్నే ‘వరుణ గ్రహం’ అని కూడా అంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నెఫ్ట్యూన్ విజయానికి, ప్రజాదరణకు ప్రతీకగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలో అయితే ఈ గ్రహం స్థానం బలంగా ఉంటుందో వారికి విజయం దక్కుతుంది. ఈ నాలుగు గ్రహాల సంచారం కారణంగా ఐదు రాశులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.

February Horoscope 2023 ఫిబ్రవరిలో ఈ మూడు రాశుల వారికి అద్భుతమైన విజయాలు..! ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి…

మేష రాశి(Aries)..

ఫిబ్రవరి మాసంలో నాలుగు గ్రహాల సంచారం కారణంగా ఈ రాశులకు సానుకూల ఫలితాలొస్తాయి. మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీకు రావాల్సిన బకాయిలన్నీ అందుతాయి. ఈ కాలంలో మీరు పెట్టే పెట్టుబడుల వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. గ్రహాల ప్రభావంతో స్నేహితుల పూర్తి మద్దతును పొందుతారు. అయితే ఈ కాలంలో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి.

కర్కాటక రాశి(Cancer)..

ఈ రాశి వారికి ఫిబ్రవరిలో నాలుగు గ్రహాల కదలిక వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీకు పూర్వీకుల ఆస్తి లభించే అవకాశం ఉంది. శుక్రుడి ప్రభావంతో కొత్త వ్యాపార అవకాశాలొస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే లావాదేవీల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగులు తమ ప్రయత్నాల్లో సీనియర్ల మద్దతు పొందుతారు.

కన్య రాశి (Virgo)..

ఈ రాశి వారికి నాలుగు గ్రహాల సంచారం కారణంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు అనేక అవకాశాలు వస్తాయి. మీరు మీ ఇంట్లో ఏదైనా మతపరమైన కార్యకలాపాలను కూడా నిర్వహించొచ్చు. ఉద్యోగులు డబ్బు ఆదా చేసుకుంటారు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగాన్వేషణలో శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ఈ కాలంలో లాభదాయకంగా ఉంటుంది.

తులా రాశి (Libra)..

ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు కొన్ని తీర్థయాత్రలకు ప్లాన్ చేసుకోవచ్చు. దీని వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సొంతంగా వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఈ సమయంలో గ్రహాల ప్రభావం వల్ల ఆర్థిక పరంగా లాభపడతారు. మరోవైపు విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల ఈ నెలలో నెరవేరుతుంది.

కుంభ రాశి (Aquarius)..

ఈ రాశి వారికి ఈ నెలలో ప్రయోజనకరంగా ఉంటుంది. శుక్రుడు, సూర్యుడు, బుధ గ్రహాల కలయిక వల్ల మీ జీవితంలో అనేక మార్పులొస్తాయి. మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఈ కాలంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లొచ్చు. మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. వ్యాపారులు ఈ కాలంలో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంది.

గమనిక

: ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.

Read

Latest Astrology News

and

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *